– ప్రపంచానికే ఆదర్శంగా ముఖ్యమంత్రి జగన్ పథకాలు
– దేశం అంతా ఏపీ వైపు చూసే విధంగా జగన్ పరిపాలన
– హత్యలు, అత్యాచారాలు జరిగితే టీడీపీ పండగ చేసుకుంటుంది
– రాష్ట్రంలో జరిగే అరాచకాల్లో నిందితులు టీడీపీ కార్యకర్తలే కావడం అనుమానాలకు తావిస్తోంది
– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి ప్రెస్ మీట్
ఆర్బీకేలకు ప్రపంచస్థాయి గుర్తింపు
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మునుపెన్నడూ అమలు జరగని విలక్షణమైన కార్యక్రమాలను ప్రారంభించారు. అందులో భాగంగానే రైతాంగ అవసరాలకు సంబంధించి నూతన వ్యవస్థకు శ్రీకారం చుడుతూ రైతు భరోసా కేంద్రాలన్ని ప్రారంభించడం జరిగింది. రైతుల కోసం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు రెండేళ్లలోనే ప్రపంచం గుర్తించే స్థాయికి వచ్చాయి. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) అంతర్జాతీయ స్థాయిలో అందించే, అత్యున్నత ప్రతిష్టాత్మకమైన చాంపియన్ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీకేలను నామినేట్ చేసింది.
దేశం తరపున కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు అవార్డుల్లో ‘వైయస్సార్ రైతు భరోసా’ కేంద్రాలు ఒకటి కావడం గర్వించదగ్గ పరిణామం. నామినేట్ చేసిన ఆరింటిలో నాలుగు పరిశోధనలకు సంబంధించవి కాగా, అందులో ఒడిశా రాష్ట్రానికి సంబంధించి వాటర్ షెడ్ లు, మన రాష్ట్రానికి చెందిన ఆర్బేకేలను కేంద్రం నామినేట్ చేయడం సంతోషించాల్సిన అంశం.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయ స్థాయికి ఎదగడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఒక నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టి, రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ గ్రామానికి రైతులకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లు దగ్గర నుంచి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసేవరకు బాధ్యత తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన ఒక అద్భుతమైన పథకమే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు.
దేశమంతా ఏపీవైపు చూసేలా..
దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఇవాళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలన ఉంది. ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు, మన దేశానికే కాకుండా, యావత్తు ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత జగన్ గారిదే. 2020 మే 30న ప్రారంభించిన ఆర్బీకేల ద్వారా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి దాదాపుగా 10,778 కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా రైతాంగానికి సేవలు అందిస్తున్నాయి. ఆర్బీకేలు చాంపియన్ అవార్డుకు ఎన్నిక కావడం రాష్ట్రానికి దక్కిన అరుదైన గౌరవంగా భావించాలి.
వ్యవసాయంపై మాట్లాడే అర్హతే వారికి లేదు
రైతులు, వ్యవసాయానికి సంబంధించి ప్రతిపక్షాలకు మాట్లాడే అర్హత లేదని చెప్పదలచుకున్నాం. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2014-2019 మధ్య 469మందికి కనీసం పరిహారం కూడా ఇవ్వకుండా ఎగనామం పెడితే.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో కుటుంబానికి అయిదు లక్షల చొప్పున, మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ 23కోట్ల 45 లక్షలు చెల్లించాం. క్రాఫ్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి రబీలో 2012-13లో రూ.119కోట్ల 44 లక్షలు ఇవ్వాల్సి ఉంటే.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆమొత్తం రైతులకు బకాయిలు పెట్టి వెళ్లిపోతే వైయస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా రైతులకు చెల్లించాం.
అలానే, 2018-19కి సంబంధించి రబీలో రూ. 596కోట్ల 37లక్షల బకాయిలు ఉంటే, ఆ బకాయిలు ఒక్క రూపాయి కూడా చంద్రబాబు సర్కార్ చెల్లించలేదు. మా ప్రభుత్వం వచ్చాక పూర్తి నిధులు విడుదల చేశారు. దాదాపుగా 6లక్షల 18వేల 646 రైతు కుటుంబాలకు ఇవ్వాల్సిన బకాయిలను మా ప్రభుత్వం వచ్చాక, వాటికి సంబంధించి 715కోట్ల 81లక్షల రూపాయలు నిధులు విడుదల చేశాం. రైతు రథానికి సంబంధించి 124కోట్ల 65లక్షలు బకాయిలు పెడితే 82కోట్ల 64లక్షలు చెల్లించాం. వడ్డీలేని రుణాలకు 1,073కోట్లు చెల్లించాల్సి ఉంటే మా ప్రభుత్వం రూ. 784కోట్లు చెల్లించింది. బిందు సేద్యానికి సంబంధించి 887కోట్లకుగాను, కేవలం 152కోట్లు ఇచ్చి టీడీపీ దిగిపోతే… మేము వచ్చాక రూ. 630కోట్లు చెల్లించాం.
దాంతోపాటు బిందుసేద్యానికి అవసరం అయిన పరికరాలు ఇవ్వడం జరుగుతోంది. మా ప్రభుత్వం అన్నిరకాలుగా రైతాంగానికి అండగా నిలిచే తరుణంలో, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకపోగా, రైతులను మోసం చేసి, గద్దె దిగిన తర్వాత మా ప్రభుత్వంపై బురద చల్లాలనే ఆలోచనలతో లేనిపోని విమర్శలు చేస్తున్నారు. మా ప్రభుత్వం, గతంలో మరే ప్రభుత్వం చేయని విధంగా వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో కూడా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, రైతన్నకు మేలు జరిగేలా అన్నిరకాల చర్యలు చేపడుతున్నాం.
హత్యలు, అత్యాచారాలు జరిగితే టీడీపీకి పండగా..?
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో తిరుపతమ్మ అనే మహిళ హత్యకు గురైంది. ఆ హత్య చేసిన ముద్దాయిల పేర్లు శివ, సాయి చౌదరి. తిరుపతమ్మ ఫిర్యాదు చేసిన వెంటనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఏ వ్యక్తి అయితే హత్యకు కారకుడు అని పోలీసులు అరెస్ట్ చేశారో అదే గ్రామం వెళ్ళి, పాపం టీడీపీకి మహానాయకుడు అని చెప్పుకుంటున్న నారా లోకేష్ నానా యాగీ చేసిన పరిస్థితి.
అదేవిధంగా దుగ్గిరాల మండలంలో ఇంకో సంఘటన జరిగితే దానికి సంబంధించి కూడా టీడీపీ వాళ్లకు ప్రమేయం ఉన్నా, దానిపైన కూడా ఇదే టీడీపీ నేతలు గందరగోళం చేశారు. అలాగే విశాఖలోని పీవీపాలెంకు చెందిన తోట నరేంద్ర అనే టీడీపీ నాయకుడు అత్యాచారం నేరానికి పాల్పడితే, దాన్ని కూడా టీడీపీ నేతలు రాజకీయం చేశారు. అంటే రాష్ట్రంలో టీడీపీ ఎలా తయారైందంటే.. సమాజంలో ఎక్కడైనా హత్యలుగానీ, అత్యాచారాలు గానీ జరిగితే ఎవరైనా బాధపడతారు కానీ… తెలుగుదేశం పార్టీ మాత్రం పండుగ చేసుకునేలా ప్రవర్తిస్తున్నారని నేను అభిప్రాయపడుతున్నాను.
అధికారం కోల్పోయాక టీడీపీ అరాచకాలు
టీడీపీ ఒక ప్లాన్ ప్రకారం.. ముద్దాయిలుగా ఉన్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తుంటే… దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి టీడీపీ వాళ్లనే పురమాయించి ఏదోవిధంగా విద్వేషాలు రెచ్చగొట్టి, ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ సంకేతాలు ఇచ్చేలా ప్రయత్నిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇదే టీడీపీ నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. అధికారం కోల్పోయాక అరాచకాలకు పాల్పడే పరిస్థితికి టీడీపీ దిగజారిపోయింది. దీని వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరు అనేది అందరికీ తెలిసిందే. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపితే, వీటి వెనుక ఉన్న కుట్ర కోణం బయటపడుతుంది.
– టీడీపీకి సంబంధించివాళ్లే హత్యలు, అత్యాచారాలు చేస్తే… పైపెచ్చు వీళ్ళే మళ్ళీ ఘటనా స్థలాలకు వెళ్లి శాంతిభద్రతలు లేవంటూ గందరగోళం చేస్తున్నారు. ఇది ఎంతవరకూ సమంజసం అని అడుగుతున్నాం. ఫామ్ మెకనైజేషన్(వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం) కు సంబంధించి రూ. 1995కోట్లు అవసరం అని అధికారులు నివేదిక ఇచ్చారు. స్పింక్రర్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాం. బహుశా జులైకల్లా ఇస్తాం. హార్వెస్ట్ మిషన్లు, ట్రాక్టర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 3500 ట్రాక్టర్లను ముఖ్యమంత్రిగారి చేతుల మీదగా అందించడం జరుగుతుంది. రైతాంగానికి సంబంధించిన అవసరాలను తీర్చేందుకు మా ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది.
రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వ లెక్కల ప్రకారం… 694మంది మృతి చెందగా, 48కోట్ల 58లక్షల పరిహారం ఇవ్వడం జరిగింది.
ఏపీ సీడ్ యాక్ట్ ప్రకారం .. నకిలీ ఎరువులు విక్రయిస్తే 420 సెక్షన్ కింద చర్యలు చేపట్టేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రైతులను మోసగిస్తే చట్టం ప్రకారం అదనంగా చర్యలు తీసుకోవడంపై యోచిస్తున్నాం.
రాష్ట్రంలో ఉన్న 10,778 ఆర్బీకేలకు సొంత భవనాలు మంజూరు కాగా, దాదాపుగా మూడువేల సొంత భవనాలు పూర్తయ్యాయి. కొత్త విధానం, నూతన వ్యవస్థను రూపొందిస్తున్నప్పుడు కొన్ని రకాల అవాంతరాలు ఎదురు అవుతాయి. ఇంతవరకూ ఎవరూ చేయని, కనీసం ఊహించని ప్రయోగమే ఆర్బీకేలు. రైతులు ఎవరూ గ్రామం దాటి బయటకు వెళ్ళకుండా గ్రామ పరిధిలోనే వ్యవసాయానికి సంబంధించిన అన్ని వసలు ఏర్పాటు చేసి, పంటలను అమ్ముకునేందుకు కూడా వీలు కల్పించాం. ఆర్బీకేల ద్వారా లాభనష్టాలతో సంబంధం లేకుండా 40లక్షల టన్నుల పైచిలుకు ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఆర్బీకేల వద్ద స్టోరేజ్ సౌలభ్యం లేకపోవడంతో వెంటనే మిల్లులకు తరలిస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు మేలు చేయడానికే చూస్తాం తప్ప, గత ప్రభుత్వాల తరహాలో బకాయిలు పెట్టం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ శాఖకు మళ్లీ పునర్జీవం అందించారు. రైతులకు అన్నింటా ఎగనామం పెట్టి, మోసం చేసిన టీడీపీ మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదం.