• అక్రమంగా పరిహారం కొట్టేశారంటూ పులిచింతల నిర్వాసితుల ఫిర్యాదు
• రేషన్ మాఫియాపై ఫిర్యాదు చేస్తే చంపేస్తామంటూ బెదిరింపులు
• గ్రీవెన్స్ లో మొరపెట్టుకున్న బాధితులు
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇక్కడి కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ లు ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు విని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. గ్రామాల్లోనే శుక్రవారం నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభం అయ్యాయని.. ప్రజలు దీన్ని గమనించి భూ సమస్యలను అక్కడే పరిష్కరించుకునేలా ప్రయత్నించాలని సూచించారు. అక్కడ పరిష్కారం కాని పక్షంలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని సూచించారు.
• గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీ గూడెంకు చెందిన పులిచింతల నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని ముంపు బాధితుల పరిహార పంపిణీలో అవక తవకలు జరిగాయని.. 45 మంది అక్రమార్కులకు అధికారులు అప్పనంగా డబ్బులు కట్టబెట్టారని దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఆగ్రామానికి చెందిన నిర్వాసితులు డిమాండ్ చేశారు.
• అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం స్టాక్ పాయింట్ లో రేషన్ బియ్యం గోడౌన్ నుండి రేషన్ మాఫియా బియ్యాన్ని తరలిస్తున్నారని ఫిర్యాదు చేస్తే.. పోలీసులు పంటించుకోకపోవడంతో.. నింధితులు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని అధికారులు రేషన్ మాఫియాను పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పొలినాటి వీరబాబు అనే వ్యక్తి నేతలు ఫిర్యాదు చేశారు.
• బాపట్ల జిల్లా నగరం మండలం అల్లపర్రు గ్రామానికి చెందిన తూమాటి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేస్తూ.. తాము కొనుగోలు చేసి రిజిస్ట్రర్ చేయించకున్న పొలంలో అక్రమంగా మట్టిని తోలడమే కాకుండా తమపై వంకాయల సురేష్ అతని భార్య దాడికి దిగారని వారిపై చర్యలు తీసుకొని తమ భూమిని తమకు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
• విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలసకు చెందిన తీగల వెంకట రమణాజీ రావు విజ్ఞప్తి చేస్తూ.. తన స్థలంలో రోడ్లు వేస్తూ కాలువలు తొవ్వుతున్నారని.. అక్రమాన్ని ప్రశ్నిస్తే తమను బెదిరిస్తున్నారని.. భూ కబ్జా దారుల నుండి తమకు ప్రాణ హాణి ఉందని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
• ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని.. నూతన భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని తూమాటి అచ్చయ్య విజ్ఞప్తి చేశారు.