మూడు పార్టీలు కలిసినా కూడా డిపాజిట్‌ దక్కలేదు: ఎంపీ అవినాష్‌ రెడ్డి

కడప: బద్వేలు ఉప ఎన్నికలు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పాలనకు రెఫరెండంగా భావించారని ఎంపీ అవినాష్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు దేశం మొత్తం గర్వించేలా సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపరిచారన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అలుపెరగకుండా కష్టపడ్డారని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమిష్టిగా పనిచేశారని తెలిపారు. టీడీపీ, బీజేపీకి పూర్తిగా సహకరించిందని విమర్శించారు. బీజేపీ,జనసేన, టీడీపీలు కలిసినా డిపాజిట్‌ కూడా దక్కలేదని పేర్కొన్నారు. ఈ గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. మరింత మన్ననలు పొందేలా పనిచేస్తామని ఎంపీ అవినాష్‌ రెడ్డి స్పష్టం చేశారు.