Suryaa.co.in

Andhra Pradesh

రాజు ఎత్తుకు జగన్ చిత్తు

– ఇది ఆరంభం మాత్రమేనా?
– ఒక అవిశ్రాంత వ్యూహాత్మక రఘురామకృష్ణంరాజు పోరాటం
– రఘురామకృష్ణంరాజు గాయం నుంచి విజయ్‌పాల్ అరెస్టు వరకు..

2021 లో రఘురామకృష్ణరాజు పై జరిగిన అమానుష ఘటన తదుపరి జరిగిన న్యాయ రాజకీయ పరిణామాలు, ప్రస్తుతం మరొకసారి జరిగిన పరిణామ క్రమం ఎత్తులు పై ఎత్తులు చూస్తే..‌ నిరంతరం జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు అని ఆనాడు రఘురామకృష్ణంరాజు పై జగన్ సర్కార్ తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా, కొట్టించడం అమానుష నియంతృత్వ ఘటన. జగన్ సూత్రధారి అధికారులు పాత్రధారులు అనుకోవచ్చు. వివాదం న్యాయస్థానం చేరింది.‌ నివేదిక కీలకం అయింది.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ చేత.. గాయాలు లేవు అని చెప్పించారు జగన్. న్యాయస్థానం జోక్యంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్మీ ఆసుపత్రి నివేదిక మాత్రం గాయాలు గుర్తించారు.
ఆ పై గాయాలు సోరియాసిస్ అని ఫ్యాన్స్ అన్నారు. ఫ్యాన్ పార్టీ ఎడిమా అనింది. సాక్షి లో డ్రామా అని రాసింది.‌ ఆ గాయాలు తనంతట తానే చేసుకున్నారని సర్కార్ సీఐడీ ప్లేటు ఫిరాయించింది. సీఐడీ అధికారుల పర్యవేక్షణ లో కదా రఘురామకృష్ణంరాజు ఉన్నది తనంతట తానే చేసుకున్నారు అని ముందే చెప్పకపోవటం వలన ప్రభుత్వ & సీఐడీ ఇరుకునపడ్డారు.‌

జగన్ ప్రభుత్వం ఉండగా ఏం చేయలేం అని రఘురామకృష్ణంరాజు భావించారు. మూడేళ్ల తర్వాత రఘురామకృష్ణంరాజు ఆ కేసు తిరగతోడారు. నాటి సిఎం జగన్ సహా పోలీసు వైద్య అధికారులపై రఘురామకృష్ణంరాజు రివర్స్ కేసు పెట్టారు. సుప్రీం కొట్టివేసిన కేసు అని సాక్షి & తిరస్కరించిన కేసు అని పివి సునీల్ కొత్త భాష్యం.

నాకు ఉన్న అవగాహన మేరకు కోర్టు భాషలో Disposed of అని ఉంది Dismissed అని లేదు. ఆనాటి రెండు కేసుల్లో సికింద్రాబాద్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించమని ఆదేశాలు ఇచ్చినట్లు బెయిల్ ఉత్తర్వులు ఇస్తూ విచారణకు సహకరించమని ఉత్తర్వులు ఇచ్చినట్లు ఉంది. సిబిఐ విచారణకు (మాత్రమే) సుప్రీం తిరస్కరించినట్లు సాక్షి వక్రభాష్యం అయితే రఘురామకృష్ణంరాజు కొడుకు హైకోర్టు లో తేల్చుకుంటాం అని కేసు ఉపసంహరించుకున్నారు. హైకోర్టు లో నడపకుండా వేచి ఉండి ఇపుడు కదపడం రఘురామకృష్ణంరాజు వ్యూహాత్మక తొలి అడుగు.

2023 లో ముందుచూపు తో మిలటరీ ఆసుపత్రి నివేదిక తో పాటు రఘురామకృష్ణంరాజు ఆనాటి కాల్ డేటా భద్రపరిచే విధంగా, న్యాయస్థానం లో ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇపుడు న్యాయస్థానంలో అవి కీలకం అయ్యాయి. విచారణ అధికారి విజయ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు అవడంతో అరెస్టు తప్పనిసరి అయింది. ఇది ఆరంభం మాత్రమే(నా?) సునీల్ ఆపై సూత్రధారి వరకు ?

ఏ వ్యవస్థ అడ్డం పెట్టుకొని నియంతృత్వ చర్యలు చేశారో ఆ వ్యవస్థలే ఇపుడు తిరగబడ్డాయి. ఇది ప్రతీకార చర్య కాదు కక్షసాధింపు అసలే కాదు. ఒక అవిశ్రాంత వ్యూహాత్మక రఘురామకృష్ణంరాజు పోరాటం.

LEAVE A RESPONSE