Suryaa.co.in

Andhra Pradesh

రాజును హింసించిన ఐపిఎస్ సునీల్‌ను అరెస్టు చేయాలి

– ఏపీ పోలీసులకు సహకరించిన కేసీఆర్, కేటీఆర్‌కు తగిన శిక్ష
– కులం కార్డు వాడుతున్న సునీల్‌ను దళితులు నమ్మరు
– డాక్టర్ సుధాకర్‌ను హింసించినప్పుడు సునీల్ ఎక్కడున్నారు?
– వైసీపీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు నిద్రపోతున్నారా?
– టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే, నాటి ఎంపి రఘురామకృష్ణంరాజుపై అనాగరిక దాడి, కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన ఐపిఎస్ అధికారి సునీల్‌ను అరెస్టు చేయాలని టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య డిమాండ్ చేశారు. సునీల్‌పై ఫిర్యాదు చేసన రఘురామరాజు ధైర్యాన్ని ప్రజలంతా మెచ్చుకుంటున్నారని చెప్పారు. ఈ కేసులో సునీల్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బదులు, కులం కార్డు వాడటం సిగ్గుచేటన్నారు.

కానీ దళితులు సునీల్ మాయలో పడేంత అమాయకులు కాదని స్పష్టం చేశారు. డాక్టర్ సుధాకర్‌ను వేధించినప్పుడు, వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్‌ను చంపి ఇంటికి పార్శిల్ పంపించినప్పుడు, మంగళగిరి పోలీసులు ఎస్సీలపైనే ఎస్సీ ఎట్రాసిటీ కేసులు పెట్టి వేధించినప్పుడు సునీల్ నిద్రపోతున్నారా? గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా? అప్పుడు వాళ్లు కూడా దళితులేనన్న స్పృహ లేదా? అని బీసీ నేత లక్ష్మయ్య ప్రశ్నల వర్షం కురిపించారు.

తనను తాను రక్షించుకుని-సానుభూతి సంపాదించుకునేందుకు సునీల్ వాడుతున్న కులం కార్డు వలలో దళితులు పడరని, పడవద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించి, ఎఫ్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ట్వీట్ చేసిన సునీల్‌పై తక్షణం చర్యలు తీసుకోకపోతే, పోలీసు వ్యవస్థ గాడి తప్పుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రఘురామరాజును వేధించి, ఆయనపై హత్యాయత్నం చేసినందుకు సునీల్ శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, ఆ దృశ్యాలను శాడిస్టు జగన్‌కు చూపించిన నాటి అధికారులందరినీ అరెస్టు చేయాల్సిందేనన్నారు. నాడు హైదరాబాద్‌లో రఘురామరాజు అరెస్టుకు సహకరించిన కేసీఆర్-కేటీఆర్‌లను తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు.

టీడీపీ-జనసేన నేతలను రోజూ తిట్టే పంచ్ ప్రభాకర్- శ్రీరెడ్డిలాంటి వారిని వదిలేసి, జగన్‌కు వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టిన టీడీపీ నేతలపై కేసులు పెట్టి హింసించిన సునీల్‌పై, చర్యలు తీసుకోవాలన్న భావన రాష్ట్ర ప్రజల్లో ఉందన్నారు. సునీల్ అరెస్టు కోసం వందలాది మంది ఆయన బాధితులు ఎదురుచూస్తున్నారన్నారు.

LEAVE A RESPONSE