– జిల్లాల వారీగా వాయిదా పద్దతిలో ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు?
– ఉద్యోగుల బిల్లులను నెలల తరబడి ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి?
– ధనిక రాష్ట్రమంటూ తెలంగాణను అప్పులు కుప్పగా మార్చలేదా?
– సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
– ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల బిల్లలున్నీ తక్షణమే చెల్లించాలి
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
• ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా వైఫల్యం వల్ల రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పింది. తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమని గొప్పలు చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి పూర్తిగా దివాళా తీయించారు.
• ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదు. రోజుకో జిల్లా చొప్పున వంతుల వారీగా జీతాలు చెల్లిస్తూ ప్రతి నెలా రెండోవారం దాకా సాగదీస్తున్నారు.
• ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్, ఎడ్యుకేషన్ కన్షెషన్, సరెండర్ బిల్లులు గత 7 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి.
• చివరకు 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులకు సంబంధించి జనవరి నెల వేతనం కూడా ఇంకా చెల్లించలేదంటే రాష్ట్ర ఆర్దిక పరిస్థితి ఏ దుస్థితిలో ఉందో ఇంతకంటే నిదర్శనం ఏముంది?
• ఉద్యోగ, ఉపాధ్యాయులు జీపీఎఫ్ లో కూడబెట్టుకున్న డబ్బులను తమ పిల్లల ఉన్నత చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం, కుటుంబ సభ్యులకు చికిత్స చేయించుకోవాలని ఆరాట పడుతుంటే వాటిని కూడా చెల్లించకపోవడం అత్యంత దురదుష్టకరం. జీపీఎఫ్ సొమ్ము డ్రా చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తులను గత 2 ఏళ్లుగా ఎందుకు పెండింగ్ లో పెట్టారు?
• నిజంగా తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగుల బడ్జెట్ కలిగిన రాష్ట్రమైతే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వేతనాలకు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చింది? వాయిదాల పద్దతిలో మాదిరిగా ఒక్కోరోజు ఒక్కో జిల్లాకు చొప్పున ప్రతినెలా రెండో వారం దాకా జీతాలను చెల్లిస్తూ ఎందుకు సాగదీస్తున్నరు?
• ఉద్యోగ, ఉపాధ్యాయులు 2020 జులై తరువాత సమర్పించిన వేలాది పెండింగ్ బిల్లులను 2021 మార్చి 31 నాడు ఎందుకు తిరస్కరించింది ఈ ప్రభుత్వం?…. ఆ తరువాత 2021 నుండి సమర్పించిన పెండింగ్ బిల్లులను కూడా ఆర్దిక సంవత్సరం ముగుస్తున్నా ఇంకా ఎందుకు చెల్లించడంలేదు. మార్చి 31 లోపు పెండింగ్ బిల్లులు పాస్ కాకపోతే పరిస్థితి ఏమిటి?
• ఉద్యోగుల ఆరోగ్య పథకం ఎక్కడ కూడా అమలవుతున్న దాఖలాలు లేవు. హెల్త్ కార్డులతో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యం చేయకపోవడంతో ఉద్యోగులు నానా యాతనలు పడుతుంటే ఎందుకు స్పందించడం లేదు?
• ఇదేనా ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా? ఇకపై ఉద్యోగి పదవీ విరమణ చేసిన రోజే రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ అన్ని అదేరోజు అందించి ఆనందంగా ఇంటికి పంపుతామని అసెంబ్లీ సాక్షిగా ఘనంగా ప్రకటించిన ముఖ్యమంత్రి మాటలేమయ్యాయి? ఉద్యోగ విరమణ పొందిన తరువాత కూడా నెలల తరబడి ఉద్యోగికి రావలసిన బకాయిలు రాక పోవడం దారుణం.
• నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే మంజూరు చేయాలని కోరుతున్నాం.