Suryaa.co.in

Telangana

ఓడిపోయిన కూతురుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా?

– మందు గోలీలిచ్చేటోడికి రాజ్యసభకు పంపాలని రాజ్యాంగంలో ఉందా?
–  మందులో సోడా కలిపేటోళ్లకు మంత్రి పదవులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా?
– మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు…. ముఖ్యమంత్రి కేసీఆర్ ను
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి పార్లమెంట్ వరకు ‘‘బీజేపీ భీం పాదయాత్ర’ చేసిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు.

రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను చూసి తెలంగాణ సభ్య సమాజం ఛీ థూ అంటూ తలదించుకుంటోంది. అయినా సిగ్గూ శరం లేకుండా టీఆర్ఎస్ నేతలు కండకావడరంతో మాట్లుడుతూ సమర్ధించుకుంటున్నరు.

పైగా దళితులకు సీఎం పదవి ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా? దళితులకు 3 ఎకరాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా? దళిత బంధు ఇవ్వాలని రాజ్యాంగం చెబుతోందా? అని ఎదురుదాడి చేస్తున్నరు. అధికార గర్వంతో కళ్లు నెత్తికెక్కి కండకావరంతో మాట్లాడుతున్నరు.

దళితుడిని సీఎం చేస్తున్నానని ప్రకటించిందెవరు?మరి టీఆర్ఎస్ నేతలను నేనడుగుతున్నా….. ఎన్నికల్లో ఓడిపోయిన కూతురుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా? మందు గోలీలిచ్చేటోడికి రాజ్యసభకు పంపాలని రాజ్యాంగంలో ఉందా? మందులో సోడా కలిపేటోళ్లకు మంత్రి పదవులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా?

సెక్రటేరియట్ రావాల్సిన అవసరం లేదు… ఫాంహౌజ్ లోనే పండుకుని పాలన చేస్తే చాలని రాజ్యాంగంలో ఉందా? ఉన్న సెక్రటేరియట్ ను కూల్చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని రాజ్యాంగంలో ఉందా? జీ హుజూర్ అని తల ఊపేటోడికే హోంమంత్రి పదవి ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా? రిటైర్డ్ అయినా వాళ్లందరినీ సీఎం సలహాదారులుగా పెట్టుకోవాలని రాజ్యాంగంలో ఉందా?

నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన అవసరమే లేదని రాజ్యాంగంలో ఉందా?ఉద్యోగుల కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని… వాళ్ల స్థానికతను తీసేసి పరాయి వాళ్లుగా చూడాలని రాజ్యాంగంలో ఉందా?ఖజానాను నింపేందుకు ప్రజలను మద్యానికి బానిసలుగా చేసి పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెట్టాలని రాజ్యాంగంలో ఉందా?

ప్రజలపై మోయలేని విధంగా పన్నుల భారం మోపుతూ ఆ సొమ్ముతో నిజాం నవాబు లాగా జల్సా చేయాలని రాజ్యాంగంలో ఉందా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇవన్నీ లేవు కాబట్టే… ఆ రాజ్యాంగాన్ని తిరగరాయాలనుకుంటున్నవా?

అసలు మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు…. ముఖ్యమంత్రి కేసీఆర్ ను…తిరగరాయాల్సింది రాజ్యాంగాన్ని కాదు…. దళిత, గిరిజన, బలహీనవర్గాల ద్వేషి కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలిపేసి తెలంగాణ చరిత్రను తిరగరాయాలి.తెలంగాణలో జనాలను పట్టి పీడిస్తున్న కేసీఆర్ పాలన పోవాలి… ప్రజాస్వామిక తెలంగాణ రావాలి.

ప్రజాస్వామిక తెలంగాణ రావాలంటే… ‘‘టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణే’’ బీజేపీ లక్ష్యం.. తెలంగాణ ప్రజలంతా కలిసి రావాలని కోరుతున్నా… సీఎం దిగొచ్చి క్షమాపణ చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తాం.సమస్యలు స్రుష్టించి ప్రజలను దారి మళ్లిస్తున్న దుర్మార్గుడు కేసీఆర్.

సెప్టెంబర్ 17 తెలంగాన విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపని నీచుడు కేసీఆర్. తానే అభినవ అంబేద్కర్ అని… తన చరిత్రనే పాఠ్యాంశాల్లో పెట్టాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నరు. కేసీఆర్ అవినీతి భాగోతంపై విచారణ జరుపుతారని భయపడి, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకు సీఎం కుట్ర చేస్తున్నరు.

ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు నూనె బాలరాజు, పార్టీ రాష్ఠ్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి తదితతరులు బండి సంజయ్ తోపాటు పాదయాత్ర చేసిన వారిలో ఉన్నారు.

LEAVE A RESPONSE