• మనిషిగా పుట్టిన వాడు మాట్లాడని విధంగా సజ్జల మాట్లాడాడు
• ఇంటినుంచి తెప్పించుకునే భోజనంలో చంద్రబాబే ఏదో కలిపించుకొని ఉంటాడంటున్న సజ్జల.. గతంలో అలానే చేయమని జగన్ కు, అతని కుటుంబ సభ్యులకు చెప్పాడా?
• చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి, ఆయన్ని ఎప్పటికీ ప్రజల్లోకి రాకుండా చేయాలన్నదే జగన్ కుట్ర అని సజ్జల వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోంది
• బాబాయ్ ని అధికారంకోసం అడ్డగోలుగా చంపించిన జగన్ దేనికైనా తెగిస్తాడు.
• చంద్రబాబులాంటి నాయకుడికి కనీస సౌకర్యాలుకూడా కల్పించరా? ఆఖరికి స్నానానికి వేడినీళ్లు, తాగడానికి మంచినీరు కూడా ఇవ్వరా?
• జగన్ చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు అత్తారింట్లో మాదిరి సకల భోగాలు అనుభవించాడు
• జైల్లో ఉండి తన వ్యక్తిగత, రాజకీయ వ్యవహారాలన్నీ బ్రహ్మండంగా చక్కబెట్టుకున్నాడు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
ప్రభుత్వ సలహాదారు సజ్జల తన నోటిదూల తీర్చుకోవడానికే విలేకరులతో మాట్లాడా డని, చంద్రబాబునాయుడి ఆరోగ్యపరిస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా వెల్లడవుతున్న ఆందోళనను కప్పిపుచ్చడంకోసం మనిషనేవాడు బయట మాట్లాడని విధంగా సజ్జల మాట్లాడాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కాఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ ప్రజలతో 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం పెనవేసుకున్న గొప్ప వ్యక్తి జైల్లో పడుతు న్నఇబ్బందులు, నేడు విషమించిన ఆయన ఆరోగ్యపరిస్థితిపై తెలుగుదేశం నేతలుగా తాము, తమపార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తే సజ్జలకు ఎందుకు మంట? చంద్రబాబునాయుడి హెల్త్ బులెటిన్ పై తాము ప్రశ్నిస్తే, దానికి అరగంటకో, గంటకో పోయేవాళ్లకే హెల్త్ బులెటిన్ ఇస్తామని సజ్జల అనడం…అతని వాచాలత్వానికి నిదర్శనం కాదా?
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు సజ్జల వ్యాఖ్యలున్నాయి. సాక్షి లో గుమాస్తాగా పనిచేసిన వాడు…నేడు ప్రభుత్వ సలహాదారు అయినంత మాత్రాన, దేశం గర్వించే నాయకుడైన చంద్రబాబు గురించి మతిలేకుండా మాట్లాడతాడా? చంద్ర బాబుగురించి మాట్లాడే అర్హత, నైతికత నీకు లేవు సజ్జల.
సజ్జల ప్రభుత్వ సలహాదారా..రాజమహేంద్రవరం జైలుకి సలహాదారా?
సజ్జల ప్రభుత్వ సలహాదారా…లేక రాజమహేంద్రవరం జైలుకి సలహాదారా? సజ్జల వ్యాఖ్యలు విన్నాక రాజమహేంద్రవరం జైలు పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలో ఉందని అర్థ మైంది. జైల్లో చంద్రబాబు విషయంలో అనుసరిస్తున్న తీరు.. ఆయనకు అందిస్తున్న వైద్యసేవలు చూశాక, సజ్జల వ్యాఖ్యలు విన్నాక ఈ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇంటి నుంచి భోజనం తెప్పించు కుంటున్న చంద్రబాబే, తనకి ఏదో అవ్వడానికి అనారోగ్యం కలిగేలా చేసుకున్నాడంటున్న సజ్జలకే గతంలో అలా చేసిన అనుభవం మెండుగా ఉన్నట్టుంది.
జగన్ జైల్లో ఉన్నప్పుడు అలానే చేయమని సజ్జల… ఖైదీ నెం 6093 కుటుంబసభ్యులకు చెప్పి నట్టు ఉన్నాడు. చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం పంపించమని న్యాయస్థానమే చెప్పింది, సజ్జలో.. ఈ సైకో ముఖ్యమంత్రో చెప్పలేదు. చంద్రబాబుకి వచ్చే భోజనాన్ని జైలు అధికారులు పరిశీలించాకే లోపలికి పంపిస్తున్నారు. అలా తనిఖీ చేసేటప్పుడు ఈ ప్రభుత్వమే దానిలో ఏదైనా స్లో పాయిజన్ లాంటిది కలుపుతుందేమోఅనే అనుమానం కలుగుతోంది.
అలా చేసి చివరకు చంద్రబాబుని ప్రజల్లోకి రాకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారేమో అనే సందేహం ఉంది. ఎందుకంటే ఎన్నికలకోసం.. గెలుపుకో సం జగన్ రెడ్డి, సజ్జల ఆయన పార్టీ ఇలాంటి దుష్టపన్నాగాలే పన్నుతుంది. గతంలో ఇలానే కోడికత్తి.. బాబాయ్ హత్యలాంటి ఘటనలు చూశాం కదా! చంద్రబాబుకి సొంత బాబాయ్.. చెల్లి.. తల్లీ అనే ఆలోచన ఉండదు. తాను బాగుండటంకోసం.. పదవికోసం ఎంతకైనా తెగిస్తాడని అతని గురించి తెలిసిన వారెవరైనా చెబుతారు.
చంద్రబాబుకి స్నానానికి వేడినీళ్లు.. తాగడానికి మంచినీరు కూడా ఇవ్వరా?
చంద్రబాబునాయుడి విషయంలో ప్రభుత్వం కావాలనే జైల్లో ఆయనకు ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలేదు. ఆఖరికి స్నానానికి వేడినీళ్లు ఇవ్వడంలేదు. తాగ డానికి కలుషిత నీరు ఇస్తున్నారు. జైల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులు శుభ్రంగా ఉంచడం లేదు. ఇలాంటి కనీస అవసరాలు కూడా ఇవ్వకుండా చంద్రబాబుని వేధిస్తున్నారంటే ఏదో కుట్రతో చేస్తున్నట్టు కాదా?
జైల్ నుంచి బయటకు వచ్చేసరికి చంద్రబాబు పూర్తి గా క్రుంగి కృశించి పోవాలనే దుష్టఆలోచనలో ఈ ప్రభుత్వముంది. చంద్రబాబు ప్రజా క్షేత్రంలోకి వస్తే తమకు పుట్టగతులుండవనే భయం జగన్, సజ్జలకు ఉంది. జగన్ రెడ్డి.. అతని ప్రభుత్వం ఎంతగా ఇలాంటి కుట్రలు చేసినా… చంద్రబాబుని, టీడీపీని ఏమీ చేయలేరు. చంద్రబాబు లక్ష్యంగా జగన్ చేసే కుట్రలన్నీ తిరిగి ఆయనకే అమల వుతాయి. చంద్రబాబుని ఆపాలనుకోవడం, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోవడం లాంటిదేనని జగన్ రెడ్డి…సజ్జల.. వారి ప్రభుత్వం తెలుసుకోవాలి.
జగన్ చంచల్ గూడ జైల్లో అత్తారింట్లో మాదిరి సకల భోగాలు అనుభవించాడు. తన బతుకు, బండారం చంద్రబాబు బయటపెడుతున్నాడన్న అక్కసులో జగన్ ఉన్నాడు
గతంలో జగన్ చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు దానిలో అత్తారింట్లో కంటే ఎక్కువగా భోగాలు అనుభవించాడు. తన పార్టీ తరుపున పోటీచేసే అభ్యర్థులు సహా, తల్లి, చెల్లి, భార్యలతో ఇష్టానుసారం ములాఖత్ లు ఏర్పాటుచేయించుకున్నాడు. ఎప్పుడంటే అప్పుడు..ఎవరు కావాలంటే వారు జగన్ ని నేరుగా కలిసేలా చేసుకొని, తన వ్యక్తిగత, రాజకీయ వ్యవహారాలన్నీ జైల్ నుంచే చక్కబెట్టుకున్నాడు. ఆ స్థాయిలో భోగాలు కావాలని చంద్రబాబు అడిగారా?
సరైన నీళ్లు కూడా ఇవ్వకుండా ఆయన్ని వేధించడం వ్యక్తిగతంగా కక్షసాధించడం కాక ఏమిటి? చంద్రబాబు తన బతుకు, బండారం బయట పెడుతున్నాడనే జగన్ ఆయన్ని అన్యాయంగా జైలుకు పంపాడు. సర్వేలన్నీ తనకు, తనప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంతో దిక్కుతోచక, ఏం చేయాలో తెలియని స్థితి లోనే జగన్, అన్యాయంగా చంద్రబాబుని జైలుపాలు చేశాడు.
జగన్ తన ముఖ్యమంత్రి పదవి అడ్డంపెట్టుకొని, తనపై ఉన్న అవినీతి కేసుల విచారణను అడ్డుకుంటున్నాడు. పదవి పోయిన మరుక్షణం కేసుల విచారణ ప్రారంభం కావడం..జగన్ జైలుకెళ్లడం ఖాయం. జగన్ అండతో అడ్డగోలుగా కుట్రలు.. కుతంత్రాలకు పాల్పడుతున్న సజ్జల, మంత్రులు, అధికార పరివారమంతా కూడా జగన్ వెంట కృష్ణ జన్మస్థానానికి వెళ్లడం తథ్యం.
అధికారంకోసం బాబాయ్ ని దారుణంగా చంపిన జగన్..దేనికైనా తెగిస్తాడు. జగన్ మనస్తత్వం, వ్యక్తిత్వం బాగా తెలుసుకాబట్టే, ఆయన తల్లి, చెల్లి వారి దారి వారు చూసుకున్నారు
చంద్రబాబునాయుడిని జైలుకు పంపిస్తే సుమారు ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో ఆందోళనలు జరిగాయి. రాష్ట్రంలో ప్రజలు నిరసన వ్యక్తం చేయకుండా జగన్ సర్కార్ అప్రకటిత ఎమర్జెన్సీ అమలుచేస్తోంది. ఆఖరికి కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేయడానికి వీల్లేదనేలా వ్యవహరించే దుస్థితికి జగన్ ప్రభుత్వం దిగజారింది. సత్యాన్ని శాశ్వతంగా సమాధి చేస్తేనే తమ ఆటలు సాగుతాయని సజ్జల, జగన్ రెడ్డి అనుకుంటున్నారు. చంద్రబాబుని పరీక్షించిన వైద్యుల్ని మీడియావారితో ఎందుకు మాట్లాడనివ్వలేదు?
చంద్రబాబుకి ఇస్టానుసారం స్టెరాయిడ్స్ తో కూడిన మందులు ఎందుకు రిఫర్ చేశారు? బాబాయ్ ని అధికారంకోసం అడ్డగోలుగా చంపించిన జగన్ దేనికైనా తెగిస్తాడు. సొంత చెల్లే తనకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదని న్యాయస్థానాలతో చెప్పుకుంది నిజంకాదా? తన తోడబుట్టిన చెల్లి, కన్నతల్లి జగన్ ను వదిలేసి ఎందుకు వెళ్లిపోయారు?
అతని మనస్తత్వం, వ్కక్తిత్వం అలాంటివి. జైలు అధికారుల్ని ఎందుకు మారుస్తున్నారు? కేవలం 30 రోజుల్లోనే ఇద్దరు జైలు ఇన్ ఛార్జ్ లను ఎందుకు తప్పించారు? తాటిమట్ల ల్లాంటి నోళ్లేసుకొని అడ్డంగా మీడియాముందుకొచ్చి ఏదిపడితే అది మాట్లాడటం తప్ప సజ్జలకు, మంత్రులకు ఏం తెలుసు?” అని ఆనంద్ బాబు నిలదీశారు