– ‘అగ్నిపథ్’ చాలా మంచి స్కీం
– ప్రజలకు వాస్తవాలను తెలియజేండి
– -సత్యకుమార్ కలం చాలా పవర్ పుల్
– ‘‘సత్యకాలం’’ పుస్తకావిష్కరణ సభలో బండి సంజయ్ కుమార్
‘‘మేధావి వర్గం మౌనంగా ఉంటే దేశానికి అరిష్టం. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఎందుకో మౌనం పాటిస్తున్నారు. భయపడుతున్నరు. మీరు వాస్తవాలు చెప్పకపోతే సమాజానికి నష్టం. అగ్నిపథ్ చాలా మంచి స్కీం. అయినా జరుగుతున్న విధ్వంసం చూస్తున్నాం. ఇలాంటి వాటిపై వాస్తవాలను సమాజానికి అందించాలని కోరుతున్నా’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ రచించిన
‘సత్యకాలమ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. బండి సంజయ్ తోపాటు కేంద్ర కార్మిక, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ వల్లీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ అధ్యక్షోపన్యాసం చేశారు… అందులోని ముఖ్యాంశాలు..
సత్య కాలం ఎంత పవర్ ఫుల్ సత్య కలం కూడా పవర్ ఫుల్. సత్యతో చాలా కాలం కలిసి ఉన్నాను. క్రమశిక్షణతో జీవితాన్ని కొనసాగించారు.వెంకయ్యనాయుడు రథయాత్ర నుండి సత్యతో పరిచయం. ఆనాటి
నుండే నేటి దేశ, అంతర్జాతీయ అంశాలపై చర్చించేవారు. మొదటి నుండి కష్టపడే మనస్తత్వం. పార్టీ కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉంటూ ‘సత్యకాలం’ పేరుతో ఆర్టికల్స్ రాయడం గొప్ప విషయం. చాలా మంది సత్యకాలం ఆర్టికల్స్ కోసం ఎదురుచూసే పాఠకులున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల తప్పకుండా ఆ పుస్తకం చదవాల్సిన అసవరం ఎంతైనా ఉంది.
మొదటి చాప్టర్ లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీతో దేశంలో ఎంతటి విధ్వంసం స్రుష్టించారో కళ్లకు కట్టినట్లు చూపించారు. దాంతోపాటు 8వ నిజాం ఆఖరు పాలన గురించి రాశారు. కేసీఆర్ వ్యక్తిత్వం, కేసీఆర్ పాలన.. నిజాంపట్ల కేసీఆర్ కున్న ప్రేమను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. నరేంద్రమోదీ సుపరిపాలన, దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టేందుకు చేస్తున్న కృషిని సత్యకాలంలో వివరించారు. కోవిడ్ సంక్షోభంలో మోదీ తీసుకున్న కఠిన నిర్ణయాలను, ఎన్నికల్లో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను, 370 ఆర్టికల్స్ రద్దుపై ఆర్టికల్స్ రాశారు. కమ్యూనిస్టు భావజాలమున్న పత్రికల్లో 370 ఆర్టికల్స్ రద్దు తప్పుడు నిర్ణయం అనే వార్తలు రాశారు. సత్యకాలంలో దీనిపై రాసిన ఆర్టికల్ తో వాస్తవాలు ప్రజలకు అర్ధమయ్యాయి.
చాలామందికి 370 ఆర్టికల్ గురించి తెలియదు. దానివల్ల కలిగే అనర్దాలేమిటో బీజేపీ కార్యకర్తలకు, పరివార్ కార్యకర్తలకు క్షుణ్నంగా తెలుసు. కశ్మీర్ ఫైల్స్ లో చూపినవి ఒక శాతమే. ఇంకా అలాంటి ఘటనలెన్నో జరిగాయి. 370 ఆర్టికల్ రద్దు కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలను
గుర్తించి 370 ఆర్టికల్ ను రద్దు చేసిన ఘనత నరేంద్రమోదీదే. ఆ సమయంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. రామమందిర నిర్మాణం గురించి రాసిన ఆర్టికల్స్ ఆసక్తికరంగా ఉంది. 80 శాతం హిందువులున్న భారతదేశంలో ఆరాధ్యదైవమైన రాముడు జన్మించిన స్థలంలో రామ మందిరం నిర్మించుకోలేకపోత్నరట…అని ఆశ్చర్యపోయారు. కరసేవకుల స్పూర్తితో నరేంద్రమోదీ దివ్యమైన, భవ్యమైన రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేసిన ఘనత మోదీదే.
మేధావి వర్గం మౌనంగా ఉంటే దేశానికి అరిష్టం. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఎందుకో భయపడుతున్నరు. మాలాంటి వాళ్లు అనేక కార్యక్తర్తలు జయప్రకాశ్ నారాయణ్ లాంటి వాళ్లు వాస్తవాలు చెప్పకపోతే చాలా విషయాలు మరుగునపడేవి. సత్యలాంటి వాళ్లు ఆర్టికల్స్ చదవకపోతే చాలా విషయాలు తెలిసివి కావు..అగ్నిపథ్ పేరుతో నిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసం చేశారు. అగ్ని పథ్ చాలా మంచి స్కీం. మేధావులంతా అగ్నిపథ్ వంటి పథకాలపైనా ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని కోరుతున్నా.