( పార్ధసారధి పోట్లూరి )
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియంత ! మూర్ఖుడు! అసలు ఏమి ఆశించి ఉక్రెయిన్ మీద దాడి చేశాడు ?
ఇంటా బయట ఇలాంటి విమర్శలు ఎదుర్కుంటున్నా పుతిన్ తన నిర్ణయం మీద పూర్తి విశ్వాసం మరియు పట్టుదలగానే ఉంటూ వచ్చాడు. పుతిన్ మొదటి నుండి ప్రస్తుత ఉక్రెయిన్ రాజకీయ నాయకత్వం ని మార్చాలని పట్టుబడుతూ వచ్చాడు. ప్రస్తుత అధ్యక్షుడు వోలోదోమిర్ జేలేన్ స్కీ అతని మంత్రి వర్గ సహచరులని తొలగించాలి అంటూ రావడానికి కారణం ఏమిటో అందరికీ తెలిసింది ఒకటి అయితే, పుతిన్ కి తెలిసింది మరొకటి !
ఉక్రెయిన్ ‘డర్టీ బాంబ్ ‘ తయారుచేస్తున్నది !
ప్రస్తుత అధ్యక్షుడి నేతృత్వంలోని ఉక్రెయిన్ ప్రభుత్వం ‘’డర్టీ బాంబ్ ‘’తయారుచేస్తున్నది అని ఖచ్చితమయిన సమాచారం దొరికిన తరువాతే పుతిన్ ఉక్రెయిన్ మీద దాడికి ఆదేశాలు ఇచ్చాడని అర్ధంచేసుకోవాలి. ఫిబ్రవరి 26 న రష్యన్ దళాలు మొదట పశ్చిమ ఉక్రెయిన్ లో ఉన్న మూతపడి ఉన్న ‘’ చెర్నోబిల్ ‘’ అణు విద్యుత్ కేంద్రం ని తమ స్వాధీనం లో తీసుకున్నాయి.
1986 లో అప్పటి సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ లోని ‘’చెర్నోబిల్’’ అణు విద్యుత్ కేంద్రంలో పెద్ద పేలుడు సంభవించి అణు ధార్మికత బయటికి వెలువడింది. అప్పట్లో చనిపోయిన వారి సంఖ్య ఏంటో ఇప్పటికీ ఖచ్చితమయిన లెక్క లేదు కానీ తరువాత చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని
శాశ్వతమ్ గా మూసివేసింది సోవియట్ యూనియన్. చెర్నోబిల్ చుట్టుపక్కల 40 km ప్రాంతాన్ని నివాస యోగ్యమయినది కాదు అంటూ నోటిఫై చేసింది సోవియట్ యూనియన్. అప్పటి నుండి అది మూత పడే ఉంది. రియాక్టర్ ఉన్న ప్రాంతాన్ని దట్టమయిన సిమెంట్ కాంక్రీట్ తో కప్పేసారు.1986 లో ప్రమాదం జరిగితే 1991 లో సోవియట్ యూనియన్ విచ్చిన్నం తరువాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. చేర్న్నోబిల్ కూడా ఉక్రెయిన్ లో భాగంగా ఉండి పోయింది.
ఫిబ్రవరి 26 న రష్యా దళాలు చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాక క్షుణ్ణంగా ఆ ప్రాంతం మొత్తం పరిశీలించింది రష్యన్ దళాలతో వచ్చిన అణు శాస్త్రవేత్తల బృందం. ఫిబ్రవరి 28న రష్యన్ శాస్త్రవేత్తల బృందానికి చెర్నోబిల్ లో ‘’డర్టీ బాంబ్ ‘’ ని తయారుచేస్తున్నట్లు ఆధారాలని కనుగొన్నారు.
మూసేసిన అణు విద్యుత్ కేంద్రంలో ‘’డర్టీ బాంబ్ ‘’ ఎలా తయారుచేయగలరు ?
Well ! చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో రియాక్టర్ పేలుడు జరిగినప్పుడు అప్పటికే అక్కడ పెద్ద మొత్తంలో శుద్ధి చేసిన యూరేనియం నిల్వలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ముందు దానిని మూసివేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ అక్కడ ఉన్న యూరేనియం నిల్వల మీద దృష్టి పెట్టలేదు ఎందుకంటే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడం వలన సహాయ చర్యలు తీసుకునే సిబ్బంది ఆ ప్రమాదంలో మరణించారు. దాంతో యూరెనియమ్ నిల్వలు అలానే అక్కడే వదిలేసారు. 2018 లో వోలోదిమిర్ జేలేన్ స్కీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చెర్నోబిల్ లో డర్టీ బాంబ్ తయారుచేయడం మీద దృష్టి పెట్టినట్లు పుతిన్ కి ఇంటలిజెన్స్ ఇన్పుట్ ఉంది.
కానీ అది ఎంత వరకు నిజం అన్నది నిర్ధారణ కాలేదు. అయితే 2019 లో డర్టీ బాంబ్ విషయం లో ఖచ్చితమయియన సమాచారం లభించింది కానీ కోవిడ్ తీవ్రత దృష్ట్యా పుతిన్ సైనిక చర్యతీసుకోలేక పోయాడు. కోవిడ్ సమస్య లేకుండా ఉండి ఉంటె పుతిన్ 2020 జనవరి నెలలోనే ఉక్రెయిన్ మీద దాడి చేసి ఉండే వాడు.
చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో దొరికిన ఆధారాలతో ఉక్రెయిన్ కి తూర్పు దిశలో ఉన్న జాపోరిఝిఝియా[ ZAPORIZHIZHIA ] అణు విద్యుత్ కేంద్రం ని స్వాధీనం చేసుకోవడం లో ఉన్న ఉద్దేశ్యం అక్కడ కూడా శుద్ధి చేసిన యూరేనియం నిల్వలు ఉన్నాయి. జాపోరిఝిఝియా[ ZAPORIZHIZHIA ] అణు విద్యుత్ కేంద్రంలో ఇంకా ఎవన్నా ఆధారాలు దొరుకుతాయేమో అని స్వాధీనం చేసుకుంది. కానీ అణు విద్యుత్ కేంద్రంలో ఉన్న కంప్యూటర్ లలో డర్టీ బాంబ్ తయారుచేయడానికి కావాల్సిన బ్లూ ప్రింట్ తాలూకు సమాచారాన్ని డిలీట్ చేసారు అక్కడ ఉన్న ఇంజీనీర్లు.
అయితే కంప్యూటర్ లో ఉన్న డేటా ని డిలీట్ చేస్తే దాన్ని ఎలా తిరిగి సంపాదిన్చవచ్చో రహ్యా చాలా కాలం కిందటే అందులో ప్రావీణ్యం సంపాదించింది కాబట్టి డిలీట్ చేసిన బ్లూ ప్రింట్ తాలూకు డేటా ని తిరిగి తీసుకోవడం రష్యాకి పెద్ద కష్టమయిన పని కాదు. పుతిన్ తన మిషన్ గోల్ ని విజయవంతంగా సాధించాడు.
డర్టీ బాంబ్ అంటే ఏమిటి ?
డర్టీ బాంబ్ అంటే ముడి యూరేనియంని కానీ లేదా శుద్ధి చేసిన యూరేనియంని కానీ ఒక పధ్ధతి ద్వారా పేలుడు పదార్ధం ద్వారా పేలుడు సృష్టించి విధ్వంసం సృష్టించవచ్చు. కాకపొతే సాంప్రదాయ న్యూ క్లియర్ బాంబ్ పేలినప్పుడు వచ్చే మష్రూమ్ [పుట్ట గొడుగు ] లాంటిది ఏమీ ఉండదు. కానీ పరిమిత
ప్రాంతంలో అణు దార్మికతని వ్యాపిమ్పచేస్తుంది. కొన్నాళ్ళ పాటు ఆ ప్రాంతం దేనికీ పనికిరాకుండా పోతుంది రేడియేషన్ ప్రభావం వలన. జన సమూహం ఉన్న ప్రాంతాలలో దీనిని ప్రయోగిస్తే జన నష్టం తో పాటు ఆ ప్రాంతం మొత్తం శాశ్వతంగా మూసేయాల్సి వస్తుంది.
ఇంకో రకంగా చెప్పాలి అంటే టాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాలు ఎలా అయితే పరిమిత ప్రదేశానికే నష్టo కలుగుచేస్తాయో డర్టీ బాంబ్ కూడా అంతే ! గతంలో ISIS కూడా డర్టీ బాంబ్ తయారు చేయాలనీ ప్రయత్నించింది. ఈ బాంబ్ తయారు చేయడం ఎలాగో డార్క్ వెబ్ లో సమాచారం దొరుకుతుంది.
తాజా జేలేన్ స్కీ ప్రకటన వెనుక దాగి ఉన్న రహస్యం బహుశా డర్టీ బాంబ్ అయిఉండవచ్చు. ఈ విషయం యూరోపియన్ యూనియన్,అమెరికా కి తెలుసా ? తెలియకుండా ఎలా ఉంటుంది ? కానీ బలి పశువు జేలేన్ స్కీ ఉన్నాడు కదా ? మాకేమీ తెలియదు అనేస్తారు బలి అయ్యేది జేలేన్ స్కీ మాత్రమె ! జేలేన్ స్కీ ప్రకటన ని జాగ్రత్తగా గమనిస్తే ‘’సహాయం కోసం అర్దించే ఉక్రెయిన్ లాంటి దేశానికి నేను అధ్యక్షుడుగా ఉండలేను ‘’ అంటే దేశం విడిచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది.
తనకి కావాల్సిన సమాచారం చేతికి అందిన తరువాతే తాత్కాలిక కాల్పుల విరమణ కోసం పుతిన్ ప్రతిపాదన చేసాడు. జేలేన్ స్కీ ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా తూర్పు ఉక్రెయిన్ లో ఉన్న DOMBAAS ప్రావిన్స్ రష్యా కి వెళ్ళిపోతుంది. అలాగే నల్ల సముద్ర తీరం ఉన్న ఒడెస్సా ప్రావిన్స్ కూడా రష్యా తీసేసుకొని మిగతా ఉక్రెయిన్ ని వదిలేస్తుంది. అందుకే జేలేన్ స్కీ ప్రకటన మీద ఇంతవరకు పుతిన్ స్పందించలేదు. స్పందించాల్సింది నాటో మాత్రమే !
పుతిన్ చాలా స్పష్టంగా ఉన్నాడు! డర్టీ బాంబ్ గురించి అసలు బయటపెట్టలేదు. కానీ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు డర్టీ బాంబ్ అనే యజ్ఞ ఫలాన్ని ఎవరు ఎవరికి ఇవ్వాలి ? యజ్ఞ పురుషుడు కలశంతో సిద్ధంగా ఉన్నాడు ఎవరు స్వీకరిస్తారో అని. ఎవరు స్వీకరిస్తారు ? వేచి చూద్దాం !