వైకాపా సామాజిక న్యాయ బస్సు యాత్ర ఒక బూటకం

– దళితులను మరోసారి మోసం చేయడానికి బస్సు యాత్ర పేరుతో చేస్తున్న మరో అభూత కల్పన
-వర్ల రామయ్య

సామాజిక న్యాయానికి తూట్లు పొడిస్తూ, పేదల గొంతు కోస్తున్న పెత్తందారుడు జగన్‌రెడ్డి. గత నాలుగున్నరేళ్లుగా వైకాపా ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. బస్సు యాత్ర చేస్తున్న వైకాపా నాయకులు దళితవాడల్లో సంచరించే ధైర్యం ఉందా? సామాజిక న్యాయ బస్సును మాల, మాదిగ పల్లెలకు తీసుకెళ్లలేని బస్సు యాత్ర దేనికి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వైకాపా ప్రభుత్వం ఏ న్యాయం చేసిందో చెప్పాలి.

వైకాపా బస్సు దళితవాడలకు వెళితే ఎస్సీ, ఎస్టీలు తరిమి తరిమి కొడతారు. 27 దళిత పథకాలను రద్దు చేసి, రూ.1.14 లక్షల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించిన జగన్ రెడ్డి ఏ మొఖం పెట్టుకుని దళిత వాడలకు వస్తారు. వైకాపా సామాజిక న్యాయ బస్సును అగ్రవర్ణాల బహిరంగ ప్రదేశాల్లో నిలిపి అక్కడకు జనాన్ని సమీకరించుకుంటున్నారు. విదేశీ విద్యకు ప్రపంచ మేధావి డా. బీ.ఆర్ అంబేడ్కర్ పేరు తొలగించి జగనన్న అని పేరు పెడుతారా?

ఆర్ధిక నేరస్తుడికి డా. అంబేడ్కర్‌కు తేడా లేదా? వైకాపా బస్సు యాత్ర జనంలేక వెలవెలబోతోంది. వైకాపా నాయకులు దళితవాడలకు వెళితే తోలుతీసి ఎండగడుతారు. నేటికి వైకాపా నాయకులు అనేకమంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇన్నోవా కార్లలో తిరుగుతున్నారు. వైకాపా ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో నలుగురికి కూడా కార్పొరేషన్ల సబ్సిడీ లోన్లు ఇవ్వలేదు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు నిలిపివేయడాన్ని సుప్రీంకోర్టు సైతం జగన్ రెడ్డి ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ప్రక్కన కూర్చోపెట్టుకున్న జగన్ రెడ్డి దళిత మేనమామా?

50 వేల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయని జగన్ రెడ్డి దళిత ఉద్దారకుడా? బెస్ట్ అనస్తీషియా డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై బట్టలు ఊడదీసి కొట్టి..మానసిక వేధనకు గురిచేసి చనిపోయేలా చేశారు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన వరప్రసాద్ కు బోడిగుండి కొట్టించారు. సి.ఎం సొంత నియోజకర్గం పులివెందులలో నాగమ్మ అనే దళిత మహిళను అతి దారుణంగా మానభంగం చేసి హత్య చేస్తే జగన్ రెడ్డి పరామర్శించ లేదు.

లిక్కర్ రేట్లు ప్రశ్నించిన ఓం ప్రతాప్‌ను హత్య చేశారు. వెటర్నరీ ఛీఫ్‌గా పనిచేసిన డా. అచ్చెన్నను అతి దారుణంగా హత్య చేశారు. వైకాపా చేపడుతున్న సామాజిక న్యాయ బస్సు యాత్ర ఒక బూటకం. దళితులను మరోసారి మోసం చేయడానికి బస్సు యాత్ర పేరుతో చేస్తున్న మరో అభూత కల్పన. జగన్ రెడ్డికి నిజంగా దళిత వర్గాలపై ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా సామాజిక న్యాయ బస్సు యాత్రను మాల, మాదిగ పల్లెల్లో తిప్పాలని డిమాండ్ చేస్తున్నా.

Leave a Reply