– ఒప్పందం ప్రకారం పరికరాలన్నీ అందాయని స్కిల్ డెవలప్ మెంట్ స్టాక్ రిజిస్టర్లలో సంతకాలు చేశాక అవినీతికి ఆస్కారమెక్కడ?
• స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లలో పరికరాలన్నీ అందాయని కళాశాల యాజమాన్యాల లేఖలు
• స్టాక్ రిజిస్టర్ లో హాండోవర్ చేసుకున్నట్లు స్కిల్ డెవలప్ మెంట్ అధికారులు కూడా సంతకాలు
• ఇడుపులపాయ ట్రిపుల్ ఐటి కూడా లేఖ ఇచ్చింది, సిఎం ఏం సమాధానం చెబుతారు?
• ఫోరెన్సిక్ ఆడిట్ లో ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ ను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? స్టాక్ రిజిస్టర్ లో వాస్తవాలు వెలుగు చూస్తాయని భయమా?
•
• నిజాయితీగల అధికారులపై తప్పుడు కేసు పెట్టిన సిఐడి అధికారులు కోర్టుకు ఏం సమాధానం చెబుతారు?
• తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
లక్షలాది యువత భవితకు సంబంధించిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై కక్షసాధింపుతో బురదజల్లే కార్యక్రమం కొనసాగుతోందని… ఏదో ఒక రకంగా టీడీపీకి, చంద్రబాబునాయుడికి అవినీతి మసిపూయాలన్న ధ్యేయంతో పాలకులు కుట్రపన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ కుట్రలను ఇప్పటికే బహిర్గతం చేశామని, సీఐడీ డిపార్ట్ మెంట్ చిత్తందొర ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ గా మారి తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఆడమన్నట్లుగా ఆడుతున్నారని ధ్వజమెత్తారు.పట్టాభిరామ్ విలేకరుల సమావేశం వివరాలు ఆయన మాటల్లోనే…!
రాష్ట్రంలో సీఐడీ అనేది ఒకచెంచా డిపార్ట్ మెంట్ గా, తాడేపల్లి పెద్దలు చెప్పినట్లుగా తలాడించే చిత్తందొర డిపార్ట్ మెంట్ గా మారిపోయింది. ఆ శాఖకు నేనొక సవాల్ విసురుతున్నా. లక్షలాది యువత జీవితాలకు సంబంధించిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి మరికొన్ని పచ్చినిజాలను సీఐడీ వారి
ముందుంచుతున్నాను. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వ్యయంలో ఒప్పందం ప్రకారం సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు వాటి వాటాగా 90శాతం నిధులకు గాను ఎలాంటి పరికరాలు సరఫరాచేయలేదని, తప్పుడు ఇన్ వాయిస్ లు సృష్టించారని ప్రస్తుత స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ చైర్మన్ అజయ్ రెడ్డి ఒక తప్పుడు ఫిర్యాదు సిఐడికి ఇస్తే నిజానిజాలు నిర్థారించుకోకుండా నిజాయితీకి మారుపేరైనా లక్ష్మీనారాయణ, ఘంటా సుబ్బారావులపై కేసులు బనాయించారు.
ప్రభుత్వ వాటాగా ఇచ్చిన రూ.371కోట్లలో రూ.241కోట్లను దిగమింగారని ఆరోపణలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన 40 కేంద్రాలకు సీమెన్స్, డిజైన టెక్ వారు ఎలాంటి ఉపకరణాలు, పరికరాలు అందచేయలేదన్నదే చిత్తందొరా డిపార్ట్ మెంట్ వారి అభియోగం. ఈ నేపథ్యంలో సదరు విభాగాధిపతి సునీల్ కుమార్ ను, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీ ధనుంజయుడును మేం కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన 40కేంద్రాలను ప్రారంభించాక మూడేళ్లపాటు వాటిని డిజైన్ టెక్ వారు నిర్వహించి తరువాత ఆయాకళాశాల యాజమాన్యాలకు అందించేలా ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలా అప్పగించే సందర్భంలో ఆయా కళాశాలలు, యూనివర్శీటీల వారు ఆయాకేంద్రాల్లోని స్టాక్ అంతా చెక్ చేసుకొని అన్నీ సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించి లేఖలుకూడా ఇచ్చారు. 100 పేజీల స్టాక్ రిజిస్టర్ లో ప్రతిపేజిని, ప్రతిపరికరాన్నీ పరిశీలించి అన్నీ సక్రమంగానే ఉన్నాయని స్కిల్ డెవలప్ మెంట్ అధికారులు కూడా సంతకాలు చేశారు.
అలా లేఖలు ఇచ్చిన కేంద్రాల జాబితాలో ముఖ్యమంత్రి స్వస్థలమైన ఇడుపులపాయ లోని ట్రిపుల్ ఐటీ కూడా ఉంది. సదరు ట్రిపుల్ ఐటీ వారు స్కిల్ డెవలప్ మెంట్ సీఈవో/మేనేజింగ్ డైరెక్టర్ వారికి 06-08-2021న ఒప్పందం ప్రకారం పరికరాలన్నీ ఇచ్చారని, తమకు సక్రమంగానే అందాయని లేఖ ఇచ్చారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒకసారి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటికి వెళ్లి పరికరాలు ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవచ్చు.
అలానే రాజంపేటలోని అన్నమాచార్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వారు ఆగస్ట్ 5, 2021న, కాకినాడ ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల కాకినాడవారు, గాయత్రి విద్యాపరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ వారు ఆగస్ట్ 7,2021న, రాజాం లోని జీఎమ్మార్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీవారు ఆగస్ట్ 5, 20121న , కర్నూలులోని జీ. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలు వారు వారి కళాశాలల యాజమాన్యాలుతోపాటు 40 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లవారు అన్ని పరికరాలు సక్రమంగానే సరఫరాచేశారని లేఖల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆగస్టులో అన్ని సక్రమంగానే ఉన్నాయని కళాశాలల యాజమాన్యాలు లేఖ రాస్తే సెప్టెంబర్ లో స్కిల్ డెవలప్ మెంట్ చైర్మన్ ఏవిధంగా ఫిర్యాదు చేస్తారు?
ఆ లేఖల్లోని వాస్తవాలు ఈ చిత్తందొరా డిపార్ట్ మెంట్ అధిపతి సునీల్ కుమార్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ధనుంజయుడుకు కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నాం. కళాశాలలు రాసిని లేఖలతో పాటు ఆయాకళాశాలల వారు మెయింటెన్ చేసిన స్టాక్ రిజిస్టర్లలోకూడా ప్రతి ఐటమ్ కు సంబంధించిన వివరాలు ఉన్నాయి. స్టాక్ రిజిస్టర్లలో అన్నిపరికరాలు ఉన్నాయని ఒప్పు కుంటూ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అధికారులు కూడా సంతకాలు కూడా చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పక్షాన సదరు విభాగం అధికారులు ప్రతికాలేజీకి వెళ్లి తనిఖీలు నిర్వహించి సంతకాలు చేసిన విషయం ప్రస్తుత చైర్మన్ అజయ్ రెడ్డికి తెలియదా?
నా దగ్గరున్న స్టాక్ రిజిస్టర్ లను, రిజిస్టర్లలో సంతకాలు పెట్టిన అధికారులజాబితాను, కళాశాలల లేఖలను సీఐడీ వారికి పంపిస్తా… చెక్ చేసుకోండి. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన పరికరాలన్నీ సక్రమంగా ఉన్నట్లు కళ్లముందు కనిపిస్తున్న స్టాక్ రిజిస్టర్లు, కళాశాలల యాజమాన్యాలు రాసిన లేఖలపై సీఐడీవారు ఏం సమాధానం చెబుతారు? స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ప్రాజెక్ట్ సలహదారుగా ఉన్నమదుసూదన్ రెడ్డి, స్వయంగా సాక్షి గుమాస్తా సజ్జల రామకృష్ణారెడ్డికి రైట్ హ్యాండ్ నని డబ్బాలుకొట్టుకుంటూ ఉంటాడు. ఆ మదుసూధన్ రెడ్డి గతంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అయితే, ఇప్పుడు సలహాదారుగా ఉన్నారు. ఈ చిత్తందొరా డిపా ర్ట్ మెంట్ వారికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే, మాకు ఎందుకు తప్పుడు ఫిర్యాదుఇచ్చారని అజయ్ రెడ్డి, మదుసూధన్ రెడ్డిలను విచారించాలి.
నిజాలు ఇంతస్పష్టంగా కళ్లముందుకనిపిస్తుంటే, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రస్తుత ఛైర్మన్ అజయ్ రెడ్డి, సలహాదారు మదుసూదన్ రెడ్డిలు సీఐడీని ఎందుకు తప్పుదోవ పట్టించారని వారిద్దరినీ నిలదీసే దమ్ము, ధైర్యం సీఐడీ డిపార్ట్ మెంట్ వారికి ఉందా? స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అధికారులు అన్ని సక్రమంగా ఉన్నాయని ఒప్పుకొని స్టాక్ రిజిస్టర్లలో సంతకాలుచేశాక, పరికరాలు ఏమీలేవని అజయ్ రెడ్డి ఎలా ఫిర్యాదుచేస్తాడు? తక్షణమే అజయ్ రెడ్డి, మదుసూదన్ రెడ్డిలపై కేసునమోదుచేసి, వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలి.
ఏదిపడితే అదిచేస్తే తమను ఎవరు ప్రశ్నిస్తారని సీఐడీ అధికారులు అనుకుంటే తీవ్రంగా నష్టపోతారు. సీఐడీ అధికారులు నిజాయితీపరులను వేధించినందుకు కోర్టుకు సమాధానం ఉంటుంది. కళాశాలల్లోని స్టాక్ రిజిస్టర్ల వివరాలు బయటకు వస్తాయనే ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ లో ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ తొలగించారు. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన శరత్ అసోసియేట్స్ వారు ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ తొలగించారని గతంలో చెప్పింది నిజంకాదా? సిమెన్స్, డిజైన్ టెక్ సంస్థ వారు రాష్ట్రంలోని 40స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలకు ఒప్పందం ప్రకారం అన్నిరకాల ఐటమ్స్ సరఫరాచేశారు. ఇందుకు సంబంధించి ఆధారాలన్నీ బయటపెట్టాక స్కిల్ డెవల్ మెంట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీనేతలకు, సీఐడీ అధికారులకులేదు.
యువత భవితకు కీలకమైన ప్రాజెక్ట్ పై బురదజల్లినందుకు సీఐడీవారు సిగ్గుతో తలదించుకోవాలి. వాస్తవాలు వెల్లడైన నేపథ్యంలో సమాజం ముందు దోషులుగా నిలిచారు. ఎన్నిఒత్తిళ్లు వచ్చినా ప్రజలముందు అభాసుపాలు కాకుండా సీఐడీవారు న్యాయంగా, చట్టప్రకారం వ్యవహరించాలని కోరుతున్నాం. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి, సలహాదారు మదుసూదన్ రెడ్డిలు ముఖం చాటేయకుండా మీడియాముందుకు వచ్చి నేడు తాము బయటపెట్టిన ఆధారాలపై స్పందించాలి.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి సిమెన్స్ డిజైన్ టెక్ కంపెనీ వారు రాష్ట్రంలోని 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలకు అన్నిరకాల పరికరాలు సరఫరాచేసినట్టు ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారులే ఒప్పుకొని సంతకాలు పెట్టాక, అవినీతికి స్థానమెక్కడ ఉందో సీఐడీ చెప్పాలి. వాస్తవాలన్నీ బయటపడ్డాక సిఐడి వారు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ బోగస్ అని తేటతేల్లమవుతోంది.