ఆంధ్ర యూనివర్సిటీ వి.సి.ప్రసాద్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి

Spread the love

– లేని పక్షం లో చలో ఆంధ్ర యూనివర్సిటీకి అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి పిలుపునిస్తాం
– ఏపి టి.ఎన్.ఎస్ .ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి.ప్రణవ్ గోపాల్

పదవీ విరమణ చేసిన ఆచార్య వడ్డాది కృష్ణ మోహన్ కన్నా సమర్థులు ఆంధ్ర యూనివర్సిటీ లో లేరా ? ఇది పదవి లో ఉన్న వారిని అవమానించడం కదా ? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేదీ 30 -12 -2021 న ఇచ్చిన జి.ఓ.ఆర్ టి నెంబర్ 313 లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వివరించిన పరిస్థితుల నేపథ్యం లో ఆచార్య వడ్డాది కృష్ణ మోహన్ ను రీ ఎంప్లాయిమెంట్ పేరిట అతనిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం ఆంధ్ర యూనివర్సిటీ లో ఉన్న సమర్థులైన ఎస్ సి , ఎస్ టి , బి సి., మరియు మైనారిటీ వర్గాల ఆచార్యులను అవమానించడమే అవుతుంది.

ఆచార్య ప్రసాద్ రెడ్డి చేసే అక్రమాలకు తోడుగా ఉంటారనే రెండో సారి ప్రత్యేక అభిమానం తో రీ ఎంప్లాయిమెంట్ ఉత్తర్వులను తీసుకొనివచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ లో గత రెండున్నర సంవత్సరాల కాలం లో ఇద్దరు కలిసి యూనివర్సిటీని భ్రష్టు పట్టించారు .

పదవీ విరమణ చేసిన ఆచార్యుడిని రీ ఎంప్లాయిమెంట్ అని ఉత్తర్వులు ఇస్తే రిజిస్ట్రార్ గా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించారు .మరొక వ్యక్తి రిజిస్ట్రార్ గా వస్తే ప్రసాద్ రెడ్డి గారి అవినీతి అక్రమాలు బయట పడతాయనే తన పరపతినంతా ఉపయోగించి నిబంధనలకు విరుద్ధంగా అతనినే కొనసాగిస్తున్నారు .
ఆంధ్ర యూనివర్సిటీ వివిధ కాలేజీలలో ప్రిన్సిపల్స్ ను కూడా నిబంధనలకు విరుద్ధంగా కొంత మంది పదవి విరమణ చేసిన వారిని, కొంత మంది పదవి కాలం ముగిసిన కొత్త వారికీ అవకాశం ఇవ్వకుండా కొనసాగిస్తున్నారు. యూనివర్సిటీ లో జరుగుతున్న అక్రమాల పై రాష్ట్ర గవర్నర్ మరియు ఛాన్సలర్ స్పందించాలి .

Leave a Reply