– వైఎస్సార్ మరణం కుట్ర అన్న షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ వివరణ ఇవ్వాలి
– పవన్ కళ్యాణ్ మాటలకు తాడేపల్లి ప్యాలెస్ వణుకుతోంది
* ఓటమి భయంతోనే పేర్నినాని అనే కుక్క మొరుగుతోంది
* పేర్ని నాని అనే కుక్క కొంపలోనూ పనికి రాడు.. క్యాబినెట్లోనూ పనికి రాడు
* ఆస్తుల కోసం తల్లి, చెల్లిని తరిమేసిన చరిత్ర వైసీపీ అధినాయకుడిది
* తండ్రి శవం పక్కనే సంతకాల సేకరణ చేశాడు
* జనసేన నాయకులు షేక్ రియాజ్, కళ్యాణం శివ శ్రీనివాస్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 45 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకు తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు పుట్టిందని… అందుకే పెంపుడు కుక్కలు మొరగడం మొదలుపెట్టాయని జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ వ్యాఖ్యానించారు. ఆయన, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ (కె. కె.) ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.
షేక్ రియాజ్ మాట్లాడుతూ “పేర్ని నాని అనే కుక్క పవన్ కళ్యాణ్పై ఎంత మొరిగినా మళ్లీ మంత్రి పదవి రాదు. చిరంజీవి ని మా పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడిచారు అని ఈ కుక్క మొరిగింది. ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో చెప్పాలి. సున్నిత మనసు కలిగిన చిరంజీవి నానిలాంటి చెత్త వెధవల రాజకీయాలకు ఇబ్బందిపడి పార్టీని విలీనం చేశారు. మీలాంటి చెత్తను ఏరిపారేయడానికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టాలని తాడేపల్లి ప్యాలెస్ యజమాని, అక్కడి పెంపుడు కుక్కలు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు. పదవుల కోసం సొంత తండ్రి, బాబాయ్ లను చంపుకున్న చరిత్ర మీ నాయకుడిది. ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేశాడు. మీ యజమాని చంచల్ గూడ జైల్లో ఉంటే ‘జగనన్న విడిచిన బాణాన్ని’ అంటూ ఊరూరా తిరిగిన షర్మిలను ఆ అన్న గారు ఎలా మోసం చేశాడో ప్రజలందరికి బాగా తెలుసు.
రిలయన్స్ స్టోర్స్ మీద దాడి చేయలేదా?
తన తండ్రి మరణం వెనక కుట్ర ఉందని.. ఇప్పుడు తన హత్యకు కుట్ర చేస్తున్నారు షర్మిలా భయపడుతుంది. వైఎస్ఆర్ మరణానికి, ఇప్పుడు షర్మిలా హత్యకు కుట్ర చేస్తుంది ఎవరో ప్యాలెస్ కుక్క చెప్పాలి. వైఎస్ఆర్ మరణం వెనుక కుట్ర ఉందని ఆ రోజు రోజు రిలయన్స్ స్టోర్లు పగలగొట్టించి… ఇప్పుడు ఆ కంపెనీకి దగ్గరగా ఉండే పరిమళ్ నాత్వానికి తమ పార్టీ నుంచి రాజ్యసభ టికెట్ ఇవ్వడం వెనక ఉన్న కథ ఏమిటో చెప్పాలి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ సతీమణి భారతి రెడ్డి ప్రమేయం ఏమిటో కూడా చెప్పాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన ప్రమేయం లేదు అని తెలంగాణ నాయకులు మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పారు. ఆ ధైర్యం భారతి రెడ్డికి ఎందుకు లేదు? కోర్టులో తన కేసుకు సంబంధించిన పేపర్లను దొంగతనం చేసిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడం సిగ్గుచేటు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుస్తామని మీ నాయకుడు చెబుతున్నాడు. అలా గెలవలేని పక్షంలో మీ పార్టీని బంగాళఖాతంలో కలిపేస్తారా? ఇంకోసారి మా నాయకుడు మీద అవాకులు చెవాకులు పేలితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని” హెచ్చరించారు.
పేర్ని నానిని మహిళలు వెంటపడి కొట్టడం ఖాయం: కళ్యాణం శివ శ్రీనివాస్
పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ (కె. కె.) మాట్లాడుతూ రాష్ట్రంలో నడుస్తోన్న రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయడం తథ్యమని అన్నారు. ఆయన మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక్క మాట మాట్లాడితే పేర్ని నాని అనే పెద్ద కుక్క తోక ఊపుకొంటూ మెరుగుతుంది. కాపు సామాజిక వర్గంలో ఇలాంటి వ్యక్తి పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం. కాపు సామాజికవర్గాన్ని వైసీపీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన వ్యక్తి పేర్ని నాని. కొంపలోకి పనికిరాడు… క్యాబినెట్ కు పనికిరాని బోడి లింగం అతను. జగన్ పక్కన పెట్టేసినా… మొరగడం మాత్రం ఆపడం లేదు. పేర్ని నాని తండ్రి కృష్ణమూర్తి బతికి ఉంటే … కాపు సామాజిక వర్గానికి ఈ పెద్ద కుక్క చేసిన అన్యాయం చూసి వెంటనే గుండె ఆగి మృతి చెందేవాడు. పవన్ కళ్యాణ్ పై ఇంకోసారి అవాకులు చెవాకులు పేలితే మీ నియోజకవర్గంలోని మహిళలే మిమ్మల్ని చీపుర్లు, చేటలతో తరిమికొట్టే పరిస్థితి వస్తుంది.
కాపు సామాజికవర్గానికి చేసిన మేలు ఏంటి?
ఇసుక, మట్టి, మద్యం ఇలా ప్రతిదానిలో దోచుకోవడం… దాచుకోవడం తప్ప కాపు సామాజికవర్గానికి మీ ప్రభుత్వం చేసిన మేలు ఏంటి? ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు ఏంటి? ఈ మూడున్నరేళ్లలో మీరు ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా? ముఖ్యమంత్రి కావాలనే ఆశతో తండ్రి శవం దగ్గర జగన్ సంతకాలు సేకరించిన మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ కు తిట్టిన వాళ్లు… ఇప్పుడు వైసీపీలో మంత్రి పదవులు అనుభవిస్తున్న మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో దాదాపు 3వేల మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే… వాటిని పవన్ కళ్యాణ్ గారు బయటపెట్టే వరకు మీకు తెలియదు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతులకు మా అధ్యక్షులు అండగా నిలబడితే మీరు చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మీ పార్టీకి 45 సీట్లు కాదు కనీసం 25 సీట్లు కూడా రావని” అన్నారు.