Suryaa.co.in

Andhra Pradesh

జగన్ జమానాలో వచ్చిన పెట్టుబడులు జీరో

-ఇదిగో కేంద్ర ఆర్థిక, వాణిజ్య శాఖ ఇచ్చిన సాక్ష్యాధారాలు
-దావోస్ కచ్చితంగా విహార పర్యటనే
-ఆర్టీఐ సమాచారాన్ని బయటపెట్టిన బీజేపీ పొలిటికల్ ఫీడ్ బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్

ఏపీ సీఎం జగన్ హయాంలో ఇప్పటిదాకా వచ్చిన విదేశీ పెట్టుబడులు జీరో అని, వచ్చిన పెట్టుబడులన్నీ గత సర్కారు హయాంలో జరిగిన ఒప్పందానికి సంబంధించి వచ్చిన పెట్టుబడులేనని బీజేపీ ఫీడ్‌బ్యాడ్ ప్రముఖ్, లంకా దినకర్ స్పష్టం చేశారు. ఆ మేరకు ఆయన కేంద్రప్రభుత్వ అధీనంలోని వాణిజ్య-ఆర్ధిక శాఖలకు చెందిన ఎకనమిక్ అఫైర్స్ విభాగం ఇచ్చిన వివరాలను మీడియాకు విడుదల చేశారు. ఆ ప్రకారంగా జగన్ హయాంలో ఇప్పటివరకూ ఒక్క డాలరు కూడా విదేశీ పెట్టుబడి రాలేదని, ఒకవేళ వచ్చిఉంటే ఎకనమిక్ అఫైర్స్ విభాగం నమోదు చేసి తీరుతుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా లంకా దినకర్ ఏమన్నారంటే… పెట్టుబడుల కోసం అంటూ సీఏం జగన్మోహన రెడ్డి బృందం దావోస్ పర్యటన రాను, పోను ఖర్చుల దండగ అని గతంలో నేను అన్న మాట నిజమో కాదో,jagan-davos సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. మన దేశంలో ఒక్క డాలర్ విదేశీ పెట్టుబడి వచ్చినా, అందుకోసం ఏంఓయూలు & అగ్రిమెంట్లు చేసుకున్నా, ఆ సమాచారం నిక్కచ్చిగా, కేంద్ర వాణిజ్య శాఖ సంబంధించిన డిపిఐఐటి ఆధ్వర్యంలోని విదేశీ పెట్టుబడుల ఫెసిలిటేషన్ విభాగంలో నమోదై ఉంటుంది.

నేను తేది 12-07-2022 న 4 ( నాలుగు ) ప్రశ్నలను కేంద్ర వాణిజ్య శాఖ & ఆర్థికశాఖ లోని ఎకనామిక్ అఫైర్స్ విభాగం వారిని సమాచార హక్కు చట్టం క్రింద అడగడం జరిగింది. కేంద్ర వాణిజ్య శాఖ &davos ఆర్థికశాఖ సమాచార అధికారులు, డిపిఐఐటి లో విదేశీ పెట్టుబడుల ఫెసిలిటేషన్ విభాగం ద్వారా సమాధానాలు ఇచ్చారు.

అడిగిన ప్రశ్నలు & సమాధానాలు :
1వ ప్రశ్న:
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బృందం పెట్టుబడుల కోసం జూన్, 2022 దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు ( వరల్డ్ ఏకనమిక్ ఫోరం ) కి హాజరైనప్పుడు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఏఫ్డీఐ) కు సంబంధించిన ఒప్పందాలు , అగ్రిమెంట్లు పైన వివరాలు ఇవ్వండి ?
సమాధానం :
ఈ ప్రశ్న కి సంబంధించిన సమాచారం డిపిఐఐటి లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విభాగం వద్ద లేదు.
రిమార్క్:
అంటే ఏ ఒక్క విదేశీ సంస్థతో కూడా ఆంధ్రప్రదేశ్ ఒప్పందాలు , అగ్రిమెంట్లు జరగలేదనేది సమాచారం అవ్వచ్చు.

2వ ప్రశ్న:
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బృందం పెట్టుబడుల కోసం జూన్, 2022 దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు ( వరల్డ్ ఏకనమిక్ ఫోరం ) కి హాజరైనప్ఫుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరితోనైనా పెట్టుబడుల ప్రతిపాదనలు చేసుకుందా?, వివరాలు ఇవ్వండి.
సమాధానం :
ఈ ప్రశ్న కి సంబంధించిన సమాచారం డిపిఐఐటి లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విభాగం వద్ద లేదు.
రిమార్క్:
అప్పటికే గతంలో దేశంలో వివిధ సంస్థతో చేసుకున్న ఒప్పందాలు , అగ్రిమెంట్లు కొత్తవిగా చూపే ప్రయత్నం. అరబిందో లాంటి సంస్థతో చేసుకున్న ఒప్పందం పూర్తి దేశీయవాళీ వ్యవహారం కాబట్టి, ఆ సమాచారం డిపిఐఐటి వద్ద ఇవ్వకపోయి ఉండవచ్చు.

3వ ప్రశ్న:
2 జూన్ 2019 అనంతరం అప్పటికే ఉన్న పరిశ్రమల కొనసాగింపు కోసం కాకుండా, కొత్తగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఏఫ్డీఐ) 2019 – 20, 2020 – 21 మరియ 2021 – 22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సమాచారం ఇవ్వగలరు?
సమాధానం :
ఏ దేశం నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయో ఆ దేశాల వారీగా , ఏ రాష్ట్రాలకు వచ్చాయో రాష్ట్రాల వారీగా, ఏ కంపెనీల కు వచ్చాయో ఆ కంపెనీల వారీగా ఏ సంవత్సరాల్లో వచ్చాయో , ఆ ఆర్థిక సంవత్సరాల వారీగా అక్టోబర్ 2019 నుండి http://dpiit.gov.in వెబ్సైట్ లోని ” Publications ” అనే హెడ్ క్రింద దొరుకుతుంది అనే సమాధానం వచ్చింది.
రిమార్క్:
పైన పేర్కొన్న వెబ్సైట్ లో 2019 నుండి 2022 వరకు డేటా పరిశీలిస్తే , దాదాపు 517 మిలియన్ల డాలర్లు అంటే 3,796 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఆ మొత్తం కూడా, 281 మిలియన్ల డాలర్లు. అంటే 1,957 కోట్ల రూపాయలు 2019 సంవత్సరంలో ఏప్రిల్ నుండి జూన్ మధ్య ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రాక ముందు వచ్చినదే. అలాగే నిల్వ 281 మిలియన్ల డాలర్లు. 2019 సంవత్సరంలో జూన్ నుండి సెప్టెంబర్ మధ్య వచ్చాయంటే, ప్రస్తుత ప్రభుత్వం రాబట్టిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు శూన్యం.
ముగింపు :
జగన్మోహన్ రెడ్డి బృందం దావోస్ పర్యటన విదేశీ విహార పర్యటనగా నిర్ధారణ అయ్యింది. అందుకే, దావోస్ పర్యటన ఖర్చుల దండగ అని ముందే చెప్పింది.

LEAVE A RESPONSE