Suryaa.co.in

Andhra Pradesh

ఇందిరా మైదానమా…మద్యం దుకాణమా? నవీన్

తిరుపతి ఆధ్యాత్మిక నగర నడిబొడ్డున నగరపాలక సంస్థకు,తుడా కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న “ఇందిరా మైదానం”అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది!

నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ నిధులతో ఇందిరా మైదానంలో ఆడిటోరియం క్రీడా మైదానాన్ని అత్యద్భుతంగా ప్రజాధనంతో నిర్మించి ఇటీవల “జాతీయ స్థాయి కబడ్డీ” పోటీలు నిర్వహించారు “గంగమ్మ జాతర” సందర్భంగా భక్తులు పొంగళ్ళు పెట్టుకునే విధంగా సద్వినియోగం చేసుకున్నారు!

ఇందిరా మైదానంలో సెక్యూరిటీ లేని కారణంగా గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి మద్యం బాటిల్స్ మైదానంలో పగలగొట్టిన కారణంగా మైదానమంతా “గాజు ముక్కలు” దర్శన మిస్తున్నాయి!

ఇందిరా మైదానంలో చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు గాజు పెంకుల కారణంగా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి! ఇందిరా మైదానానికి సమీపంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్,తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం ఉన్నందున నిత్యం స్థానికులతో రద్దీగా ఉన్న ప్రదేశం ఇలా తయారవడం శోచనీయం! నగరపాలక సంస్థ అధికారులు ఇందిరా మైదానం వైపు కన్నెత్తి చూడకపోవటంతో “పేరు గొప్ప మైదానం దిబ్బ” అన్న చందంగా మారింది!

నగరపాలకసంస్థ అధికారులు వెంటనే టీటీడి అధికారులతో చర్చించి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఇందిరా మైదానంలో ప్రతిరోజూ సాయంత్రం ఓ గంట పాటు అధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టి అసాంఘిక కార్యక్రమాలు జరగాకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని స్తానికునిగా డిమాండ్ చేస్తున్నాను.

నవీన్ కుమార్ రెడ్డి
స్థానికులు

LEAVE A RESPONSE