– కలెక్టర్ చెప్పారు కదా తన పైన దాడి జరగలేదని?
– జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్
హైదరాబాద్: భూములు పైన ఆధారపడి బ్రతుకున్న ప్రజలు వాళ్ళు. భూములను ఒప్పించి తీసుకోవాల్సిన ప్రభుత్వం వారిని బెదిరించి తీసుకుంటుంది. కలెక్టర్ కూడా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఊరు అవతల మీటింగ్ పెడితే ఎలా అని అక్కడి ప్రజలు అడిగారు. ప్రజలు అడగడమే తప్పు అయిందా? కలెక్టర్ చెప్పారు కదా తన పైన దాడి జరగలేదని? బి ఆర్ ఎస్ పార్టీ కి తెలంగాణతో పేగు బంధం ఉంది.
అక్కడ ఉన్న ప్రజలు తమ హక్కులు కోసం పోరాటం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రజలు కోసం పోరాటం చేస్తుంది. ప్రజలును నయవంచన చేసిన ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితముగా నిలదీస్తుంది. 11నెలలు కాలంలో ఒక్కసారైనా జై తెలంగాణ అని ఉచ్చరించని వ్యక్తి రేవంత్ రెడ్డి. కేసు లకు, అరెస్ట్ లకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇది ఉద్యమ పార్టీ రేవంత్ రెడ్డి.
కేటీఆర్, హరీష్ రావు ఏదో ప్రజా సమస్యలపైన మాట్లాడ్తున్నారు అని అరెస్ట్ చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. అరెస్ట్ చేసిన రైతులను ఎక్కడ ఉంచారో సమాచారం లేదు. అర్ధరాత్రి సమాచారం లేకుండా కరెంటు బంద్ చేస్తావు, ఇంటర్నట్ బంద్ చేస్తావు. అక్కడ ఉన్న ఆడ వాళ్ళను బెదిరించారు ముసలమ్మను కొట్టారు. రజాకార్ల రోజులను రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు మహిళల అందరికీ అండగా బి ఆర్ ఎస్ పార్టీ ఉంటుంది.
కలెక్టర్ నేరుగా చెప్పాడు తన పైన దాడి జరగలేదు అని. రాత్రికి రాత్రి వందలు మంది ఇండ్లలోకి వచ్చి దాడులు చేసారు అని చెప్పుతున్నారు అక్కడి మహిళలు. మహిళలు వారి బాధలు మాకు చెప్పుకొని ఏడ్చారు. కేటీఆర్ని ఈ కేసు లు ఇరికించాలని చూస్తున్నారు. అక్కడ ఏమి జరిగింది ముఖ్యమంత్రికి సమాచారం ఉండదా? ఎవరు ఎవరి చేస్తున్న కుట్ర అని చెప్పలేరా? అన్యాయంగా,అరాచకంగా భూములును లాక్కుంటున్నారు. బిజెపి నాయుకులు ఎందుకు ఖండించలేక పోతున్నారు?