అర్థరాత్రి మహిళల్ని అపహరించి భయభ్రాంతులకు గురిచేయడమేనా జగన్ రెడ్డి రాష్ట్రంలో అమలుచేస్తున్న మహిళారక్షణ?
– పోలీసులు మా విషయంలో వ్యవహరించిన తీరుపై మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ ఏం సమాధానం చెబుతుంది?
• గన్నవరం విధ్వంసకాండ జరిగినప్పుడు మమ్మల్ని అపహరించి, అర్థరాత్రి తీసుకెళ్లి ఎక్కడో నిర్మానుష్యప్రాంతమైన మంగినపల్లి పోలీస్ క్యాంప్ లో పెట్టడం ఏమిటి?
• మాకుసరైన రక్షణకూడా కల్పించకుండా, చిమ్మచీకట్లో అక్కడఉంచిన గన్నవరం సీఐ కనకారావు, స్థానిక డీఎస్పీల తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం
• గన్నవరం పోలీసులు జగన్మోహన్ రెడ్డికి, వల్లభనేని వంశీకి తొత్తులుగా మారి టీడీపీకార్యాలయంపై దగ్గరుండి వైసీపీగూండాలతో దాడిచేయించారు
– తెలుగుమహిళ అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర
గన్నవరం విధ్వంసకాండకు ప్రధానకారకుడు స్థానిక ఎమ్మెల్యే వల్లభనేనీ వంశీనే కారణ మని, కార్యాలయంవద్ద జరుగుతున్న దారుణాల్ని చూడటానికి వెళ్లిన తమను పోలీసులు అడ్డుకున్నారని, టీడీపీనేత దొంతుచిన్నాకారుని వైసీపీకార్యకర్తలు తగలబెడుతుంటే, పోలీ సులు చోద్యంచూశారని, దానిపై ప్రశ్నించామన్న అక్కసుతో అకారణంగా అరెస్ట్ చేశారని, తెలుగు మహిళ అధికారప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమెమాటల్లోనే ..
“ఎక్కడికి తీసుకెళ్తున్నామో చెప్పకుండా పోలీసులు మమ్మల్ని ఊళ్లన్నీ తిప్పుతూ, అర్థరాత్రి మొత్తం కృష్ణాజిల్లా అంతాతిప్పారు. మట్టిరోడ్లపైన చిమ్మచీకట్లో పోలీస్ వ్యాన్ ను తీసుకెళ్లి, రాత్రి 11.30నిమిషాలకు మంగినపూడి పోలీస్ క్యాంప్ కు తీసుకెళ్లారు. ఆ ప్రదేశంలో అర్థరాత్రి ఇద్దరు ఆడవాళ్లను అక్కడ ఉంచిన ఈప్రభుత్వం, మహిళల్ని ఏంచేయాలనుకుంటుందో చెప్పాలి. మమ్మల్ని చట్టవిరుద్ధంగా అరెస్ట్ పేరుతో తీసుకెళ్లి, ఎక్కడోమారుమూల ప్రాంతంలో ఉంచినందుకు గన్నవరం సీఐ కనకారావు, డీఎస్పీ సమాధానం చెప్పాల్సిందే.
మమ్మల్ని ఉంచిన ప్రదేశంలో మాకు రక్షణగా ఒక మహిళాకానిస్టేబుల్, ఒకకానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. ఆరోజు రాత్రి 12.30గంటలకు మా న్యాయవాది వచ్చి పోలీసుల్ని ప్రశ్నించి, మమ్మల్ని అక్కడినుంచి విడిపించకపోయి ఉంటే, ఆరాత్రే మాకుఆఖరి రాత్రి అయ్యేదేమో! ఆనాడు మేం ఉన్నపరిస్థితిలో జగన్ రెడ్డి కుటుంబసభ్యులు ఉంటే ఆయన ఎలాభావించేవాడు? ఆరాత్రి మేం ఏమయ్యమో తెలియక మాకుటుంబసభ్యులు తీవ్రంగా ఆందోళనచెందారు. టీడీపీలో క్రియాశీలకపాత్ర పోషించే మమ్మల్నే అలాచేస్తే, రాష్ట్రంలో సాధారణమహిళల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
పోలీసులు జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తూ, ఆడా మగా అనేతేడా లేకుండా దారుణంగా ప్రవర్తించడం చాలాచాలా బాధాకరం. రాష్ట్ర పోలీసు లు వైసీపీతొత్తులుగా మారి, జగన్ కీచకపాలనలో భాగస్వాములు అయినందుకు నిజంగా వారు సిగ్గుపడాలి. ప్రతిపక్షమహిళల విషయంలో గన్నవరం పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ట్రమహిళాకమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏంసమాధానం చెబుతుంది? గన్నవరం విధ్వంసకాండ జరిగిననాడు మహిళలపై కూడా వైసీపీగూండాలు రాళ్లతో దాడిచేశారు.
పట్టా భితో పాటు అక్కడున్న మండవలక్ష్మి, రమ్య, పొదిలి లలితలకు తీవ్రగాయాలు అయ్యాయి. మహిళలనికూడా చూడకుండా గూండాలతో, పోలీసులతో కొట్టించడమేనా జగన్ రెడ్డి రాష్ట్రం లో అమలుచేస్తున్న మహిళారక్షణ. మాకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పేవరకు ప్రభుత్వాన్ని, మహిళాకమిషన్ ను వదిలిపెట్టేదిలేదు” అని సుచిత్ర హెచ్చరించా రు. విలేకరుల సమావేశంలో సాయికల్యాణి, వినీల పాల్గొన్నారు.