Suryaa.co.in

Andhra Pradesh

నిధులు మళ్లించడానికి ఈ ముఖ్యమంత్రికి దళితులే దొరికారా?

– దళిత సంక్షేమం స్థానంలో వారికి సంక్షోభమే మిగిలింది
– దళితులను తనరాజకీయపబ్బానికి వాడుకుంటున్న ముఖ్యమంత్రి అందుకు తగినమూల్యం చెల్లించుకుంటాడు
• దళితసంక్షేమాన్ని విస్మరించిన జగన్ రెడ్డి, చరిత్రలో దళితద్రోహిగా తనకంటూ ప్రత్యేకపేజీ లిఖించుకోబోతున్నాడు
– మాజీ మంత్రి కే.ఎస్.జవహర్

జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితసంక్షేమం దారుణంగా దగాకు గురవుతోందని, మేడిపండు చందంగా మారి, దళితయువతను వంచనకు గురిచేస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

మాదిగ, రెల్లి, మాలకార్పొరేషన్లు ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి వాటిద్వారా రూపాయి ఖర్చుపెట్టలేదు. ఆయాకార్పొరేషన్ల చిరునామాలుఎక్కడున్నాయో..ఛైర్మన్లు ఎక్కడున్నారో కూడా తెలియని దుస్థితి. ఎస్సీకార్పొరేషన్ ను ఒకేవర్గంచేతిలోపెట్టి, మాదిగ, మాల, రెల్లికులాలను జగన్ రెడ్డి దారుణంగా వంచించాడు. లిడ్ క్యాప్ కార్పొరేషన్ కు కాకుమాను రాజశేఖర్ అనే నోరులేని వ్యక్తిని ఛైర్మన్ నుచేసి, చర్మకారులకు దక్కాల్సిన భూముల్ని ఆక్రమించుకుంటున్నారు.

బడ్జెట్ లో రెడ్డి, కమ్మ, వైశ్య కార్పొరేషన్లకు నిధులుకేటాయించిన జగన్ రెడ్డి, మాల,మాదిగ, రెల్లికార్పొరేషన్లకు రూపాయి కేటాయించలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి కేటాయింపులు చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి, అసలు ఆ సబ్ ప్లాన్ నిధులుకూడా దళితులకుదక్కకుండా చేస్తున్నాడు. అధికారమదంతో విర్రవీగుతున్న మాల, మాదిగ, వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు తమస్వార్థంకోసం ఆఖరికి జాతులనే తాకట్టు పెడుతున్నారు.

మాదిగ, మాల, రెల్లి, చర్మకారుల కార్పొరేషన్ల కార్యాలయాలు, అడ్రస్ లు ఎక్కడున్నాయో ఎవరికైనా తెలుసా? మాల, మాదిగ, రెల్లి, చర్మకార విద్యార్థులకు, యువతకు జగన్మోహన్ రెడ్డి సరైన విద్యకూడా లేకుండా చేస్తున్నాడు. దళితులకు విద్యనందించే ప్రభుత్వపాఠశాలలను మూయిస్తూ, నూతనవిద్యావిధానం పేరుతో ముఖ్యమంత్రి వారిని నట్టేట్లోముంచాడు. దళితులసంక్షేమం మరిచిన ముఖ్యమంత్రి, మాల, మాదిగ, రెల్లికార్పొరేషన్ల కు కేటాయించాల్సిన నిధులను నవరత్నాలకు మళ్లిస్తున్నాడు.

నిధులు మళ్లించడానికి ఈ ముఖ్యమంత్రికి దళితులే దొరికారా? రెడ్లు, కమ్మలు, వైశ్యులకు కేటాయించిన నిధుల్ని నవరత్నాలకు మళ్లించేధైర్యం ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోతున్నాడు? కేవలం జగన్ రెడ్డి తనపబ్బంగడుపుకోవడానికే రాజకీయాలు చేస్తున్నాడు. సంక్షేమాన్ని మరిచిన జగన్ రెడ్డి కర్రసాము చేస్తున్నాడు. జగన్ రెడ్డ్డి పాలనలో సంక్షేమం చంకనాకిపోయి.. అంతా సంక్షోభమే మిగిలింది. కులాలపేరుచెప్పి పదవులుపొంది బుగ్గకార్లలో తిరుగుతున్న వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరులు అంతా ఇప్పటికైనా తమతమవర్గాలకు న్యాయంచేయాలని ముఖ్యమంత్రిపై ఒత్తిడితేవాలని డిమాండ్ చేస్తున్నాం.

టీడీపీహాయాంలో చంద్రబాబునాయుడుగారు డప్పుకళాకారులకు, చర్మకారులకు కూడా పింఛన్లు, రుణాలు ఇచ్చారు . దళితబిడ్డలు ఉన్నతవిద్య అభ్యసించి, మంచిస్థానాలకు వెళ్లాలని భావించిన చంద్రబాబు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను తీసుకొచ్చాడు. అంబేద్కర్ విదేశీవిద్య పథకంతో ఎందరో దళితయువతను ఉన్నతవిద్యకోసం విదేశాలకు పంపాడు.

దళితజాతిని కాపాడటంకోసం తనవంతు కర్తవ్యాన్ని ఆనాడు చంద్రబాబుపోషించారు. దళిత క్రైస్తవుల సంక్షేమాన్నికూడా జగన్ రెడ్డి విస్మరించాడు. ముందడుగు వంటిగొప్పపథకాన్ని ఈ ముఖ్యమంత్రి నిలిపేయడం దుర్మార్గం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి దళితులకు పనికొచ్చే కార్పొరేషన్లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నాం.

దళితసంక్షేమాన్ని విస్మరించి, వారిని తొక్కేయాలని చూసిన ఎందరో పాలకులుకాలగర్భంలో కలిసిపోయారనే వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతత్వరగా గుర్తిస్తే అంతమంచిది. దళితసంక్షే మాన్ని విస్మరించిన జగన్ రెడ్డి, చరిత్రలో దళితవ్యతిరేకిగా తనకంటూ ఒక ప్రత్యేకపేజీని లిఖించుకోబోతున్నాడు.

LEAVE A RESPONSE