Suryaa.co.in

Features

వామ్మో… అయోధ్యపై తీవ్రవాది దాడి ప్రణాళిక వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?!

( పార్థసారథి పోట్లూరి )

పెద్ద ప్రమాదం తప్పింది! ఇప్పుడు అంటే జనవరి 22… అయోధ్య లో శ్రీ రామచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సంగతి తెలిసిందే! అయితే అయోధ్యలో 22న విధ్వంసం సృష్టించేందుకు గత 3 నెలల నుండి వివిధ రకాల ప్రయత్నాలు జరగడం, వాటిని సమర్థవంతంగా ముందుగానే పసిగట్టి నిరోధించడంలో ఉత్తర ప్రదేశ్ రక్షకభటులతో పాటు తీవ్రవాద వ్యతిరేక దళం సఫలం అయ్యారు.

ఉత్తరప్రదేశ్ తీవ్రవాద వ్యతిరేక దళం మరోసారి తమ సత్తా చాటింది. ముగ్గురు ముష్కరులను శుక్రవారం నాడు ఖైదు చేసింది! ముగ్గురు ఎవరు?

శంకర్ లాల్, అజిత్ కుమార్, ప్రదీప్ పూనియ… వీళ్లలో శంకర్ లాల్ రాజస్థాన్ లో పేరుమోసిన నేరగాడు..,ముఠాలు నిర్వహించడమే కాదు రాజస్థాన్ లో ఉన్న ఇతర ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. అయితే శంకర్ లాల్ రాజస్థాన్ కే పరిమితం అవలేదు. కెనడాలో ఉన్న ముఠాలతో పరిచయాలు ఉన్నాయి.

********

ఖలిస్తాన్ – శంకర్ లాల్!

కెనడాలో ఉన్న ముఠాలతో ఉన్న పరిచయాల మూలంగా కెనడాలో ఉన్న ఖలిస్తాన్ తీవ్రవాద ముఠాల కంట్లో పడ్డాడు శంకర్ లాల్! ఖలిస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ కెనడా అమెరికాల మధ్య తిరుగుతూ ఉంటాడు. అయితే రామవిగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతున్న రోజున అయోధ్యలో ఏదన్నా విధ్వంసం సృష్టించేందుకు ఆలోచన చేశాడు. దీని కోసం కెనడాలోనే ఉంటున్న ఖలిస్తాన్ మద్దతుదారుడు హర్మీందర్ అలియాస్ లండాను కలిసి మనకి సహకరించే వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు. హార్మీందర్ అలియాస్ లండా రాజస్థాన్ లో శంకర్ లాల్ గురుంచి చెప్పాడు. గురుపత్వంత్ అడిగినంత డబ్బు ఇద్దాము మనకి పనిచేస్తారేమో అడగమన్నాడు. శంకర్ లాల్ ఒప్పుకున్నాడు.

*****

గురుపత్వంత్ తనకి ఏం పని కావాలో హర్మీందర్ చేత ఆడిగించాడు శంకర్ లాల్ ని. అయోధ్య నగరం క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలి,

అయోధ్య నగరం పటం సేకరించి ఇవ్వాలి. ఎక్కడ విద్రోహ చర్యలకు వీలుగా ఉంటుందో పటంలో గుర్తు చేయాలి. ఒక వేళ దొరికితే మా పేర్లు చెప్పకూడదు. మరి ఎలా దొరికారు?

చాలాకాలం నుండి ఖలిస్తాన్ తీవ్రవాద ముఠాల మీద నిఘా పెడుతూ వస్తున్నది” రా”..అయోధ్య ప్రాణ ప్రతిష్ట విషయంలో పాకిస్థాన్ ఐఎస్ఐ ఊరికే చూస్తూ ఉంటుంది అని నిఘా వర్గాలు అనుకోవట్లేదు కాబట్టి నిఘా పెట్టారు. రాజస్థాన్ నుండి శంకర్ లాల్ మాయం అవగానే జాగ్రత్త పడ్డారు రాజస్థాన్ రక్షక భటులు.. రా నుండి వచ్చిన సమాచారాన్ని తీవ్రంగా తీసుకుని వేట మొదలు పెట్టారు. స్కార్పియో వాహనానికి కాషాయ జెండాలు కట్టి వాహనం వెనక ముందు ఆంజనేయ స్వామి పట్టిలు అంటించి అయోధ్య ప్రాంతాన్ని సోదించినట్టు తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ తీవ్రవాద వ్యతిరేక దళం రక్షకభటులకి చివరికి స్కార్పియో వాహనాన్ని అడ్డగించి ముగ్గురినీ ఖైదు చేసి విచారిస్తే విషయం బయటపడ్డది!

********

ఇది పెద్ద వార్త కాకపోవచ్చు! కానీ నిందితులు ముగ్గురూ హర్మీందర్ మరియు గురుపత్వంత్ పేర్లు న్యాయమూర్తి ముందు చెపితే అది అమెరికన్ ఎఫ్బిఐ మరియు సిఐఏ లకి చుక్కలు కనపడతాయి! ఇది పెద్ద వార్త! అసలేమైంది అంటే…

గత డిసెంబర్ నెలలో గురుపత్వంత్ ను హత్య చేయడానికి “రా “నిఖిల్ గుప్తాకి నిధులు సమకూర్చింది అంటూ జో బిడెన్ ఆరోపించాడు. దీనికి కెనడా ప్రధాని ట్రాడూ వంత పాడారు. ఇంతకీ గురుపత్వంత్ ఎవరు? గురుపత్వంత్ కి అమెరికా, కెనడా పౌరసత్వాలు ఉన్నాయి. నిఖిల్ గుప్తా ఎవరు?

నిఖిల్ గుప్తాకి కూడా అమెరికన్, కెనడా పౌరసత్వాలు ఉన్నాయి. గురుపత్వంత్ కెనడా, అమెరికాలలో స్వేచ్చగా తిరుగుతూ పాకిస్థాన్ ఐఎస్ఐ తో కలిసి భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు. అలాంటి వాడికి అమెరికన్, కెనడాలు రెండూ పొరసత్వం ఎందుకు ఇచ్చాయి?

నిఖిల్ గుప్తా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తుంటాడు. భారతీయుడు అయిన నిఖిల్ గుప్తాకి, అందులోనూ మాదకద్రవ్యలు సరఫరా చేసే వ్యక్తికి పౌరసత్వం ఎందుకు ఇచ్చాయి రెండు దేశాలు?

****

జో బైడన్, ట్రాడో లు” రా “ను లక్ష్యంగా చేస్తూ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఎందుకంటే “రా” ప్రధాని మోడీ పర్యవేక్షణలో పనిచేస్తుంది కాబట్టి.

గురుపత్వంత్ ను హత్య చేయడానికి నిఖిల్ గుప్తాకి “రా” ఒప్పందం ఇచ్చింది అని అమెరికా, కెనడాలు ఆరోపించాయి అంటే పరోక్షంగా భారత్ ను లక్ష్యంగా చేస్తూ చేసిన ఆరోపణ.

నిజానికి జో బిడెన్ కి, జస్టిన్ ట్రాడు కి మోడీజీ మూడో సారి అధికారంలోకి రావడం ఇష్టం లేదు. మరో వైపు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కొరకరాని కొయ్య అయ్యారు పశ్చిమ దేశాల కి. ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని విస్తరించి మన దేశంలో విధ్వంసం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలను మోడీ ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడమే కాదు ప్రమాదకరంగా మారుతున్న నిజ్జర్ ను కెనడా లోనే మట్టుబెట్టింది “రా”.

“రా “కార్యకలాపాలు అమెరికా, కెనడా, బ్రిటన్ లలో విజయవంతంగా అమలు చేస్తున్న ప్రయత్నాలను ఎలాగయినా ఆపాలని ప్రయత్నిస్తున్నాయి అమెరికా, కెనడా, బ్రిటన్ లు. గురుపత్వంత్ ఖలిస్థాన్ విషయంలో అమెరికాకి, కెనడాకు చాలా ముఖ్యుడు. అయితే” రా” మాత్రం సిఐఏ వేలితో సిఐఏ కన్ను పొడిచే ప్రయత్నం చేసింది.

నిఖిల్ గుప్తాకి” రా “ఒప్పందం ఇచ్చింది అని అమెరికా కెనడాలు ఆరోపించడంలో నిజమెంతో అబద్ధమెంతో ఎవరూ నిర్ధారించలేరు కానీ విషయాన్ని చాలా తీవ్రంగానే తీసుకున్నాయి అమెరికా, కెనడా దేశాలు. జో బైడెన్ ఆరోపణ చేయగానే నిజ నిర్ధారణ కోసం సిఐఏ కానీ ఎఫ్బిఐ కానీ భారత్ కి వచ్చి విచారించుకోవచ్చు అని మోడీ కోరడమే తరువాయి బిడెన్ ఎఫ్బిఐ కార్యనిర్వాహనాధికారిని పంపించాడు.

********

ఇది ప్రత్యేకం..!

క్రిస్టోఫర్ రే… ఎఫ్బిఐ కార్యనిర్వాహనాధికారి డిసెంబర్ 11, 12 తేదీలలో భారత్ వచ్చి జాతీయ భద్రతా అధికారి అజిత్ దోవల్ తో సమావేశం అయ్యాడు. గురుపత్వంత్ ని హత్య చేయడానికి నిఖిల్ గుప్తాకి “రా” ఒప్పందం ఇచ్చింది అనే ఆరోపణలకు ఆధారాలు చూపించమని అజిత్ దోవల్ అడిగారు. అయితే నిఖిల్ గుప్తాని అమెరికా రప్పించి విచారిస్తేనే కానీ ఆధారాలు చూపించలేమని క్రిస్టోఫర్ బదులిచ్చాడు.

క్రిస్టోఫర్: మీరు గురుపత్వంత్ సింగ్ పన్నును హత్య చేయడానికి నిఖిల్ గుప్తాకి ఒప్పందం ఇచ్చింది నిజం కాదా?

అజిత్ దోవల్: గురుపత్వంత్ సింగ్ సిఐఏ ఆస్తి (సిఐఏ గూఢచారి ) అని మాకు తెలుసు. అతను మీ దేశంలో ఉన్నా, కెనడాలో ఉన్నా సిఐఏ రక్షణలో ఉంటాడు అని మాకు తెలిసీ అతన్ని చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తాము?

క్రిస్టోఫర్: తెల్లమొహం వేశాడు. అజిత్ దోవల్ గారి నుండి ఇలాంటి సమాధానం వస్తుంది అని ఊహించలేదు.

అజిత్ దోవల్: నిఖిల్ గుప్తాకి అమెరికా పౌరసత్వం ఇచ్చి, అతను మాదక ద్రవ్యాల ముఠా నాయకుడు అని తెలిసీ సిఐఏకి పని చేసేట్లు ఒప్పందం ఇచ్చారు కదా? మరి ఇద్దరూ సిఐఏకి పని చేస్తున్నారు కాదా? మరి సిఐఏ గుడచారులు ఒకరిని ఇంకొకరు చంపుతారా?

క్రిస్టోఫర్ మొహంలో నెత్తురు చుక్క లేదు. నిశ్శబ్దం.

అజిత్ దోవల్: మీ అధ్యక్షుడు మా మీద ఆరోపణ చేసిన సమయంలో నిఖిల్ గుప్తా సిఐఏ కార్యకలాపాలా కోసం చెక్ రిపబ్లిక్ దేశంలో ఉన్నది నిజం కాదా?

క్రిస్టోఫర్ నిశ్శబ్దం.”రా “లేదా అజిత్ దోవల్ దగ్గర ఇంత ఖచ్చితమైన సమాచారం ఉందా? ఇది క్రిస్టోఫర్ మౌనానికి అర్థం.

****

జో బిదేన్ ఎప్పుడయితే నిఖిల్ గుప్తా పేరు బయటపెట్టాడో అప్పుడు నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్ దేశంలో ఉన్నాడు సిఐఏ పని మీద. తనని సిఐఏ ఇరికించబోతున్నది అని గ్రహించి చెక్ రిపబ్లిక్ దేశంలోని న్యాయస్థానంలో అర్జీ వేశాడు తనని అమెరికాకి అప్పగించవద్దని. దాంతో న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు నిఖిల్ గుప్తాని అమెరికాకి అప్పచెప్పవద్దని అక్కడి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

నిన్న అంటే 21-01-2024 న నిఖిల్ గుప్తాను అమెరికాకి అప్పచెప్పవచ్చు అని తీర్పు వెలువరించింది. మూడు రోజుల ముందు ఉత్తర ప్రదేశ్ తీవ్రవాద నిరోధక దళం శంకర్ లాల్ ముఠాని ఖైదు చేసింది. విచారణలో గురుపత్వంత్ సింగ్, హర్మీందర్ సింగ్ పేర్లు బయట పడ్డాయి. నిఖిల్ గుప్తాను రేపు అమెరికాకి తీసుకెళ్ళి విచారిస్తారు, దానికి ప్రతిగా శంకర్ లాల్ న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇస్తాడు. ఎలా ఉంది ఆట?

LEAVE A RESPONSE