Suryaa.co.in

Andhra Pradesh

మాలల ద్రోహి జగన్ రెడ్డి – మాలల భాంధవుడు చంద్రన్న

– జగన్ రెడ్డి పాలనలో మాలలపై జరిగినన్ని దాడులు, హత్యలు మరే పాలకుడి హయాంలో జరగలేదు

– మాదిగల ఆత్మీయ సమావేశం తరహాలో త్వరలో మాలల ఆత్మీయ కలయిక
– మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

వివిధ కులాలు, సామాజిక వర్గాల సాధికారతే ప్రజాసాధికారత అన్ని నమ్మి అందుకు అనుగుణంగా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నాటి నందమూరి తారక రామారావు గారు నుంచి నేటి నారా చంద్రబాబు నాయుడు గారి వరకు అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లుగా భావించి పథకాలను అమలు చేశారు. త్వరలో రానున్న టిడిపి ప్రభుత్వంలో సైతం ఇదే పంధాను మరింత ఉదృతం చేసేలా సాధికార కమీటీల ఆధ్వర్యంలో సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నాం.

ఇటీవల ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశం కూడా ఇందులో భాగమే. మాదిగ సోదరుల సమావేశం తరహాలోనే మాలల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తాం. మాలల అభివృద్ది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో మాలలకు ఒరిగింది ఏమీ లేదు. ఎన్నికలకు ముందు మాలలను నమ్మించి ఓట్లేయించుకున్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మోసం చేశాడు.

జగన్ రెడ్డి పాలనలో మాలలపై వేలాది దాడులు జరిగాయి. కాకినాడ సుబ్రమణ్యం, పెందుర్తి పర్రి శ్రీకాంత్, దోమతోటి విక్రం, కావలి కరుణాకర్, చీరాల కిరణ్, చిత్తూరు ఓం ప్రతాప్, గుంటూరు రమ్య లాంటి అనేకమంది మాలలను జగన్ రెడ్డి ప్రభుత్వం పొట్టనపెట్టుకుంది. జగన్ రెడ్డి పాలనలో మాలలపై జరిగినన్ని దాడులు, హత్యలు, అఘాయిత్యాలు మరే పాలకుడి హయాంలో జరగలేదు. సుబ్రమణ్యంను చంపిన హంతకుడు అనంతబాబుకు బెయిల్ ఇప్పించి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేయించిన వ్యక్తి జగన్ రెడ్డి.

అమరావతిలో 25 ఎకరాల్లో అంబేడ్కర్ స్మృతివనం, అందులో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటును ధ్వసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఇకపై జగన్ రెడ్డిని మాల జాతి ఎన్నటికీ నమ్మదు.

మాలల బాంధవుడు చంద్రన్న. 2001 లోనే జస్టిస్ పున్నయ్య కమిటీని ఏర్పాటు చేసి 42 సిఫారసులను యధాతదంగా ఆమోదించి వాటి అమలుకు 18 జీవోలను తెచ్చిన పెద్దమాల చంద్రబాబు నాయుడు.

డా. అంబేడ్కర్ గారికి భారతరత్న ఇవ్వడంలో, బాలయోగిని లోక్ సభ స్పీకర్ గా, ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ గా చేయడంలో తెలుగుదేశం పార్టీ కీలకపాత్ర పోషించింది. రాబోయే టిడిపి ప్రభుత్వంలో సైతం మాలలకు పెద్దపీట వేసి సాధికారత అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అందుకు కృతజ్ఞతగా తెదేపా కేంద్ర కార్యాలయంలో తర్వలో మాలల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తాం.

 

LEAVE A RESPONSE