Suryaa.co.in

Andhra Pradesh

బాధిత మహిళ పోరాటానికి స్పందించకపోవడమే మానవీయతా?

– కాకినాడ కు చెందిన ఆరుద్ర అంశంపై సిఎంను ప్రశ్నిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్

కాకినాడ కు చెందిన ఆరుద్ర విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకింత నిర్దయగా వ్యవహరిస్తోంది ఒక బాధిత మహిళ కష్టం తీర్చలేని విధంగా ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు తయారయ్యాయి? బిడ్డ వైద్యం కోసం ఆ తల్లి చేస్తున్న పోరాటాన్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవడం లేదు? మీ ఆరోగ్య శ్రీ ఏమయ్యింది? ఒక మహిళ చేస్తున్న పోరాటానికి స్పందించకపోవడమే వైఎస్ జగన్ మానవీయతా?న్యాయం కోరుతూ ఏకంగా సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించిన మహిళ సమస్యను ఏడాది కాలంగా ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు.

ప్రశ్నించిన ఆమెకు మానసిక పరిస్థితి సరిగా లేదంటారా? పైగా పిచ్చాసుపత్రికి తరలిస్తారా? అసలు ఆమె డిప్రెషన్ లోకి వెళ్లడానికి కారణం ఎవరు? ఆమెను చివరికి ఏం చేయబోతున్నారు? వెంటనే ఆరుద్ర సమస్యను పరిష్కరించాలి. ఆమె కుటుంబానికి తగిన సాయం అందించాలి.

 

LEAVE A RESPONSE