దళితులకు దక్కాల్సిన వాటిని కూడా ముఖ్యమంత్రి లాక్కుంటే ఎలా?

-రాజ్యాంగం ప్రకారం దళితులకు దక్కాల్సిన వాటిని కూడా ముఖ్యమంత్రి లాక్కుంటే ఎలా?
– ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన బ్యాక్ లాగ్ పోస్టులను ఓపెన్ కేటగిరిలోకి మార్చడమేంటి?
• ఎస్సీ,ఎస్టీ యువతపై ముఖ్యమంత్రి పక్షపాతబుద్ధిచూపుతూ, వారిని తనస్వార్థరాజకీయాలకు వాడుకుంటున్నాడు.
– మాజీమంత్రి పీతల సుజాత

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీలపై పక్షపాతంచూపుతూ, వారి సంక్షేమం, అభ్యున్నతి విషయంలో సవతితల్లిప్రేమచూపుతోందని, ముఖ్యమంత్రి రాజారెడ్డిరాజ్యాంగాన్ని అమలుచే స్తూ, ఎస్సీ, ఎస్టీ యువతజీవితాలను సర్వనాశనంచేస్తున్నారని మాజీమంత్రి పీతల సుజాత ఆరోపించారు.
సోమవారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆమెమాటల్లోనే …

బ్యాక్ లాగ్ పోస్టులను ఓపెన్ కేటగిరీలోకి మారుస్తున్నట్లు ఇటీవలే ప్రభుత్వం తరుపున సాక్షిపత్రికలో ఒకప్రకటనవచ్చింది. ఎస్సీ, ఎస్టీ యువతకు తనమూడేళ్లపాలనలో జగన్మోహ న్ రెడ్డి ఒరగబెట్టిందేమీలేదు. ఆఖరికివారిని పనీపాటాలేని బలాదూర్లుగా మారుస్తూ, కొందరు వైసీపీనేతలు,ఎమ్మెల్యేలు, మంత్రులు తమస్వార్థరాజకీయాలకు వాడుకుంటూ, వారి జీవితాలనుసర్వనాశనంచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రాజ్యాంగపరంగా వారికి దక్కా ల్సిన ఉద్యోగాలనుకూడా వారికి దక్కకుండా ఓపెన్ కేటగిరీలోకి మార్చడాన్ని టీడీపీతరుపున తీవ్రంగా ఖండిస్తున్నాము.

నిబంధనలప్రకారం ఎస్సీలకుచెందిన పోస్టులలో వారినే నియమించాలి. ఆయా పోస్టులకు అన్నిఅర్హతలు ఉన్నవారు ఆయావర్గాల్లో ఎవరూలేకపోతే… మూడేళ్లపాటు వేచిచూడాలి. మూడేళ్లువేచిచూశాకకూడా ఎస్సీల్లో అర్హులైన వారు వారికిసంబంధించిన పోస్టులకు దొరక్క పోతే, బీసీలకు ప్రాధాన్యమివ్వాలి. బీసీల్లో కూడా ఎవరూఅర్హులైన వారు లేకపోతే.. అప్పుడు మాత్రమే ఓపెన్ కేటగిరీలోకి మార్చాలనే నిబంధన రాజ్యాంగమేకల్పించింది.

కానీ ఈ ప్రభుత్వం, ఎస్సీయువతకు దక్కాల్సిన ఉద్యోగాలను ఎటువంటి నిబంధనలు పాటించకుండా నేరుగా ఓపెన్ కేటగిరీలోకి మార్చేయడానికిసిద్ధమైంది. ప్రభుత్వతీరు ముమ్మాటికీ ఎస్సీలైన నిరుద్యోగయువతీయువకులను దారుణంగా మోసగించడమే అవుతుంది.తాను ముఖ్యమంత్రి అయితే ఆకాశాన్ని నేలకు దించుతాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అన్నివర్గాలప్రజలకు అనేకరకాల హామీలిచ్చాడు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక తన దుర్మా ర్గపు పాలనతో అన్నివర్గాలప్రజలను వేధిస్తున్నాడు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఖాళీగాఉన్న పోస్టులుఎన్ని.. అంతకు మందుఉన్నఖాళీలెన్ని… ఆయన హాయాంలో ఎన్నిఉద్యోగాలభర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాడనే పూర్తివివరాలతో తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం.

టీడీపీహాయాంలో చంద్రబాబునాయుడుగారు 2014-2017 మధ్యన ఎస్సీలకు సంబంధించి 2,344 బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేయడంతోపాటు, రెండుడీఎస్సీలుకలిపి 3,700కు పైగా పోస్టులు భర్తీచేయడం జరిగింది. ఏపీపీఎస్సీ… పోలీస్ శాఖ నియామకాల్లో 4,339ఖాళీలు భర్తీచేయడంజరిగింది. అవన్నీ ఒకెత్తుఅయితే ఎస్సీకార్పొరేషన్ ద్వారా 4లక్షలపైచిలుకు ఎస్సీయువతకు ఉపాధికల్పించడం జరిగింది. ఇవన్నీ మేంచెప్పడంకాదు..ప్రభుత్వరికార్డులు చూస్తే అసలువాస్తవాలు ఈప్రభుత్వానికి తెలుస్తాయి.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎస్సీవర్గానికి, ఎస్టీలకు ఉత్తవిస్తరి, మంచినీళ్లు కూడాలేవు. ఆయావర్గాలయువతకు ఒక్కఉద్యోగమూ ఇచ్చిందిలేదు. పాతబ్యాక్ లాగ్ పోస్టులు 20వేలవరకుఉంటే వాటిని భర్తీచేయలేదు. ఎస్జీటీ విభాగం కింద దాదాపు 4,600 వరకుఉద్యోగాలకు జగన్ రెడ్డిప్రభుత్వం మంగళంపాడేసింది. మొత్తంగా ఎస్సీలకుదక్కాల్సిన 30వేల టీచర్ ఉద్యోగాలకు ముఖ్యమంత్రిపూర్తిగా పాతరేశాడనే చెప్పాలి.

ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏశాఖలో కూడా ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులభర్తీ జరగనేలేదు…వాటికి సంబంధిం చి ఒక్కనోటిఫికేషన్ కూడాఇవ్వలేదు. దళితులకు విద్యను, ఉద్యోగాలను దూరంచేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆఖరికి వారికినాణ్యమైన వైద్యాన్నికూడా అందించడంలేదు. చదువుకున్న ఎస్సీయువతీయువకులు ఉపాధి, ఉద్యోగాలులేక ఏంచేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని కూలీ పనులు చేసుకుంటున్నారు. దేశభవిష్యత్ కు వెన్నెముకలా నిలవాల్సిన యువత వెన్ను విరిచేలా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలున్నాయి.