Suryaa.co.in

Andhra Pradesh

ఇరిగేషన్, వ్యవసాయ శాఖల మంత్రులు రాజీనామా చేయాలి

-ధరల స్ధిరీకరణ నిధి పై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి
– నిలదీసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి
– జాతీయ కార్యదర్శి..సత్యకుమార్ ప్రశ్నకు.. వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ లకు మంత్రులెవరో తెలియదన్న రైతులు
– రైతు కంట్లో నీరు కాల్వ లో నీరు లేదు
– ఈ ప్రభుత్వం మారి తేనే రైతు కు న్యాయం
– కిసాన్ మోర్చా కర్తవ్య స్వీకార సభ

విజయవాడ: రైతు కంటిలో కన్నీరు.. సాగునీరు లేక ఎండుతున్న వ్యవసాయ భూములు ఇదీ ఆంధ్రప్రదేశ్ లో ఆరుగాలం కష్టపడుతున్న రైతాంగం దుస్తితి.. ఇప్పటికే 24 లక్షల ఎకరాల్లో సాగు చేయలేని దుస్తితి భవిష్యత్ అంధకారం అయిపోయింది.. దేశానికి అన్నదాత గా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రైతు పరిస్ధితి కడు దయనీయంగా మారిపోయింది… కిసాన్ మోర్చా కర్తవ్య స్వీకార సభలో వక్తల అభిబాషణ… రాష్ట్రంలో వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలకు చెందిన మంత్రుల కు ఏమాత్రం సిగ్గు ఉన్నా రాజీనామా చేయాలని కిసాన్ మోర్చా డిమాండ్.. కర్తవ్య స్వీకార సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలి చేతుల మీదుగా కిసాన్ మోర్చా రాష్ట్రకార్యవర్గం కర్తవ్యాన్ని స్వీకరించింది. వేదిక పైకి ఆహ్వానితులను కిసాన్ మోర్చా సీనియర్ నేత పూడితిరుపతి రావు ఆహ్వానించారు.

కిసాన్ మోర్చా రైతులను ఉద్దేసించి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీగా మేన్ ఫెస్టోలో ధరల స్ధిరీకరణ, రైతాంగానికి అవసరమైన శీతల గిడ్డంగులు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలు కావచ్చినా ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేదని ముఖ్యమంత్రిని దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రస్వరంతో ప్రశ్నించారు.

ఈ రెండు అంశాల పై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని నిలదీశారు. పురంధేశ్వరి…జైవాన్ జై కిసాన్ నినాదం ఆనాడు లాల్ బహుదార్ శాస్త్రి తీసుకుని వచ్చిన నినాదాన్ని ప్రస్తావిస్తు నుడు రైతు ఈ రాష్ట్రంలో ఎదొర్కొంటున్న పరిస్ధితిలను ఏకరవుపెట్టారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితిలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిధంగా వ్యవహరించడం లేదన్నారు.వ్యవసాయ రంగం వృద్ధి ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం. సాగునీటి కోసం, రైతు ఉత్పత్తి కి ధర కోసం ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలన్నారు.

సాగునీటి వ్యవస్థ మెరుగు పరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రైతు సమస్యల్ని పరిష్కరించడం లో రాష్ట్రప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.కేంద్ర ప్రభుత్వం రైతుల కు భరోసా ఇస్తోంది. 30నుండి 60శాతం భూములు కు సాగునీరు అందించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి ని వివరించారు.హరిత విప్లవం ద్వారా ప్రగతిని సాధించాం.రసాయనిక ఎరువులు వాడిని కారణంగా భూసారం కోల్పోయిన పరిస్థితి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నానో ఫెర్టిలైజర్ ప్రవేశ పెట్టారు.

ఈ కారణంగా భూసారం పెంచిన ఘనత ప్రధానిదే.యూరియా కొరత అధికమించడానికి వేప పూత ప్రధాని నరేంద్రమోదీ ఆలోచన ఫలితమే.కనీస మద్దతు ధర కోసం ఈనాం అమలు చేయడం జరిగింది.ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కేంద్రం ఇస్తోంది.అటల్ ఫించన్ యోజన అసంఘటిత రంగంలో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.వ్యవసాయ రంగానికి కేంద్రం ప్రభుత్వం పెద్దపీట వేసింది.

ఎపిలో వ్యవసాయ శాఖకు, ఇరిగేషన్ శాఖకు మంత్రులు ఎవరో తెలుసా అని బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ప్రశ్నించగా… తెలియదని సమాధానం వచ్చింది. మంత్రులు ఏమైనా సమీక్షలు చేస్తే ఎవరేంటో తెలుస్తుంది. ఆవిధంగా మంత్రులు వ్యవహరించడంలేదని సత్యకుమార్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ది చెబుతాం అన్నారు.

చిగురుపాటి కుమార స్వామి కి శుభాకాంక్షలు చెబుతూ, ఎబివిపి నుండి పోరాట యోధుడు కుమార స్వామి ఆయన నాయకత్వంలో కిసాన్ మోర్చా ఉద్యమ పంధాలో నడుస్తుందన్న నమ్మకం ఉందన్నారు.దేశానికి వెన్నెముక రైతు అంటారు.వ్యవసాయ రంగాన్ని వైసీపీ విస్మరించింది కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు లు జారీ చేసింది.కిసాన్ సమ్మాన్ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతా లకు వేయడం జరుగుతోంది.ఫసల్ బీమా యోజన అమలు కాకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ముఖ్య మంత్రి స్వంత జిల్లా లో కూడా రైతు లు ఇబ్బందులు పడుతున్నారు.కృష్ణా డెల్టా లో సాగునీటి సంక్షోభం ఉంది.

విశిష్ట అతిధిగా హాజరైన కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు జయసూర్యన్ మాట్లాడుతూ కేంద్ర పధకాలకు ప్రచారం కల్పించాలి.డిసెంబర్ 1 నుండి గ్రామదర్శన యాత్ర కిసాన్ మోర్చా చేపడుతుందన్నారు.సోషల్ మీడియా ద్వారా కేంద్ర పధకాలకు ప్రచారం కల్పించాలి.అనుభవం ఉన్న నేత కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి టీం ఆధ్వర్యంలో రైతు ల కు కేంద్రం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి.

మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రసంగిస్తూ.రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వ్యక్తి గత ఎజెండా తో వెళ్తూఉందన్నారు. సెక్రటేరియట్ కి పాలకులు రావడం లేదు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమస్యలు పైన పోరాటం చేస్తున్నారు.

కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడుగా భాద్యతలు స్వీకరించిన చిగురుపాటి కుమార స్వామి ప్రసంగిస్తూ… సిగ్గులజ్జా ఉంటే వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల మంత్రులు రాజీనామా చేయాలని తీవ్రస్వరంతో డిమాండ్ చేశారు. రైతు కంట్లో కన్నీరు కారిస్తే తాడేపల్లి ప్యాలెస్ లో మీరు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. కిసాన్ మోర్చా పార్టీ కి వెన్నుముక గా పనిచేస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరు తెలియని పరిస్ధితి నేడు నెలకొంది, ఎక్కడ అయిన రైతాంగ సమ్యల పై సమీక్ష చేశారా అని ప్రశ్నించారు.

రైతు కంట్లో నీరు కాల్వ లో నీరు లేదు అంటూ రైతు దయనీయ పరిస్థితి వివరించారు. నందమూరి బిడ్డ కు నియోజకవర్గం కావాలా అంటూ వైసీపి నేతల పై చిగురుపాటి కుమారస్వామి మండిపడ్డారు.పురంధేశ్వరి ని విమర్శించే అర్హత వైసీపీ కి లేదు.

ఈ ప్రభుత్వం మారి తేనే రైతు కు న్యాయం జరుగుతుంది రైతు ల పక్షాన పోరాటం చేస్తాం అని రైతాంగం కరతాళ ధ్వనుల మద్య ప్రకటించారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ,దారా సాంబయ్య,అడ్డూరి శ్రీ రాం తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE