– అమెరికా పర్యటనలో ప్రవాసులకు మంత్రి కొప్పుల పిలుపు
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికాలోని పలు సంస్థలను రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల కోరారు. అమెరికా పర్యటనలో గత వారం రోజులుగా బిజీ బిజీగా గడుపుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ పనెన్స్ సిటీలో బీఆరెస్ నాయకులు ఆనంద్ రాజ్ గుంటకు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రవాస వాసులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయ్యారు. అక్కడి పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు.
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి తోడుగా ప్రైవేట్ రంగంలోను యువతకు అమెరికాలోని సంస్థలు సహకరిస్తే మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పదిరోజుల అమెరికా పర్యటన లో భాగంగా ఇప్పటికే సాల్ట్ లేక్ సిటీలోని LDS హ్యుమానిటేరియన్ సెంట్రల్ వేర్‌హౌస్ రూట్స్ టెక్ ను సందర్శించారు. ఈ సందర్బంగా అమెరికా సాల్ట్ లేక్ సిటీలో ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ సభ్యులతోను మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ను శాలువాతో సత్కరించారు.