– ఎన్ఐఏ విజయవాడలో సోదాలు జరిపేవరకు ఏపీ పోలీస్ దృష్టి, అషీ ట్రేడింగ్ కంపెనీపై ఎందుకు పడలేదు?
– డీజీపీ ప్రభుత్వానికి బాకా ఊదడం మానేసి, రాష్ట్రంలో సాగవుతున్న గంజాయి ధ్వంసంపై దృష్టిపెడితే మంచిది.
– శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి
దేశంలో ఆంధ్రరాష్ట్రం గంజాయి ఉత్పత్తి , రవాణా కేంద్రంగా మారితే, డీజీపీమాత్రం, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతంచేస్తున్నాయి తప్ప, గం జాయి సాగుపెద్దగా లేదని, అది ఎప్పటినుంచో రాష్ట్రంలో సాగవుతోందని చెప్పడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. మంగళవారం ఆయన మంగళ గిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
నిన్నకూడా డీజీపీ తమతడాఖా చూపిస్తామని, గంజాయిని అరికడతా మని చెప్పారు. రెండున్నరేళ్లనుంచి రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా సాగుఅవుతుంటే, ఉత్పత్తికేంద్రాలను పోలీసులు, ప్రభుత్వం ఎందుకు నిర్మూలించలేదని తాముప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వంకొత్తగా నియమించిన ఎస్ఈబీ (స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో), ఎక్సైజ్ విభాగం ఏం చేస్తు న్నాయో డీజీపీ చెప్పాలి. రాష్ట్రం సారా కంపుకొడుతోంది. ఎప్పుడైతే ప్రభుత్వం నాసిరకం మద్యంఅమ్మకాలు ప్రారంభించిందో, అప్పటినుంచే గంజాయి, నాటుసారా అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగాయి. స్వయంగా వైసీపీనేతలే దగ్గరుండి మరీ గంజాయిసాగు, రవాణాను ప్రోత్సహిస్తు న్నారు.
డీజీపీ గారేమో స్వయంగా అధికారపార్టీకివత్తాసుపలికేలా, సాక్షి పత్రికలో వచ్చిన రాతలనే మీడియాముందు వల్లెవేస్తున్నారు. తమకు, తమప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా డీజీపీ అంటున్నారు. విజయవాడలోసోదాలు జరిపి, అతిముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనంచేసుకున్నామని ఎన్ ఐఏ స్పష్టంగా చెప్పింది. ఎన్ఐఏ సోదాలు జరిపిన ఆషీ ట్రేడింగ్ కంపెనీలో, డీజీపీ, రాష్ట్రపోలీసులు ఎందు కు సోదాలు జరపలేదు? రాష్ట్రానికి గంజాయితో, ఇతరమాదకద్రవ్యాలతో సంబంధమే లేకపోతే, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఎందుకు రాష్ట్రాన్ని వేలెత్తిచూపుతున్నాయో డీజీపీ చెప్పాలి.
ప్రతిపక్షాలను అణచడానికి, ప్రజలతరుపున మాట్లాడే టీడీపీ నేతలను అరెస్ట్ చేయడానికి డీజీపీ ముందుంటారు, ప్రతిపక్షాల గొంతు అణచడంలో ముందుండే డీజీపీ, రాష్ట్రంలో గంజాయి మూలాలను అరిక ట్టడంలో ఎందుకు విఫలమయ్యారు? ప్రజలు ప్రభుత్వం అమ్ముతున్న దిక్కుమాలిన నాసిరకం మద్యాన్నికొని తాగలేకనే నాటుసారా, గంజా యి సేవనానికి బానిసలు అవుతున్నారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణ మద్యపాననిషేధం పేరుతో ప్రజలను దారుణంగా వంచించింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగినందునే, పేదలు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలు అవతున్నారని వైద్యులు కూడా చెబుతున్నారు.
ఇంతజరుగుతుంటే బ్లాక్ పేపర్ సాక్షిలో మాత్రం డ్రగ్స్, గంజాయి కట్టడిలో ఏపీ భేష్ అని రాతలు రాస్తారు. ఎక్కడ కట్టడిచేశారో, ఎవరు చేశారో, మాత్రం చెప్పరు. ఎన్ సీఈఆర్ బీ నివేదిక ప్రకారం 2020లో మాదకద్రవ్యాలకు, ఇతరమత్తుపదార్థాలకు బానిసలై 385 మంది యువకులు చనిపోయారు. 2018లో 196 మంది చనిపోతే, ఆ సంఖ్య జగన్ ప్రభుత్వంలో రెండింతలు ఎందుకు పెరిగిందో డీజీపీ సమాధానం చెప్పాలి. డీజీపీ, ఎక్సైజ్ శాఖ గంజాయి, ఇతరమాదకద్రవ్యాలను కట్టడి చేసుంటే, వాటి వినియోగంతో చనిపోయేవారి సంఖ్య ఎందుకు పెరిగింది ? డీజీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించకుండా, ప్రతిపక్షాలను అణచి వేయడంపై శ్రద్ధపెట్టకుండా, గంజాయిని అరికట్టడంపై దృష్టిపెడితే మంచి ది.
రూ.8వేలకోట్ల విలువైన గంజాయి రాష్ట్రంలో సాగవుతోంది. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల కారణంగా చిన్నవయసులోనే యువత వారి జీవితాలను నాశనంచేసుకుంటోంది. ప్రభుత్వం చెప్పినమాటప్రకారం ఎప్పటిలోగా సంపూర్ణమద్యపాననిషేధం అమలుచేస్తుందో సమాధానం చెప్పాలి. మద్యం సేవించేవారిని తాకట్టుపెట్టి, రూ.25వేలకోట్ల అప్పులు తెచ్చినప్పుడే , ప్రభుత్వానికి మద్యపాననిషేధంపై చిత్తశుద్ధి లేదని తేలి పోయింది. డీజీపీ ఇప్పటికైనా అధికారపక్షానికి బాకా ఊదడంమానేసి, రాష్ట్రంలో చలామణీ అవుతోన్న మాదకద్రవ్యాలు, గంజాయిని అరికడితే మంచిదని సూచిస్తున్నాం.