Suryaa.co.in

Andhra Pradesh

ఏసీలు పెట్టడానికి జైలు మీ అత్తారిల్లా..?

– డీ హైడ్రేషన్‌ ఏమైనా ప్రాణాంతకమా?
-రాజమండ్రి జైలులో “చంద్రబాబు ప్రాణాలకు ముప్పు” అంటూ టీడీపీ చేస్తున్న
– చంద్రబాబుకు తీవ్ర అనారోగ్యం అంటూ దుష్ప్రచారం
– పరాకాష్టకు టీడీపీ డ్రామాలు-ఎల్లో మీడియా హంగామా
– చంద్రబాబు బరువు తగ్గలేదు-ఒక కేజీ పెరిగారు
– ఇదే విషయాన్ని జైళ్ల శాఖ డీఐజీ స్వయంగా చెప్పారు
– షర్ట్‌ కూడా విప్పని చంద్రబాకు ఉక్కపోతతో స్కిన్‌ ర్యాషెస్
– వైద్యులు అవసరమైన అన్ని ఔషధాలు ఇస్తున్నారు
– చంద్రబాబుకు జైలులో వీలైనన్ని ప్రత్యేక సదుపాయాలు
– ఒక బ్యారెక్‌ను పూర్తిగా ఖాళీ చేయించి ఉంచారు
– రోజంతా వైద్య నిపుణులు అక్కడే అందుబాటులో..
– ఇంటి నుంచి ఆహారం,మంచినీరు అనుమతిస్తున్నారు
– ఎలాగైనా చంద్రబాబును బయటకు తీసుకురావాలి
– హైదరాబాద్‌లో ఫైవ్‌ స్టార్‌ ఆస్పత్రిలో చేర్పించాలన్నదే వారి స్కెచ్
– ఐటీ నోటీసులు కూడా మేమే ఇచ్చామా..? అది ఎవరి పరిధి?
– బీజేపీ ప్రమేయం ఉందని టీడీపీ వెబ్ సైట్ లో రాసుకున్నది మీరా? మేమా?
– ఇన్నర్‌ రిండ్‌ రోడ్‌లో హెరిటేజ్‌ కొన్న 10 ఎకరాల్లో పోయింది 25సెంట్లే
– ఏ కంపెనీ అయినా పొలాల మధ్య భూమి కొంటుందా?
– ముందుగానే భూమి కొని అలైన్‌మెంట్‌ మార్చారు
– అది పక్కా స్కెచ్‌తో చేసిన ఒక భారీ స్కామ్‌
– వైయస్సార్‌సీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

డీహైడ్రేషన్ ప్రాణాంతకమా?:
గత రెండు, మూడు రోజులగా కొత్త డ్రామాకు తెలుగుదేశం పార్టీ నాయకులు తెర లేపారు. ఈరోజు దాన్ని మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబునాయుడు ఆరోగ్యం విషమించిందని, ఎల్లో మీడియాలో అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు.

ముందుగా చంద్రబాబుకు డీహైడ్రేషన్‌ వచ్చిందని నిన్న మొదలు పెట్టారు. ఈరోజు దానికి పరాకాష్టగా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. జైలులో తన తండ్రికి స్టెరాయిడ్స్‌ ఇచ్చి, చంపే ప్రయత్నం చేస్తున్నారని లోకేష్‌ ట్వీట్‌ చేశాడు. చంద్రబాబును దోమలు కుడుతున్నాయని, ఆయనకు స్కిన్‌ ఎలర్జీ వచ్చిందని, ఆయన డీహైడ్రేషన్‌తో బాధ పడుతున్నారని అన్నారు. మరి ఇందులో ఏది ప్రాణాంతకం?

పక్కా ఆధారాలతోనే అరెస్టు:
లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి.. అందరిదీ ఒకే మాట. చంద్రబాబు జైలుకు వెళ్లక ముందు చాలా యాక్టివ్‌గా ఉన్నారని, ఆయన ఒక యువకుడిలా ఉన్నారని అన్నారు. జైలుకు వెళ్లిన తర్వాత కూడా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఇప్పుడు మాట మార్చారు. ఆయన ప్రాణాలకు హాని ఉందని ఆరోపిస్తున్నారు.

ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు, ఎవరినైనా రిమాండ్‌ ఖైదీగా ఉంచుతారు. ఆయన చేసింది తప్పు. ఆధారాలతో సహా ధృవీకరించుకున్న తర్వాతే కోర్టు ఆయనను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించారు. ఎవరైనా చేసిన దానికి సిగ్గు పడి, ఇబ్బంది పడడమో లేక.. తప్పు చేయలేదని రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తారు.

కానీ, ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. అరెస్టు చేసిన పోలీసుల మీద, జైలు అధికారుల మీద, తోటి ఖైదీల మీద.. చివరగా ప్రభుత్వం, సీఎంపైనా నిందలు వేస్తున్నారు. ఏం ప్రూవ్‌ చేయాలో టీడీపీ వారికి అర్ధం కాక, ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారు.

బాబు ఒక కేజీ పెరిగారు:
చంద్రబాబు భార్య చెప్పినట్లు ఆయన 5 కేజీల బరువు తగ్గలేదు. ఆయన ఒక కేజీ బరువు పెరిగారు. ఈరోజు జైళ్ల శాఖ డీఐజీ ఆ విషయం చెప్పారు. దాన్ని కూడా వారు తప్పు పడతారేమో?

అదేమైనా మీ అత్తారిల్లా?:
అసలు చంద్రబాబు తప్పు చేశాడా? లేదా? తప్పు చేయలేదనుకుంటే, దాని మీద వాదించాలి? ఆధారాలు చూపమని అడగాలి. లేదా కోర్టులో వాదించాలి.

రిమాండ్‌లో జైలులో ఉంటే.. అదేమైనా అత్తగారి ఇల్లా? జైలులో ఏసీలు పెట్టాలా? చంద్రబాబు కంటే ఎక్కువ వయసున్న లాలూ ప్రసాద్‌ యాదవ్, ఓం ప్రకాశ్‌ చౌతాలా కూడా జైల్లో ఉన్నారు. ఎల్లో మీడియా చాలా దారుణంగా అసత్యాలు ప్రచారం చేస్తోంది.

వారికేమైనా ప్రత్యేక హక్కులున్నాయా?:
దేశంలో ఎక్కడా జైలులో ఏసీలు ఉండవు. ప్రపంచంలో ఎక్కడా లేని ఏకైక హక్కు.. ఒక్క చంద్రబాబునాయుడుకు, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉంటాయా?

ఏమిటా దుష్ప్రచారం? నిజానికి సాక్షి ఛానల్‌ లేకపోతే.. ఈనాడు, జ్యోతిని చూస్తే.. చంద్రబాబు మరణశయ్య మీద ఉన్నారని అనుకునేలా దుష్ప్రచారం చేసేవారు. అసలు వీరు రాజకీయ నాయకులేనా? ఏ మాత్రం బాధ్యత అనేది ఉండదా?

ఇదంతా చూస్తుంటే ఒక స్టడీ మెటేరియల్‌లా ఉంది. టీడీపీకి ప్రపంచంలో ఎవరికీ లేని హక్కులు ఉంటాయా?. వారికి బాధ్యతలు మాత్రం ఉండవు. నిన్న లోకేశ్‌ అదే అన్నాడు. తమకు పక్క రాష్ట్రంలో కూడా బలం ఉంది. వారిని పోషించడం, వారి పైత్యాన్ని భరించడం, ఉమ్మితే తుడవడం.. ఇదంతా సమాజం బాధ్యతనా?

చంద్రబాబు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. జైల్లో చాలా మంది ఖైదీలు ఉంటారు. మరి చంద్రబాబుకు మాత్రం ప్రత్యేక వసతులు ఎందుకు? మిగిలిన ఖైదీలకు వేరే వసతులు ఉన్నాయా? అక్కడ ఉక్కపోత ఉంటే, మిగతావారూ ఇబ్బంది పడతారు కదా?

బకెట్లతో నీళ్ళు పంపించాలా?:
ఉన్నంతలో చంద్రబాబుకు వీలైనంత వరకు అన్ని వసతులు కల్పించారు. మొత్తం బ్యారక్‌ ఖాళీ చేయించారు. కోర్టు చెప్పకపోయినా ఆ పని చేశారు. రోజంతా డాక్టర్లను అందుబాటులో ఉంచారు. ఇంటి నుంచి భోజనానికి, మంచినీటికి అనుమతి ఇచ్చారు.

కానీ, చంద్రబాబు భార్య అంటున్నారు. జైలులో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ శుభ్రంగా లేదని, ఆయన స్నానానికి మంచినీరు లేవని అంటున్నారు. మరి ఆయన స్నానం కోసం బకెట్లతో నీరు పంపించాలా? ఏమన్నా సిగ్గుందా? ఏమిటా మాటలు?

అదే వారి ఆలోచన:
చంద్రబాబును ఎలాగైనా జైలు నుంచి బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత ఆయనకు రాష్ట్రంలో భద్రత లేదంటారు. హైదరాబాద్‌కు తీసుకెళ్తామంటారు. అక్కడ ఫైవ్‌స్టార్‌ ఆస్పత్రిలో ఉంచాలి అంటారు. అదే వారి ఆలోచన. అందుకే హౌజ్‌ అరెస్టులో ఉంచాలని ముందుగానే అడిగారు..

నిజానికి చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు. అంటే అది కూడా ఒక విధంగా శిక్షే. అక్కడా డిగ్నిటీగా ఉండొచ్చు. రాజకీయ వ్యూహాలూ చేయొచ్చు. కానీ, అందుకు భిన్నంగా, తనకు దేశం, విదేశాల్లో తన అరెస్టుతో సానుభూతి రావాలని, ఎలాగైనా బీజేపీని ప్రసన్నం చేసుకుని బయట పడాలన్న ఆలోచన తప్ప.. జైల్లో సౌకర్యాలు కావాలని పోరాటం. ఒకవైపు బింకంగా మాట్లాడడం.. తాను యంగ్‌ అని చెప్పడం. మరోవైపు ఆయన వయస్సు 73 ఏళ్లు అని, ఆయన జైల్లో అనారోగ్యం పాలయ్యారని, పరిస్థితి తీవ్రంగా ఉందని ప్రచారం చేయడం. ఏమిటిది?

షర్ట్ విప్పకపోతే.. స్కిన్ ర్యాషెస్ రావా..?:
చంద్రబాబు ఒక రిమాండ్‌ ఖైదీ. ఆయనను ఇతర ఖైదీల మాదిరిగా చూడకుండా.. వీలైనన్ని సౌకర్యాలు కల్పించారు. ఇంకా ఏమైనా అంటే.. కార్వాన్‌లు పంపించి, ఏసీలు పెట్టించాలా? మరి అవన్నీ చేస్తే జైల్లో ఉండడం ఎందుకు? బయటే ఉండొచ్చు కదా?

చంద్రబాబు షర్ట్‌ అస్సలు విప్పడు. దాని వల్ల చెమటతో స్కిన్‌ డిసీజ్‌ వచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ జైలు అధికారులు.. వైద్యులను రప్పించారు. అన్ని పరీక్షలు చేయించారు. సరైన మందులు ఇప్పిస్తున్నారు.
చర్మానికి వచ్చిన ర్యాష్‌ ప్రాణాంతకం కాదు. దీనిపై న్యూట్రల్‌ మీడియా ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ఢిల్లీలో లోకేశ్‌ డ్రామా:
ఇక ఢిల్లీలో లోకేశ్‌ మరో డ్రామా చేస్తున్నారు. మొన్న ఢిల్లీలో హోం మంత్రితో కలిసి, లోపల ఏం మాట్లాడారో. కానీ బయటకు వచ్చి ఏం చెప్పారు? నిన్న చిట్‌చాట్‌ పేరుతో లోకేశ్‌ చెప్పాడంటూ.. ఎల్లో మీడియాలో వచ్చింది చూస్తే.. నవ్వాలో, ఏడవాలో అర్ధం కాలేదు. తమకు కేంద్ర హోం మంత్రి నుంచే పిలుపు వచ్చిందట. అందుకే వెళ్లాడంట. నిజం వైపు ఉండమని కోరామని చెప్పాడట.

తాము చంద్రబాబు అరెస్టు వెనక లేమన్న విషయాన్ని స్పష్టం చేయడం కోసం.. అమిత్‌షానే లోకేశ్‌ను పిలిపించుకున్నాడు.. అన్నట్లుగా వారు చెబుతున్నారు. అదే ఎల్లో మీడియా రాసింది. నిజానికి అమిత్‌షా అలా భావిస్తే.. ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చేవాడు. కానీ ఇక్కడ రివర్స్‌గా జరిగింది.

రెండోది చంద్రబాబు ఆరోగ్యాన్ని ఆరా తీశాడట. లోకేశ్‌ మీద కేసుల గురించి తెలుసుకున్నాడట. ఇంకా ఆ కేసులు ఏయే కోర్టుల్లో ఉన్నాయన్న విషయాన్ని కూడా అమిత్‌షా ఆరా తీశాడట. ఇంత చేస్తే, తాను హోం మంత్రిని కలిసింది 15 నిమిషాలే. ఉన్నంతసేపు కేసుల గురించే మాట్లాడారంట.

లోకేశ్, మరో మాట కూడా చెప్పాడు. ఈ భేటీ వల్ల రెండు పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోయినట్లు భావిస్తున్నాడట. ఇవన్నీ అమిత్‌షాకు తెలియదు. కాబట్టి ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. ఒక ఫోటో రిలీజ్‌ చేశారు టీడీపీ నాయకులు. దాంట్లో అమిత్‌షా హుందాగా కూర్చుని ఉన్నారు. అలా కాకుండా వేరే ఫోజ్‌లో ఉంటే, టీడీపీ మరో విధంగా ప్రచారం చేసుకునేది.

మాకు అర్ధం కాని విషయం ఒకటే. మేము ఎవరమైనా అన్నామా? బీజేపీ గురించి మాట్లాడామా? అసలు ఈ కేసులో పార్టీల ప్రస్తావన ఎందుకు వస్తుంది.

బాబు అవినీతిపై అన్ని ఆధారాలు:
ఒక ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ దర్యాప్తు చేసి, ఆధారాలు సంపాదించిన తర్వాత కోర్టు ముందు పెడితే.. వారు అన్నీ చూసి, రిమాండ్‌కు పంపారు. చంద్రబాబు ఆరోజు సీఎంగా ఉన్నారు. తానే కీలక నిర్ణయం తీసుకుని, స్వయంగా 13 సంతకాలు చేశారు. ఒప్పందానికి, జీఓకు తేడా ఉంది. ఎదుటి పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా రాకముందే.. ప్రభుత్వం తన వాటా మొత్తం విడుదల చేసింది. ఆ మొత్తం షెల్‌ కంపెనీలకు వెళ్లిపోయింది. దీనిపై అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే.. చంద్రబాబును అరెస్టు చేశారు. నిజానికి దీనికి లీడ్, చంద్రబాబు హయాంలోనే జీఎస్టీ అధికారులు చెబితే.. దాన్ని అప్పటి ప్రభుత్వం నొక్కి పెట్టింది.

మా ప్రభుత్వం 2019లో ఏర్పడినా, మేము దాన్ని చూడలేదు. కానీ ఆ తర్వాత సీఐడీ దర్యాప్తు మొదలు పెట్టి.. చివరకు ఈ కేసులో అరెస్టులు కూడా చేయడంతో.. మొత్తం స్కామ్‌ బయట పడింది. ఇక మరో కేసు. ఎల్‌ అండ్‌ టీ, షాపూర్జీ పల్లోంజీ కంపెనీలకు కాంట్రాక్ట్‌ పనులు ఇచ్చి, కమిషన్లు పొందారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ ఆ మొత్తం తీసుకున్నాడు. అవన్నీ బయట పడ్డాయి. ఆయనకు నోటీస్‌ ఇవ్వగానే, అమెరికా పారిపోయాడు.

అవి ఎవరి పరిధిలో ఉన్నాయి?:
రూ.118 కోట్లకు సంబంధించి ఐటీ నోటీసులు కూడా ఇచ్చింది. అక్కడ కేసు దర్యాప్తు చేసిన ఏజెన్సీలు ఏ ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం కిందనా? రాష్ట్ర ప్రభుత్వం కిందనా? ఐటీ, జీఎస్టీ, ఈడీ ఎవరి పరిధిలో ఉన్నాయి. కేంద్రం పరిధిలో కదా? మరి మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు? ఈ అక్రమాలన్నీ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే బయట పడ్డాయి. కేంద్ర ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. చర్యలకు ఉపక్రమించాయి.

బీజేపీ ప్రమేయం ఉందని రాసిందెవరు?:
అదే విషయాన్ని మేము చెప్పాం. అంతే కానీ, దీని వెనక బీజేపీ ఉందని ఎవరన్నారు? నిజానికి కేంద్ర ప్రభుత్వ అండతోనే చంద్రబాబును అరెస్టు చేశారని, చంద్రబాబు అన్నారని సెప్టెంబరు 12న మీ అధికారిక పత్రిక చైతన్యరథంలో రాశారు. ఇదే విషయాన్ని మీ బీ–టీమ్‌ నాయకుడు నారాయణ (సీపీఐ) అన్నాడు. అఖిలేశ్‌యాదవ్‌ అన్నారని కూడా మీరే చెప్పారు. మళ్లీ ఈరోజు మీరే అంటున్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ లేదని అనుకుంటున్నామని మీరే అంటున్నారు.

ఇక్కడ ప్రజలు ఒకటే అర్ధం చేసుకోవాలి. మాకు ఇలా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు తప్పు చేశాడు. ఆధారాలతో సహా దొరికిపోయి, అరెస్టు అయ్యాడు. దాంట్లో మా ప్రభుత్వ ప్రమేయం ఏముంటుంది? మళ్లీ ఇప్పుడు బీజేపీ ప్రమేయం లేదని అంటున్నారు. ఇవన్నీ కూడా అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించడం కోసమే. చంద్రబాబు దోషిత్వం నుంచి ప్రజల దృష్ఠి మళ్లించడం కోసమే.

గతి తప్పుతున్న లాయర్లు:
ఇంకా మీ బరితెగింపునకు మరో అడుగు. కోర్టులో దూకడం. పూనకం వచ్చినట్లు ఊగిపోవడం. తోటి లాయర్లపై దాడికి ప్రయత్నించడం. ఆధారాలతో సహా దొరికిపోయిన నేరస్తుడిని, బయటకు తీసుకు రావాలని.. చంద్రబాబును అరెస్టు చేసిన వారినే లోపల వేయాలన్న ఆరాటం వారిలో కనిపిస్తోంది. ఇంత దారుణమా?.

ఐఆర్ఆర్ లో హెరిటేజ్ కొన్న 10 ఎకరాల్లో పోయింది 25 సెంట్లే..:
సీఐడీ దర్యాప్తుపై లోకేశ్‌ కూడా రోజుకో మాట చెబుతున్నాడు. వారి దర్యాప్తును అవహేళన చేసి మాట్లాడాడు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌లో తమ భూములు (హెరిటేజ్‌) పోయాయని, అలాంటప్పుడు స్కామ్‌ ఎక్కడిదని లోకేశ్‌ అంటున్నాడు. నిజానికి హెరిటేజ్‌ కంపెనీ అక్కడ 10 ఎకరాల భూమి కొంటే.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌లో పోయిన భూమి కేవలం 25 సెంట్లు మాత్రమే.. అంటూ మ్యాప్‌ తో సహా వివరించిన సజ్జల రామకృష్ణారెడ్డి.

అంటే మిగిలిన 9 ఎకరాలకు పైగా భూమి.. ఆ రింగ్‌ రోడ్‌ పక్కనే ఉంది. దానివల్ల మేలు ఎవరికి. ఇంత సిగ్గులేని మాటలు ఏమిటి? ఇంత అబద్ధాలు చెప్పాలా? ఎప్పుడైనా వాస్తవాలు ఆధారంగా మాట్లాడాలి. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఎలా? ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌కు తొమ్మిదిన్నర ఎకరాల భూమి ఉంటే.. రోడ్‌లో తమ భూమి పోయిందని అంత పచ్చిగా అబద్ధం ఆడితే ఎలా?

ఇంతకన్నా ఏ ఆధారాలు కావాలి?:
మాది ఒకటే ప్రశ్న.. ఏ కంపెనీ అయినా.. ఎక్కౖడైనా పెద్ద ఎత్తున భూమి కొనాలంటే.. ఏ రోడ్‌ వెంట అయినా తీసుకుంటారా? లేక ఎక్కడో పొలాల మధ్య లోపల తీసుకుంటారా? అది కూడా హెరిటేజ్‌ వంటి కంపెనీ.. ఎక్కడో పొలాల మధ్య.. దాదాపు 10 ఎకరాల భూమి కొంటారా?

అంటే.. అక్కడ రింగ్‌ రోడ్‌ వస్తుందని వారికి ముందే తెలుసినట్టు కదా? వారి భూమి కేవలం 25 సెంట్లు మాత్రమే పోయింది. నిజానికి అంతకు ముందున్న అలైన్‌మెంట్‌ అక్కడికి దూరంగా ఉంది. కానీ మీరు అక్కడ భూములు కొని, రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్చారు. దీన్ని ప్రజలు గమనించాలి.

ఎందుకు ఇంతగా చెబుతున్నామంటే.. ఇన్నర్‌ రింగ్‌ అనేది ఒక స్కామ్‌. రోడ్‌ లేనప్పుడు స్కామ్‌ ఏమిటి అంటున్నారు. రాజధాని లేకున్నా, మీరు అక్రమాలు చేయలేదా? ఇది కొత్త క్రియేషన్‌. కొత్తగా ప్రాజెక్టు చేపట్టి.. ఇలా ఫ్రాడ్‌ చేయొచ్చని మీరు చూపారు. మీరు ఇంకొద్ది కాలం ఉంటే, రోడ్‌ కూడా వేసుకునే వారు. మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి.. స్కామ్‌ బయట పడింది.

అలాగే ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు. అందులోనూ మొత్తం ఫ్రాడ్‌. చంద్రబాబు వీటన్నింటిలో అడ్డంగా దొరికిపోయాడు. తనకు ఎదురు లేదన్న గర్వంతో చేసిన అక్రమ పనుల వల్ల ఇప్పుడు దొరికిపోయాడు. ఒకవేళ మీరు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే, కోర్టుల్లో పోరాడొచ్చు కదా? కానీ అందుకు భిన్నంగా జైల్లో ఏదేదో జరిగి పోతోందని డ్రామాలు హంగామా ఎందుకు? అమిత్‌షా స్వయంగా పిల్చారని చెప్పడం ఎందుకు?

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..

బాబు ఆహారంలో ఏమందో?:
చంద్రబాబుకు అనారోగ్యం కలిగితే.. ఆది ఆయన ఆహారం వల్లనే రావాలి. ఆయనకు ఫుడ్‌ ఏమిస్తున్నారో వారికే తెలియాలి. స్టెరాయిడ్స్‌ ఎందుకు ఇస్తారు? జైల్లో ఆయనకు వీలైనన్ని సదుపాయాలు కల్పించాం.

సీఎం మాటల్లో తప్పేముంది?:
నిన్న సీఎంగారు ప్రస్తావించిన అంశాల్లో అవాస్తవాలు ఏమైనా ఉన్నాయా? సత్యదూర విషయాలు ఉన్నాయా? ప్రజా జీవితంలో ఉన్న వారు ఆదర్శంగా ఉండాలి. సమాజానికి రోల్‌ మోడల్‌గా ఉండాలి అనుకుంటారు. ఎందుకంటే, వారు ప్రజల్లో ఉంటారు కాబట్టి, రోల్‌ మోడల్‌గా ఉండాలని అందరూ అనుకుంటారు.

కానీ, ఆ స్టేజ్‌ దాటిపోయి.. సమాజానికి హితబోధ చేస్తుంటే ఎలా? అసలు నీ జీవితం ఏమిటి? అని అడుగుతారు. విభేదాలు వస్తే విడిపోతారు. అందులో తప్పు లేదు. మరి పవన్‌కళ్యాణ్‌కు వరసగా మూడు పెళ్ళిళ్లు ఏమిటి? ప్రజలకు ఆయన సందేశాలు ఇస్తున్నప్పడు.. ఆయన వ్యక్తిగత జీవితమే బాగు లేదు కదా? దాన్నే సీఎం ప్రస్తావిస్తున్నారు.

అంతేకాకుండా, పవన్‌కళ్యాణ్‌ ఒకరితో ఉంటూనే.. మరొకరితో సంతానాన్ని కన్నారు. అది తప్పు కాదా? అందుకే ఆయన సంజాయిషీ ఇవ్వాలి. లేదా నోరు మూసుకుని కూర్చోవాలి.

ఎవరికైనా ఇక్కడ ఇల్లు ఉందా?:
నిన్న సీఎం మరో మాట చెప్పారు. ఇక్కడ రాజకీయాలు చేస్తున్న నాయకులు ఎవరికైనా ఇక్కడ ఇల్లుందా? వారు ఇక్కడ ఉండి ఎందుకు రాజకీయాలు చేయడం లేదు? వారికి కనీసం ఆ బాధ్యత లేదా?

ప్రజలపై అభిమానం, రాష్ట్రంపై ప్రేమ ఉన్న జగన్‌ ఇక్కడికి రావడానికి ముందే ఇల్లు కట్టుకున్నారు. అదే చంద్రబాబు, సీఎంగా ఉన్నప్పుడే.. హైదరాబాద్‌లో ప్యాలెస్‌ కట్టుకున్నాడు. అదేనా బాధ్యత? అంటే ఇక్కడ దోచుకోవడం. అక్కడికి తరలించుకుపోవడం. అదే వారి ఉద్దేశం. అది స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక్కడ అక్రమ కట్టడం (కరకట్ట)లో ఉంటూ.. హైదరాబాద్‌లో ప్యాలెస్‌ కట్టుకున్నాడు చంద్రబాబు. పవన్‌కళ్యాణ్‌ కూడా రెండు వారాలకు ఒకసారి వచ్చి, రాజకీయాలు చేస్తున్నాడు. పవన్‌ తమకు అన్యాయం చేశాడని, ఆయన భార్య స్వయంగా చెప్పారు. విశాఖలో క్యాంప్‌ ఆఫీస్‌కు అవసరమైన ఏర్పాట్ల కోసం కమిటీ మాత్రమే వేశారు. ఆ కమిటీ సూచనల మేరకే వెళ్లడం జరుగుతుంది.

LEAVE A RESPONSE