జగన్ రెడ్డి తన రాజకీయం, అధికారం కోసం వేంకటేశ్వరస్వామిని వాడుకున్నాడు

– ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్ ఉందని నానాయాగీ చేసిన జగన్, విజయసాయి.. ఇప్పుడెందుకు నోరెత్తడంలేదు?
• చంద్రబాబుపై నిరాధార ఆరోపణలు చేసినందుకు కోర్టులో పరువునష్టం దావా వేస్తే ఏ1, ఏ2 దాన్నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు
• మా నాయకుడికి, ప్రజలకు బహిరంగక్షమాపణ చెప్పాకే వారు పరువునష్టం దావాకేసులో వేసిన పిటిషన్ వెనక్కు తీసుకోవాలి
యువగళం పాదయాత్ర ప్రదేశంలో (తిరుపతి) టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం

“జగన్మోహన్ రెడ్డి జమానాలో సామాన్యులకు కలియుగదైవం వేంకటేశ్వరస్వామి దర్శనం దుర్లభంగా మారిందని, కుటుంబం మొత్తం ప్రశాంతంగా కన్నులారా స్వామిని దర్శించుకొని, ప్రసాదంకొనాలంటే రూ.20వేలు ఖర్చయ్యే పరిస్థితిని జగన్ అండ్ కో కల్పించారని, స్వామి వారిదర్శనం టికెట్లు, ప్రసాదం అన్నీ పక్కదారిపడుతున్నా, తిరుమలలో అవినీతి పెచ్చుమీరినా ప్రభుత్వంలో చలనంలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామ హేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఆయన యువగళం పాదయాత్ర తిరుపతి క్యాంప్ సైట్లో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

“జగన్మోహన్ రెడ్డి పాలనలో వేంకటేశ్వరస్వామివారి ప్రతిష్ట, పవిత్రతకు తీవ్ర భంగం కలుగు తోంది. పరమపవిత్రమైన వేంకటేశ్వరస్వామిని కూడా జగన్ తన రాజకీయదుష్ప్రచారానికి వాడుకున్నాడు. జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి గతంలో స్వామివారికి చెందిన పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని నోటికొచ్చినట్టు వాగారు. పింక్ డైమండ్ తోపాటు, స్వామివారి నగలు, విలువైనకానుకలన్నీ చంద్రబాబే కొట్టేశాడని సిగ్గు, శరంలేకుండా మాట్లాడారు. ఆనా డు టీ.టీ.డీ బోర్డ్ మెంబర్ గా ఉన్నతాను మాప్రభుత్వం, మానాయకుడిపై చేసిన వ్యాఖ్య లకు, సమాధానంచెప్పాలని ఏ1,ఏ2లపై పరువునష్టం దావాకూడా వేశాము.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేంకటేశ్వరస్వామి పవిత్రత, ఆస్తులు, భూములపై దుష్ప్రచారంచేసిన జగన్ ఇప్పుడు ఏంసమాధానం చెబుతాడు? జగన్, విజయసాయి ఆనాడు చంద్రబాబు ఇంట్లో ఉ న్నాయన్న పింక్ డైమండ్, విలువైనగలు ఎక్కడున్నాయో ఇప్పటికీ ఈప్రభుత్వ ఎందుకు కనిపెట్టలేకపోయింది? ఆ వ్యవహారంపై ఈ ప్రభుత్వం ఎందుకని ఎలాంటి విచారణకు ఆదేశిం చలేదు? పింక్ డైమండ్ వ్యవహారంపై వైసీపీలోని సన్నాసులు, దద్దమ్మమంత్రులు ఎందుకు నోరెత్తడంలేదు? విజయసాయి, జగన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారఆరోపణలు కాబట్టే, తాము వేసిన పరువునష్టం దావా కేసుపై స్పందించకుండా విత్ డ్రా పిటిషన్ వేసి తప్పించు కోవాలని చూస్తున్నారు

జగన్ రెడ్డి తనరాజకీయ అవసరాలు, అధికారంకోసం వేంకటేశ్వ రస్వామిని ఉపయోగించుకున్నాడు అనిచెప్పడానికి ఇంతకంటే రుజువేంకావాలి? వైసీపీ ప్రభుత్వంలో వేంకటేశ్వరస్వామి దర్శనాన్ని భక్తులకు దుర్లభంగామార్చిన తీరుపై, తిరుమ లలో టీటీడీముసుగులో చేస్తున్న దోపిడీపై, ముఖ్యమంత్రి, వై.వీ.సుబ్బారెడ్డి సమాధానం చెప్పాల్సిందే. జగన్ అతనిపార్టీవారు తప్పుఒప్పుకొని చంద్రబాబుకి క్షమాపణచెప్పాకే, కోర్టులో ఉన్న పరువునష్టం దావాపిటిషన్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. భక్తులు వేంకటేశ్వరస్వామికి ఇచ్చే సొమ్ము (టీ.టీ.డీ.సొమ్ము) ని కూడా జగన్ కాజేయాలని చూస్తున్నాడు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దానిపై బిల్లుపెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు.

జగన్ ప్రభుత్వంలో వేంకటేశ్వరస్వామికి దుర్గతిపట్టిందని భక్తులు వాపోతున్నారు. టీ.టీ.డీ నిధుల్నికూడా కైంకర్యంచేయడానికి జగన్ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టంచేయబోతున్నా డని తెలిసి, రాష్ట్రప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అసెంబ్లీలో మెజార్టీ ఉందని, ప్రజ లు, ప్రతిపక్షాలు మమ్మల్ని ఏమీచేయలేమన్న అహంకారంతో జగన్ అండ్ కో టీ.టీ.డీ సొ మ్ముజోలికి వెళ్తే, ఆరోజే ఈప్రభుత్వానికి ఆఖరిరోజు అవుతుంది.

జగన్ రెడ్డి వచ్చాక సామా న్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభంగా మారింది. వై.వీ.సుబ్బారెడ్డి చీటిపాటలు పాడే వాడిమాదిరి గతంలో స్వామివారి దర్శన, సేవాటికెట్లధరలను దగ్గరుండి మరీ పెంచాడు. శ్రీవా ణిదర్శనం టికెట్ల పేరుతో సుబ్బారెడ్డి అండ్ కో భక్తుల్ని నిలువునా దోచుకుంటున్నారు. వసతి గదుల అద్దెలు, ప్రసాదం, తిరుమలలోని దుకాణాలఅద్దెలు, అక్కడి వస్తువులు, భోజనం ధర ల్ని జగన్ ప్రభుత్వం అమాంతం పెంచేసింది. స్వామివారి దర్శనంలో ఎన్నిరకాలున్నాయో.. అన్నీ జగన్ రెడ్డి..వై.వీ.సుబ్బారెడ్డిలకు అక్రమార్జన సేవలుగా మారిపోయాయి అనిచెప్పడాని కి నిజంగా బాధపడుతున్నాం.

తిరుమల కొండపై ఉన్న వసతిసముదాయాల్లోని గదుల్ని బా గుచేస్తున్నామంటూ కిందఉన్నహోటళ్లు, సత్రాల్లోని గదులఅద్దెల్ని నాలుగింతలు ఎక్కువ వ సూలు చేస్తున్నారు. పవిత్రతిరుమలలో కూడా మద్యం, గంజాయి విక్రయాలు చేస్తున్నారు. తిరుపతిలో బార్లు, వైన్ షాపులనుంచి వైసీపీనేతలు కమీషన్లు వసూలుచేస్తూ, విచ్చలవిడి అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. పక్కరాష్ట్రాలనుంచి తీసుకొచ్చిన కల్తీమద్యాన్ని తిరుపతిలో దగ్గరుండి మరీ అధికారపార్టీ వారుఅమ్మిస్తున్నారు. ప్రపంచప్రఖ్యాత తిరుమలక్షేత్రంలో జరిగే అనర్థాలు, దోపి డీలు, దారుణాలపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందే” అని బొండా ఉమా డిమాండ్ చేశారు.

Leave a Reply