రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.. తాజగా మరో సారి ముందస్తు ఎన్నికలపై చర్చకు తెరలేచింది. ఇందుకు కారణం లేకపోలేదు…బిజెపి జాతీయ నాయకత్వం తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేయడం.. అందుకు రోజుకో కేంద్ర మంత్రి తెలంగాణలో పర్యటించడం.. నడ్డా అమిత్ షా లు తరచూ వచ్చి పోవడం… పైగా కెసిఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం అవినీతి పరుడు అంటూ పరోక్షంగా కెసిఆర్ పై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తామనే సంకేతాలు కూడా ఇస్తున్నారు.. కెసిఆర్ కెటిఆర్ లకు సన్నిహితంగా వుండే వ్యాపార వర్గాల పై తరచూ ఐటి దాడులు చేస్తున్నారు.. వీరు కెసిఆర్ కెటిఆర్ భినామిలు అంటూ మీడియా కు లీకులు కూడా ఇస్తున్నారు.
స్వయంగా ప్రధాని మోడి హోమ్ మంత్రి అమిత్ షాలు కూడ కెసిఆర్ అవినీతి పరుడు కాళేశ్వరం అయనకు ఎటిఎం లా ఉపయోగపడుతుంది అంటూ బహిరంగ సభలలో మాట్లాడుతున్నారు… ఈ పరిణామాల నేపథ్యంలోనే కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లలనే ఆలోచనలు చేస్తున్నాడు అని తెలుస్తుంది… తెలంగాణ లో అధికారంలోకి రావాలనే బిజెపి వ్యూహంలో భాగంగానే రాజగోపాల్ రెడ్డిని చేర్చుకొని ఆయనతో శాసన సభ్యత్వానికి రాజీనామా చేయించి మునుగోడు ఉప ఎన్నికను స్పుస్టించింది..ఈ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా లేదు కనీసం రెండో స్ధానంలో ఉన్నా 2023 లో అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వస్తుంది అనే నమ్మకాన్ని కలిగించవచ్చు అన్నది బిజెపి అగ్ర నాయకత్వం అలోచన..తద్వారా పార్టీలొ జాయినింగ్స్ పెంచుకొవచ్చు. రాష్ట్రంలో పూర్తి స్థాయి పట్టు సంపాదించవచ్చు అనే వ్యూహంతో బిజెపి అగ్ర నాయకత్వం ఉంది.. ఒక వైపు దర్యాప్తు సంస్థలను ప్రయోగించాలానే ఆలోచన చేస్తూ మరో వైపు మునుగోడు ఉప ఎన్నిక స్పృష్టించడం ద్వారా ద్విముఖ వ్యూహంతో బిజెపి ముందుకు పోతోంది.. దీనిని గమనించిన కెసిఆర్ బిజెపి ఎత్తుకి పై ఎత్తు వేసినట్లు కనపడుతుంది.. అందుకు ముందస్తు ఎన్నికకు వెళ్ళడం ద్వారా బిజెపి వ్యూహాన్ని తిప్పికొట్టాలని అలోచన చేస్తున్నట్లు కనపడుతుంది..
కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి బిజెపి మంచి అవకాశం కలిపించింది..మునుగోడు ఉప ఎన్నిక తెచ్చి బిజెపి తప్పు చేసింది.. కెసిఆర్ ఈ ఉప ఎన్నికను అడ్డం పెట్టుకొని ముందస్తు ఎన్నికకు వెళతాడు అనిపిస్తుంది.. ప్రజలు నా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు.. ప్రజలు trs ను ఓడించడానికి సిద్దంగా ఉన్నారు అని అంటున్నారు గా ఇప్పుడో ఎన్నిక మరో ఎనిమిది తొమ్మిది నెలలకు సాధారణ ఎన్నికలు ఎందుకు ప్రజలు మమ్మల్ని ఓడించడానికి సిద్దంగా ఉన్నారుగా ఛలో ఇప్పుడే నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తాను.. ప్రజలు మీకు పట్టం కడతారో! నాకు పట్టం కడతారో! తేల్చుకుందాం అంటాడు.. అప్పుడు బిజెపి నాయకత్వం ఏమంటుంది..ఒక్క మునుగోడు లోనే ఎందుకు రాష్ట్రంలో తేల్చుకుందాం.. రండి… అని కెసిఆర్ సవాల్ విసిరే అవకాశం వుంది.మీ శక్తి ఏమిటో నా శక్తి ఎమిటో తేలుతుంది.. అధికార దాహంతోనేగా మీరు మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారు.. పైగా మునుగోడులో బిజెపి గెలిస్తే కెసిఆర్ ప్రభుత్వం పడిపోతుంది అని అంటున్నారు..ఇంకో ఏడాది లోపు సాధారణ ఎన్నికలు ఉండగా ఇప్పుడు మునుగోడుకు ఎన్నిక ఎందుకు తెచ్చినట్లో చెప్పాలి అని బిజెపి నాయకత్వాన్ని ప్రశ్నిస్తాడు.
ప్రజలారా..బిజెపి ఇప్పుడు అనవసరంగా ఉప ఎన్నిక తెచ్చింది.. అందుకే నా ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటాను .కేంద్రంలో ఉన్నది బిజెపి ప్రభుత్వమేగా ఎన్నికల అధికారులతో మోడి అమిత్ షా లతో మాట్లాడుకొని త్వరగా ఎన్నికలు పెట్టించి మీరు అధికారంలోకి రండి అని బిజెపి నాయకులకు చెబుతున్నా.. అధికారం కోసం ఢిల్లీ నుంచి రోజుకో మంత్రి వచ్చి వెళుతున్నాడు.. అమిత్ షా నడ్డా లు ఇక్కడే అడ్డా పెట్టారు.. తెలంగాణ లో ఎప్పుడెప్పుడు అధికారంలోకి వద్దామా అని బిజెపి వాళ్ళు ఉవిళ్లు ఊరుతున్నారు.. వారి పార్టీ అధ్యక్షుడు ఏడాది నుంచి పాదయాత్ర చేస్తున్నాడు.. ఇక్కడే వారి జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకున్నారు.. పెరేడ్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ పెట్టుకొని మోడి తెచ్చుకున్నారు.. అందుకే వారి ఉబలాటం సంగతి ఏమిటో తేలిపోతే మనం రాష్ట్రాన్ని మనం అభివృద్ది చేసుకోవచ్చు ఆని చెబుతాడు.. కేంద్రం ప్రభుత్వం నిత్యం యాగీ చేస్తూ ప్రతిదీ రాజకీయం చేస్తూ అభివృద్దికి అడ్డుపడుతుంది. అందుకే.. ఇంకో ఏడాది కాలం పాటు నాకు అధికారం ఉన్నా నా ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటున్నా.. అని జనానికి చెబుతాడు.. మీరే వీరి కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాలి అని పిలువు ఇస్తాడు… ఎవరి శక్తి ఏమిటో మీరే తేల్చాలి అని ప్రజలను కెసిఆర్ కోరతాడు అనిపిస్తుంది.. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. దుబ్బాక హుజూరాబాద్ నాగార్జున సాగర్ ఇలా అనేక ఎన్నికలు జరగడంతో పాటు ఇప్పుడు మునుగోడు ఎన్నిక రావడంతో పాటు అన్ని పార్టీలు సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని హడావిడి చేస్తున్నాయి.. ప్రజా సమస్యలపైన కెసిఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా విపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించ లేకపోయారు. పాద యాత్రలు రాజకీయ బహిరంగ సభలు నిర్వహించారే తప్ప పెద్దగా ఆందోళనలు చేయలేదు. కాబట్టి కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా ప్రజలలో వ్యతిరేకత వచ్చే అవకాశం కనపడటం లేదు..
ముందస్తు ఎన్నికలకు పోవడం ద్వారా అటు బిజెపి దూకుడుకి కళ్లెం వేయడంతో పాటు దర్యాప్తు సంస్థలను ప్రయోగించి తనను ఇబ్బంది పెట్టాలనుకుంటున్న బిజెపి అగ్ర నాయకత్వం వ్యూహానికి చెక్ పెడతాడు అనిపిస్తుంది. గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్.. కర్ణాటక రాష్ట్రాల తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తే బిజెపి అగ్ర నాయకత్వం ఒక్క తెలంగాణ పైననే కేంద్రీకరించ లేదు.. మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై కూడా దృష్టి సారిస్తుంది.. ఆ రాష్ట్రాలలోని అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలి. తెలంగాణలో అధికారంలోకి రావడానికీ కష్ట పడాలి.. అలా కాకుండా ఒక్క తెలంగాణలో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటే బిజెపి అగ్ర నాయకత్వం మిడతలు దండులా తెలంగాణ పై పడతాయి. బిజెపి మరో వ్యూహాన్ని కూడా రచించింది అని కూడా తెలుస్తుంది.. దానిని కెసిఆర్ గ్రహించాడు అని సమాచరం.
అది ఏమిటీ అంటే! అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వస్తే పార్లమెంటు ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కేవలం మూడు నాలుగు నెలల గ్యాప్ మాత్రమే ఉంటుంది.. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కుడా పార్లమెంటు ఎన్నికలతో కలిపి జరిపేలా ఎన్నికల సంఘం పై వత్తిడి తేవాలని. బిజెపి అగ్ర నాయకత్వం అలోచనను కెసిఆర్ పసిగట్టాడు అని సమాచారం.. అందుకే వారి వ్యూహాన్ని తిప్పి కొట్టాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి అని కెసిఆర్ భావించాడు అని తెరాస వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్క దెబ్బకు అన్ని పిట్టలు పడాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లక తప్పదు అని కెసిఆర్ ఆలోచనగా ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.. దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ఇబ్బంది పెట్టాలనే బిజెపి వ్యూహంతో పాటు తెలంగాణ అసెంబ్లీ కి ప్రత్యేకంగా ఎన్నిక జరిగితే మిడతలు దండులా దాడి చెయ్యవచ్చు అని భావిస్తున్న బిజెపి అగ్ర నాయకత్వం ఆలోచనలను తిప్పి కొట్టేలా గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్.. కర్ణాటక రాష్ట్రాల తో పాటు తెలంగాణ కు కూడా ఎన్నికలు తేవాలని కెసిఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.. అంతే కాదు మునుగోడు ఉప ఎన్నికల ఫలితం పై ఆశ పెట్టుకున్న బిజెపి కేంద్ర నాయకత్వం ఆశలపై కూడా నీళ్ళు చల్లాలంటే కూడా ముందస్తు ఎన్నిక తేక తప్పదు అని కెసిఆర్ అలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికి ఉమ్మడి నల్లగొండ ఖమ్మం వరంగల్ జిల్లాలలో బిజెపి కి నాయకత్వ కొరత ఉంది.. అంతే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు లేరు.. ఇలాంటి పరిస్థితులలో ముందస్తు ఎన్నికకు పోవడం ద్వార బిజెపి ని ఇరుకున పెట్టవచ్చు అనే వ్యూహంతో కెసిఆర్ ఉన్నాడు అని అంటున్నారు ఆ పార్టీ నాయకులు.. ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ద్వారా అనేక అంశాలలో బిజెపి వ్యూహన్ని తిప్పి కొట్టవచ్చు అని కెసిఆర్ అలోచన అని తెలుస్తుంది.. అయితే ముందస్తు ఎన్నిక ద్వారా ఒక్క ఇబ్బంది ఉండవచ్చు అని కెసిఆర్ తన పార్టీ నాయకులతో అన్నాడని తెలుస్తుంది.. ఆపదర్మ ముఖ్యమంత్రి బాధ్యతలు ఇవ్వక పోవచ్చు .ప్రభుత్వ యంత్రాంగం గవర్నర్ చేతిలోకి వెళుతుంది.. దాని వలన మనకు కొంత ఇబ్బంది ఉండవచ్చు అన్నాడని అంటున్నారు. దాని కోసం మనం భయపడాల్సిన అవసరం లేదు అని కూడా అన్నాడు ఆని అంటున్నారు.. బిజెపి వారి వ్యూహాలన్నింటిని మనం తిప్పికొట్టాలంటే ముందస్తు ఎన్నికలకు పోవడమే కరెక్ట్ అని చెప్పినట్లు సమాచారం.
– పి.బి. శ్రీనివాస్,
సీనియర్ జర్నలిస్ట్