– ఉమర్ అలీ షా పురస్కారం – శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమర్ అలీ షా పురస్కారాన్ని అఫ్సర్‌కు ప్రకటించిన తదుపరి నేను ఆ పరిణామాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టాను.
అటు తరువాత ఆ పీఠాధిపతి నాతో ముఖాముఖి చర్చలు జరిపారు. అఫ్సర్ ఏయే కారణాల వల్ల ఉమర్ అలీ షా పురస్కారానికి తగరో సోదాహరణంగా నేను ఆయనకు తెలియజేశాను; అఫ్సర్‌కు ఉమర్ అలీ షా పురస్కారం ‘తప్పిదం’ అన్న తెలివిడిని ఆయనకు ఇచ్చాను.
కవిత్వం అంటూ, సూఫీ కవిత్వం అంటూ హైందవ వ్యతిరేక, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక, హిందూ ప్రజ వ్యతిరేక, వేదాల వ్యతిరేక, రాముడి వ్యతిరేక, జాతీయతా వాద వ్యతిరేక రచనలు చేసిన అఫ్సర్‌కు అందుకు పూర్తిగా విరుద్ధమైన ‘జాతీయతా వాద’, ‘సనాతన వాద’ కవి ఉమర్ అలీ షా పురస్కార ప్రదానం ఘోర తప్పిదం. ఉమర్ అలీ షా స్ఫూర్తికి ద్రోహం ఇది. ఏ లోకంలో ఉందో ఉమర్ అలీ షా ఆత్మ ఈ పరిణామానికి తీవ్రంగా శోకిస్తూంటుంది. ఆ ఉమర్ అలీ షా వారసులు చెయ్యకూడని పని చేస్తున్నారు. బాధాకరం ఇది.
‘శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం మతాతీతమైనది’ అని ఆ పీఠాధిపతి చెబుతారు. కానీ అఫ్సర్ మతాతీతమైన వ్యక్తా? తాను మతాతీతమైన వ్యక్తిని, జాతీయతా వాద వ్యక్తిని, సనాతన వాదిని అని అఫ్సర్ ఇంతవరకూ చెప్పిన సందర్భం ఉందా? మతాతీతం కాని అఫ్సర్‌కు మతాతీతమైన, దేశభక్తి నిండిన, సనాతన స్ఫూర్తితో ఉన్నతస్థాయి కవి అయిన ఉమర్ అలీ షా పురస్కార ప్రదానం అత్యంత దోషం.
కవి అని అనిపించుకుంటున్న అఫ్సర్‌కు ఏనాడైనా ‘ఉమర్ అలీ షా అంతర్జాతీయ కవి’ అన్న అవగాహన వచ్చిందా? అఫ్సరే కాదు ఇంత వరకూ ఏ తెలుగు కవిత్వ మేధావీ ఉమర్ అలీ షా అంతర్జాతీయ స్థాయి కవి అని చెప్పలేదు! తెలుగు కవిత్వం ఎంత దుస్థితిలో ఉందో ఇది తెలియజేస్తోంది. ‘నేను తొలిసారి ఉమర్ అలీ షా అంతర్జాతీయ స్థాయి కవి’ అని తెలియజేశాను. అలాంటి ఉమర్ అలీ షా పురస్కారం అఫ్సర్‌కు అన్నది ‘కవిత్వ సంస్కారం’ అవదు.
అఫ్సర్ చదువు, తీరు, అఫ్సర్‌పై పోలీస్ చర్యలు బహిరంగంగా తెలిసినవే. ఒక వ్యక్తిపై పోలీస్ చర్యలు అన్నది వ్యక్తి వ్యక్తిగతం కాదు. పోలీస్ చర్యలు అంటేనే అనైతికత, అసాంఘీకత అనే కదా? వ్యక్తిగతం కాదు అనే కదా? రజా హుసైన్ వంటి తెలుగు మేధ మాత్రమే అఫ్సర్‌పై పోలీస్ చర్యలు వ్యక్తిగతం అంటుంది. అందుకు నవ్వుకోవడం తప్పితే చెయ్యగలిగింది లేదు.
పోలీస్ చర్యల్ని ఎదుర్కొన్న అఫ్సర్ ఎందుకు ఆ పోలీస్ చర్యల్ని ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే. అలాంటి అఫ్సర్‌కు ఉమర్ అలీ షా పురస్కారం ఏ సంస్కారం?
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠానికి అసలు ఏమైంది? ఆ పీఠాధిపతి తప్పు దిద్దుకునేందుకు అవకాశం ఉన్నా ఎందుకు దిద్దుకోలేదు? ఆ పీఠాధిపతిపై ఏ ఒత్తిడైనా పడిందా? నేను కొన్ని రోజుల క్రితం చెప్పినట్టుగా ఏ హైందవ, దేశ వ్యతిరేక మాఫియానో ఆ పీఠాధిపతిని ఒత్తిడి చేసిందా? ఆ పీఠాధిపతి ఈ విషయంగా నాతో మాట్లాడాక ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని, జరిగిన తప్పు సరిచేసుకుంటారని అనుకున్నాను. కానీ ఇప్పటి వరకూ అది జరగలేదు. ఆ పీఠాధిపతి ఎందుకు తప్పు సరిదిద్దుకోలేదు?
అఫ్సర్‌కు ఉమర్ అలీ షా పురస్కారం అన్నది తెలుగులో కవిత్వం అన్నదాన్ని ఇస్లామీకరణం చేస్తున్న భయంకరమైన కుట్రలో భాగమా? ఆ కుట్రలో మతాతీత పీఠం అని ప్రకటించుకున్న శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం కూడా ఇకపై భాగం కానుందా? అందుకే పీఠాధిపతి జరిగిన తప్పును దిద్దుకోలేదా?
ఆ పీఠాధిపతి స్వయంగా ఉమర్ అలీ షా పురస్కారం నాకు ఇస్తానంటే నేను గట్టిగా నిరాకరించాను. నాకు ఆ పురస్కారం రాలేదన్న దుగ్ధతో నేను మాట్లాడుతున్నానని అనే, అనుకునే చదువు, మెదడు లేని ఏ వికార స్వభావులైనా తెలుసుకోవాల్సింది ఏమిటంటే అఫ్సర్ లాగా ఎవరి చేతో పైరవీ చేయించుకుని ఈ పురస్కారం పొందాల్సిన దుస్థితిలో నేను లేను. నాకు కావాలనుకుంటే నాకు ఆ పురస్కారాన్ని ఎప్పుడో తెచ్చుకునే వాణ్ణి.
2021లోనే నేనడగకుండానే నాకు ఆ పురస్కారం నిర్ణయమైంది. కరోనా లాక్ డౌన్ కారణంగా కార్యక్రమం రద్దు అయింది. ఆ తరువాత నేను అసక్తి చూపించలేదు; నేను పట్టించుకోలేదు. ఒక పామరుణ్ని, సామాన్యుణ్ణి అయిన నేను నిస్వార్థంగా ఉమర్ అలీ షా అన్న గొప్ప తెలుగు కవిని అంతర్జాతీయం చేశాను. ఏ తెలుగు కవి మేధావీ ఈ పని చెయ్యలేదు.
ఇక ఇప్పుడు మనం ఆలోచన చెయ్యాల్సినది: శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం మతాతీత పీఠం కాదా? ఆ పీఠం అనుయాయుల్లో పెద్ద శాతం మంది హిందువులే. ఆ హిందువుల్ని ఈ పురస్కారం దెబ్బకొట్టడం కాదా? ఆ పీఠానికి సంబంధించిన హిందువులారా ఆలోచించండి. ఈ పురస్కారంగా ఇవ్వబడుతున్న నగదు కూడా ఒక హిందువు సొంత నగదే! అంటే హిందువుల నగదుతో హిందూ స్ఫూర్తిలేని అఫ్సర్‌కు పురస్కారం ఇవ్వబడుతున్నదని తెలియడం లేదా? బాధాకరమైన పరిస్థితి ఇది.
ఈ విధంగా చాపకింద నీరులా హిందువుల వేళ్లతో హిందువుల కళ్లనే పొడిపిస్తున్నారా? హిందువులపై జరుగుతున్న దాడిలో ఇదిగో ఇలా సాహిత్యం పరంగానూ ఇస్లామ్ దాడి జరుగుతోందా? అఫ్సర్‌కు ఉమర్ అలీ షా పురస్కారం అన్నది ‘శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠానికి చెరిగిపోని కళంకం’ అన్నదాన్ని ఆ పీఠాధిపతి గ్రహించగలిగే స్థితిలో లేరా?
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఇస్లామ్ పీఠం అవుతోందా? అఫ్సర్‌కు పురస్కారం ద్వారా ఆ పీఠం జాతీయతా వాద వ్యతిరేకం అవుతోందా? రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగానూ, హిందూ ప్రయోజనాలకు వ్యతిరేకంగానూ ఆ పీఠం పనిచెయ్యనుందా? ఆ పీఠంలోని హిందువులు పునరాలోచన చేసి ఇకపై పీఠం విషయంగా సరైన అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది; ఆ పీఠం విషయంలో హిందువులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
– రోచిష్మాన్
9444012279