మన తెలుగు రాష్ట్రంలో
మన తెలుగు మేధావులు
మన మాతృభాష మాట్లాడటానికి
ఎందుకు విముఖత చూపుతారో
ఎవరికీ అర్ధం కాదు..!
మీ అభిప్రాయాన్ని
మీ మేధాసంపత్తిని
మీ అనుభవాలను
మీ వాక్చాతుర్యాన్ని
ప్రదర్శించాలంటే మన మాతృభాష
ఎంతో మధురంగా, రసరమ్యంగా ఉంటుంది..
అది రాష్ట్ర ముఖ్యమంత్రైనా, స్పీకరైనా,
మంత్రులైనా, ఎంఎల్ఏ అయినా..!
అధికారులతో తప్పదు అనుకుంటే తప్ప..
మన మాతృభాష పట్ల రాష్ట్ర గౌరవ అసెంబ్లీకే
లేకపోతే ఇక ఎక్కడ మన భాషకు విలువ ఉంటుంది..
మనం ఏమీ ఆంగ్లేయులకు పుట్టలేదు కదా..
మన ప్రతిభ అనేది మనం ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ చూపించుకోవచ్చు..
మన పక్కనే ఉన్న తమిళులు చూడండి
వారు ఎక్కడికి వెళ్లినా తమ మాండలికాలలోనే
మాట్లాడుతూ ఉంటారు తప్ప వేరే ఏ ఇతర భాషలు వారు వినియోగించరు. అదీ మాతృభాష పట్ల ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం ఆత్మ సంతృప్తి.. ఏమో నాకు నా మాతృభాష పట్ల ఉన్న మమకారంతో ఈ విషయాన్ని రాశాను.
అనుసరిస్తే ధన్యుడను..
వీలైతే కోర్టులలో కూడా న్యాయమూర్తులిచ్చే తీర్పులను తెలుగులోనే అది కూడా వ్యవహారిక భాషలోనే ఉంటే ఎంతో మంచిది. ఈ విధానం ద్వారా తెలుగు అక్షరం తెలిసిన ప్రతి సామాన్యుడికి కూడా అర్ధమయ్యే వీలుంటుంది. తప్పు జరిగితే ప్రశ్నించే తత్వం పెరుగుతుంది. లేదంటే పక్క వాడి మీద ఆధారపడటం వల్ల పేదలు దోపిడికి గురవుతున్నారు. నాకు మాతృభాష పట్ల నాకున్న అభిమానాన్ని
మీరూ ఆచరిస్తే అదే పదివేలు.
ఇలా రాయడం తప్పయితే మీ మంచి సహృదయంతో మన్నిస్తారని నమస్కరిస్తున్నా..
కొండా రాజేశ్వరరావు
(సీనియర్ జర్నలిస్టు )