అమరావతి : 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో భారీ ఎత్తున పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియచేశారు.
ఉదయం 6:30 గంటలకు పోలీసు ప్రధాన కార్యాలయ జంక్షన్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువుల పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది పలు యోగాసనాలను గంట సేపు పాటు అభ్యసించారు.
రాష్ట్రవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు పాల్గొనేలా నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది భారీఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకె రవి కృష్ణ ఐజీపీ (ఈగల్ ), భద్రత సెక్రటరీ హరి కుమార్ ఐజీపీ(రిటైర్డ్), సీఈవో రాజన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల పోలీసు ప్రధాన కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.