Suryaa.co.in

Andhra Pradesh

నేను గెలిస్తే సీఎం రాజీనామా చేస్తారా?

– ఓడితే రాజకీయాల నుంచి వైదొలుగుతా
– ఫిబ్రవరి 5 వరకూ గడువిస్తున్నా
– సీఐడీ చీఫ్‌పై ఫిర్యాదును ఆరా తీస్తా
– ఉద్యోగ సంఘాలపై విజయం ఏసీబీ చీఫ్ ఘనతే
-13న నర్సాపురం వెళుతున్నా
– ఎంపీ రఘురామకృష్ణంరాజు సవాల్

హైదరాబాద్: ‘‘నేను రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికలో గెలిస్తే సీఎం జగన్ రాజీనామా చేస్తారా? నేను ఒకవేళ ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతా. దీనికి సిద్ధంగా ఉన్నారా’’ అని నర్సాపురం వైసీపీ ఎంపి కె.రఘురామకృష్ణంరాజు తన సొంత పార్టీ, సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. ‘జగన్ ఆ పదవి నుంచి త ప్పుకుని భారతీరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అయోధ్యరామిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలో ఎవరిని సీఎంగా పెట్టినా తనకు అభ్యంతరం లేద’న్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణంరాజు.. తనపై సవాల్ విసిరిన ఎంపీ, వైసీపీ విప్ భరత్‌ను ఎద్దేవా చేశారు. ‘అనర్హత’ అనే పదాన్ని పదిసార్లు మాట్లాడిన తర్వాత తన గురించి మాట్లాడాలని వ్యంగ్యాస్త్రం సంధించారు.

తాను ఫిబ్రవరి 5 వరకూ గడువు ఇస్తున్నానని, ఈలోగా ఎలాగూ పార్లమెంటు బడ్జెట్ సెషన్ ఉన్నందున ఈలోగా ప్రధాని, హోం మంత్రి, లోక్‌సభ స్పీకర్‌ను బతిమిలాడి తనపై అనర్హత వేటు వేయించాలని సవాల్ చేశారు. తాను పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, తాను పార్టీని ప్రేమిస్తానన్నారు. అయితే అమరావతి రైతులు నిర్వహించిన తిరుపతి సభకు వెళ్లినందుకు, తనపై అన ర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయబోతున్నట్లు సమాచారం ఉందన్నారు. ‘సీఎం జగన్, ఎంపీ భరత్ విష్వక్సేనుడు, అనర్హత అనే పదాలు పదదిసార్లు పలికితే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. మీరు పదిసార్లు అనర్హత అనే పదాలు పలికితే మీరు స్పీకర్ చుట్టూ తిరిగే పనిలేకుండా నేనే రాజీనామా చేస్తా. ఇదే నా సవాల్’ వ్యంగ్యాస్త్రం సంధించారు.

అమరావతి రాజధానిగా ఉంటుందని గతంలో తమ సీఎం జగన్, మంత్రి బొత్స కూడా చెప్పారని గుర్తు చేశారు. అమరావతి రైతుల పక్షాన నిలబడినందుకు తనకు గర్వంగా ఉందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు తాను మద్దతునిస్తున్నట్లు చెప్పారు. వారికి కావలసిన లీగల్ హెల్ప్ చేస్తానన్నారు. అమరావతి కోసం, ప్రభుత్వ అకృత్యాలకు చనిపోతున్న వారి కోసం తాను రాజీనామా చేస్తున్నానన్నారు. ఉప ఎన్నికలో తిరుపతి, కుప్పం మాదిరిగా లుంగీ బ్యాచ్‌లు దిగితే నర్సాపురంలో కుదరదని వ్యాఖ్యానించారు.

ఉద్యోగులకు ఏమీ చేయకపోయినా, తాజా నిర్ణయం వల్ల నష్టం జరిగినా కొందరు ఉద్యోగ సంఘ నేతలు పండుగ చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యోగులను క్రమశిక్షణలో పెట్టి, ప్రభుత్వం విజయం సాధించడం వెనుక ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు ఉన్నారని, ఆయనకు అభినందనలు చెబుతున్నానన్నారు. ‘సీఐడీ సునీల్‌కుమార్‌పై చర్యల గురించి కేంద్రం రాసిన లేఖకు ఏపీ ప్రభుత్వ

ప్రధానకార్యదర్శి నుంచి ఇప్పటిదాకా స్పందించలేదు. ఆరోజు నన్ను కొట్టినప్పుడు సునీల్‌కుమార్ అక్కడున్నారు. నేను ఈ విషయాన్ని మళ్లీ పార్లమెంట్‌లో స్పందిస్తా’నని రఘురామకృష్ణంరాజు చెప్పారు.అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ‘సలహాదారులను రెడ్డి సామాజికవర్గంతో నింపేసిన తమ ప్రభుత్వం మళ్లీ కొత్తగా జ్ఞానేంద్రరెడ్డిని సలహాదారుగా నియమించింది. అంటే ఆయన ఫారిన్‌లో ఉండి ఏపీకి సలహాలిస్తారా? ఏపీలో ఉండి ఫారిన్ వాళ్లకు సలహాలిస్తారో తెలియద’ని వ్యంగ్యాస్త్రం సంధించారు.

తాను ఈనెల 13న సంక్రాంతి సందర్భంగా తన నర్సాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానని రాజు చెప్పారు. తనకు తన సెక్యూరిటీ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉందన్నారు. మూడు రోజులు భీమవరంలో ఉన్న సమయంలో తాను ఎక్కడికి వెళ్లినా వీడియోలు ఏర్పాటుచేసుకున్నానని, మీడియా బృందాన్ని కూడా తీసుకువెళతానన్నారు.

LEAVE A RESPONSE