1వ తేదీ నుండి నారా భువనేశ్వరి మలివిడత ‘నిజం గెలవాలి’ కార్యక్రమం

మూడు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటన
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై ఆవేదనతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరామర్శ
విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో రేపు రైలు ప్రమాద బాధితులను పరామర్శించనున్న భువనేశ్వరి

రాజమహేంద్రవరం :- చంద్రబాబు అక్రమ అరెస్టుపై నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు జరగనుంది. నవంబర్ 1వ తేదీ నుండి 3 తేదీ వరకు నారా భువనేశ్వరి మలివిడత నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై మనోవేదనతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు.

1వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, 2వ తేదీన విజయనగరం జిల్లాలోని ఎచ్చర్ల, బొబ్బిలి, 3వ తేదీన విజయనగరం నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొంటారు. బాధిత కుటుంబాలను పరామర్శించడంతోపాటు నిజం గెలవాలి సభల్లో ఆమె పాల్గొంటారు.

రైలు ప్రమాద బాధితులకు పరామర్శ
విజయనగరం రైలు ప్రమాద బాధితులను భువనేశ్వరి 31వ తేదీన ఆసుపత్రిలో పరామర్శిస్తారు. మంగళవారం రాజమహేంద్రవరం నుండి బయలుదేరి విజయనగరం ప్రభుత్వాసుపత్రికి వెళతారు. బాధితుల పరామర్శ అనంతరం ఆముదాలవలస వెళ్లి అక్కడ బస చేస్తారు. బుధవారం నుండి మూడు రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు.

Leave a Reply