Suryaa.co.in

Andhra Pradesh Political News

జగ(న్) “మాయ”లో బక్కచిక్కిన సీమ

ప్రతిపక్ష నాయకునిగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న క్రమంలో అన్నివర్గాలకు ఆశలు కల్పించినట్లే, రాయలసీమ ప్రాంతంలోని ప్రజల కడగండ్లు తీరుస్తానని, వలసలు ఆపుతానని, నిరుద్యోగ ఉపాధి కల్పనకోసం పరిశ్రములు తీసుకొస్తానని, త్వరితగతిన నత్తనడకన సాగుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడమే నా మొదటి ప్రాధాన్యత అంటూ ప్రజలకు కోటి ఆశలు రేకిత్తించాడు.

మరోవైపు తన షాడో మేధావుల బృందాన్ని తయారుచేసి, సీమకు అన్యాయం జరిగిపోతుంది. దానికి ప్రత్యామ్న్యాయం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడమే ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నట్టు, రాయలసీమ వాదం పేరుతో కాస్తో కూస్తో పేరున్న కుహానా మేధావుల బృందంతో యువత, విశ్వవిద్యాలయాలే కేంద్రంగా సెంటిమెంట్ ని రాజేసి, 2019వ సంవత్సరపు ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డికి ఓట్ల రూపంలో మరల్చేలా వ్యూహం పన్నారు.

ఈ సందర్భంలో ప్రజలు సైతం పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు మరియు ఫ్యాక్షన్ రాజకీయాలకు అతీతంగా, చరిత్రలో మొదటిసారి సీమలోని 52 అసెంబ్లీ స్థానాలకు గాను, 49 స్థానాలను ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ ఒక్క ప్రాజెక్ట్ పూర్తిచేసిన పాపాన పోలేదు. కరువు సీమలో “డ్రిప్” విధానం కారణంగా సిరులు పండిస్తున్న సీమప్రజానీకానికి రాయతీలు తొలగింపు? రాయతీతో కూడిన పనిముట్లు సైతం రాకపోవడం కారణంగా వ్యవసాయం పెనుభారం అయినది. చివరకు, తన తండ్రి ఆశయాం అయిన ప్రాజెక్టుల నిర్మాణమును సైతం తుంగలో తొక్కాడు.

కడప-బెంగళూరు రైల్వేలైన్ 300 కి.మీ.ల నిర్మాణాలకు గాను, కేంద్రం మొగ్గుచూపుతూ వేగవంతమైన నిర్మాణం చేస్తూవుంటే, జగన్మోహన్ రెడ్డిగారు మాత్రం దానికి భూసేకరణలాంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం వైపునుండి అందించకుండా, కేవలం 70 కి.మీ.లకే పరిమితంచేసి ముదిగుబ్బ రైల్వేలైన్ కు అనుసంధానంచేసి, రాయచోటి మరియు పీలేరు ప్రజలు రైలు కూత వినాలన్న చిరకాల స్వప్నానికి చరమగీతం పాడాడు. చివరకు నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ నిర్మాణం కొరకు కేంద్రం ఇతోధికంగా ఆర్ధిక సహకారం అందిస్తున్నప్పటికి, అందుకోలేని “అసమర్ధ స్థితి”లో రాష్ట్ర ప్రభుత్వం వుంది.

“రాయలసీమ నినాదం” బి.జే.పి.కే సొంతం
bjp-flagసీమలో కరువు కోరల నుండి విముక్తి కలగాలంటే, పోతిరెడ్డిపాడు విస్తరణే శరణ్యమని ఆనాటి బి.జే.పి రాష్ట్ర అధ్యక్షుడు, నేటి దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు , పి.వి. చలపతి గారు స్వర్గీయ మాజీ యం.పి. జంగారెడ్డి జూపాడు బంగ్లా వద్ద 1985లో చేసిన ఉద్యమం కావచ్చు లేదా.. పెత్తందారి వ్యవస్థ, మరోవైపు తుపాకీ గొట్టాలు బహిర్గతంగా ప్రదర్శిస్తూ, ఫ్యాక్షనిజం పేరుమీద ఆడవారి మెడలో పుస్తెలు తెంచుతున్న సమయంలో, దీనికి ప్రత్యామ్నాయ అన్వేషణలో సామాజిక బాధ్యతగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రజలలో చైతన్యం తెస్తూ, ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, తుపాకీ లైసెన్సులు రద్దు చేయాలని ఆనాటి రాష్ట్రప్రభుత్వం మీద ఉద్యమంలో బాగంగా “శాంతి కోసం – నీటి కోసం” స్వర్గీయ  చిలకం రామచంద్రారెడ్డి నాయకత్వంలో 1994లో 1050 కి.మీ.లు చేసిన సుధీర్గ పాదయాత్ర, తదనంతరం 1998లో జరిగిన గోదావరి జలాల మళ్లింపు, గాలేరు-నగరి, హంద్రి-నీవ ప్రాజెక్టుల నిర్మాణం కొరకు సీమనాయకులు విడతల వారిగ కేశవ చౌదరి,  శాంతా రెడ్డి, కపిలేశ్వరయ్య, చల్లపల్లి నరసింహ రెడ్డి గార్ల పోరాటం మరపురానిది.

ఈ ఉద్యమం సందర్బంగా కేశవ చౌదరి లాంటి సీనియర్ నాయకులను కోల్పోవడం దురదుష్టకరం. ఈ పాదయాత్రల స్పూర్తితోనే, ఆనాటి ముఖ్యమంతి యన్.టి.ఆర్ ప్రభుత్వం నుండి వై.యస్. రాజశేఖర్ రెడ్డి హయాం వరకు ఎంతో కొంత ప్రాజెక్టుల పురోగాభివృద్ధి జరిగినది.

నేటి జగన్మోహన్ రెడ్డి ఆ స్పూర్తిని అందిపుచ్చుకొని అడుగులు వేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. వున్న నీటి ప్రాజెక్టులను సైతం కాపాడలేనటువంటి అసమర్దుడిగా వాసికెక్కాడు అందుకు తార్కాణం ఇతను భాధ్యతలు చేపట్టినప్పటి నుండి 1000 రోజుల కాల వ్యవధిలో పింఛా, అన్నమయ్య డ్యాంలు రెండుసార్లు కొట్టుకుపోయాయి. మొన్నటికిమొన్న వచ్చే వరదను అంచనావెయ్యలేక, ఇసుక బకాసురుల స్వార్ధం కారణంగా 33 మంది అమాయక రైతుల ప్రాణాలు వరదకు ఆహుతయ్యాయి.

కోట్లాది రూపాయల చేతికి వచ్చిన పంట, ప్రకృతి వనరులు, పశుపక్షాదులు కడలి పాలవ్వగా ? పేదలు నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. స్వయంగా సి.యం. జగన్ బాధితుల సమక్ష్యంలో గూడు కోల్పోయిన వారికి ప్రభుత్వమే నేరుగా 3 నెలల్లో ఇల్లు పూర్తి చేసి, తాళాల గుత్తి వారి చేతిలో పెడతాను అని అన్నారు.

నేటికి ఆ ఘోర వైపరీత్యం జరిగి 4 నెలల కాల వ్యవధి అయిపోయింది. ఇప్పటికి ఏవిధమైన పురోభివృద్ది కానరాలేదు !ఇల్లు కోల్పోయిన బడుగు వర్గాల ప్రజలు నేటికి కొండరాళ్ళ మీద, ప్లాస్టీకు పట్టల క్రింద, ఏటి సెగకు గర్బిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు వడదెబ్బకు పడుతున్న ఇబ్బంది వర్ణణాతీతం. సొంత జిల్లాలో తన అనుచరుల స్వార్ధం కారణంగా చనిపోయినటువంటి కుటుంబాలకు సైతం నామ మాత్రంగా కేవలం 5 లక్షలు చెల్లించి, తన చేతులు దులుపుకోవడం !

అదే విశాఖ పరిశ్రమ మృతులకు ఒక కోటి రూపాయలు ఇచ్చి, తను గొప్ప మనసున్న మహారాజుగా చాటుకున్నాడు. ఒకరికి ఎక్కువ ఇంకొకరికి తక్కువ ఇవ్వడం ద్వారా, జగన్ కి రైతుల పక్షాన వున్నచులకన భావన ఏంటో ప్రజలకు అర్ధమయింది. మేట వేసిన పంట పొలాలు సాగులేకి తెచ్చే ప్రయత్నంగాని, ప్రాజెక్ట్ పునఃనిర్మానం చేపట్టుటకు బడ్జెట్ లో కేటాయింపులు చేయకపోవడం దేనికి నిదర్శనం? ఇలాంటి విషయాల మీద గొంతెత్తి మాట్లాడకపోవడం, చనిపోయిన కుటుంబాలను పరామర్శించే సమయం కూడా రాయలసీమ మేధావులకు లేకపోవడం అడ్డొచ్చిన నేపధ్యం ఏమిటో?

భారతీయ జనతా పార్టీ, రాయలసీమ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి ఇలాఖా కడప లో ఈ నెల 19 వ తేదిన “ రణభేరి “ మ్రోగించబోతోంది. దీనివల్లనైనా మదపటేనుగులాగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వానికి, ఉధ్యమమనే అంకుశంతో నిద్రలేపుదాం! ఓటుబ్యాంకు రాజకీయాలను కట్టడిచేద్దాం !

కేంద్రం మౌలిక సదుపాయాల కల్పణలో భాగంగా చూసినట్లయితే ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైల్వేలైను, కడప-కర్నూలు విమానాశ్రయాల నిర్మాణం, అంతర్జాతీయ స్థాయికి తిరుపతి విమానాశ్రయాన్ని తీర్చి దిద్దడం, అమరావతి-అనంతపురం, కడప-రేణిగుంట, మదనపల్లి-కడప, చిత్తూరు-నాయుడుపేట లాంటి జాతీయ రహదారుల నిర్మాణాల సగటులో భాగంగా రోజుకు 37 కి.మీ.ల మేర నిర్మాణాలు, దేశంలోనే కర్నూలు నందు అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ !

మరోవైపు విద్యారంగంలో సైతం ప్రతిష్టాత్మకమైన ఐ.ఐ.టి, ఐ.ఈ.యస్.ఆర్, పాకశాస్త్ర విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం, ఉర్దూ విశ్వవిద్యాలయం, క్లస్టర్ యూనివర్సిటీ, (కర్నూల్) విద్యాసంస్థలు హబ్బుగాను, ఈ ప్రాంతములో వున్నటువంటి చౌకయినటువంటి భూ మరియు మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటూ, పరిశ్రమల హబ్బుగా ఆకర్షించాలన్న ఉద్దేశ్యంతో చెన్నై-విశాఖ, చెన్నై-బెంగుళూరు కారిడార్లుగా ఎంపికచేసి, శ్రీకాళహస్తిని నోడల్ పాయింట్ గా మార్చింది అంటే యన్.డి.ఏ. ప్రధానమంత్రి మోడీ గారికి ఈ ప్రాంతాభివృద్ధి మీద వున్నటువంటి నిబద్ధతకు నిదర్శనం.

జగన్మోహన్ రెడ్డి తను పుట్టిన గడ్డకు ఎంత అన్యాయం చేస్తున్నాడో, నిరూపించడానికి బి.జే.పి సిద్ధం! లేదా నీ మనస్సాక్షితో శ్వేతపత్రం విడుదల చేసి, నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.

ramesh-naidu
– నాగోతు రమేశ్ నాయుడు, బి. జే. పి. రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ 

LEAVE A RESPONSE