• విద్యుత్ కొనుగోళ్లలో జగన్ కి లంచం ముట్టినట్లు గుర్తించిన అమెరికా ఎఫ్‌బీఐ
• అవినీతిలో జగన్ కి మించిన మరో వ్యక్తి లేడని లేచిన ఎఫ్‌బీఐ
• జ్యూరీ ట్రైల్ బై డిమాండ్ ప్రకారం ఒక సంవత్సరంలో జగన్ భాగోతం బట్టబయలు
• చంద్రబాబు తప్పు చేశారని నాడు ప్రెస్ మీట్ పెట్టిన విజయ్ సాయిరెడ్డి, శ్రీకాంత్, అజెయ్ కళ్ళెంలు.. చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలి
• అనంతపూర్‌లో సోలార్ పార్క్ చేసిన పీపీఏల్లో అన్ని రాష్ట్రాలు కొన్న రేటుకంటే తక్కువ రేటుకి కొన్నాం.. ఇందులో ఎక్కడ తప్పు జరిగిందో విజయ్ సాయిరెడ్డి చెప్పాలి
– ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణా రెడ్డి డిమాండ్
మంగళగిరి: అవినీతిలో జగన్ రెడ్డికి మించిన రారాజు లేడని.. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో జగన్ రెడ్డికి రూ.1,750 కోట్ల లంచం ముట్టినట్లు అమెరికా ఎఫ్‌బీఐ తేల్చిందని.. ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణా రెడ్డి అన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
యునైటెడ్ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఈస్ట్రన్ డిస్ట్రిక్ట కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ లో ఫైల్ అయిన Case 1-24CIV8080లో ఏపీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద వ్యక్తులు, ఐఏఎస్ అధికారులు పేర్లు ఎఫ్‌బిఐ పేర్కొంది. విద్యుత్ కొనుగోలులో ఆదాని సంస్థ నుంచి జగన్ రెడ్డికి రూ.1,750 కోట్లు లంచం ముట్టిందని అక్కడి ఎఫ్బీఐ తేల్చింది. జూన్ 2020లో 90 రోజుల్లో డిస్కాంలతో పీపీఏ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం చేసుకోవాలని సెకీతో రాష్ట్ర ప్రభుత్వం అగ్రీమెంట్ చేసుకుంటే 18 నెలలు అయినా జగన్ రెడ్డి ఎందుకు చేసుకోలేదు? మా దగ్గర 9 వేల మెగా వాట్ల సోలార్ పవర్ ఉంది కొనుక్కోండని రాష్ట్ర ప్రభుత్వాలను సెకీ కోరగా మాకొద్దంటే మాకొద్దు ఆ రేటుకు మేం కొనలేం మీకు దండం పెడతామని అన్ని రాష్ట్రాల డిస్కంలు జంకాయి.
కానీ జగన్ రెడ్డి మాత్రం మార్కెట్ రేటు కంటే ఎక్కువ రేటైనా మాకు కావాలంటే మాకు కావాలని ఎగబడ్డాడు. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ తేల్చింది. అన్ని రాష్ట్రాలు వద్దు అంటున్నాయని ఆగస్టు 2021లో ఆదాని వచ్చి జగన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్‌లో కలిశారు. జగన్ రెడ్డికి లంచం ఇస్తామనడంతో ఫైలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అర్ధరాత్రులు కూడా పరిగెత్తింది. ఐఏఎస్ అధికారులు కూడా నిద్రపోకుండా అర్ధరాత్రి ఒంటిగంటకు అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తలుపు కొట్టారు. సైన్ పెట్టమంటే ఇందులో ఏదో లొసుగుందని గుర్తించి జాగ్రత్తపడి బాలినేని వాసు సైడ్ అయ్యారు. దాంతో మంత్రి ప్రమేయం లేకుండానే సెకీతో అగ్రిమెంట్ ఫైళును క్యాబినేట్‌లో పెట్టి ఆమోదం తెలిపింది గత వైసీపీ ప్రభుత్వం.
లంచం తీసుకోవడం గొప్ప కాదు, కానీ అమెరికా కోర్టులో జగన్ రెడ్డి పేరు రావడం గొప్పతనం. న్యూయార్క్ గ్లామర్ బాయ్‌గా జగన్ రెడ్డి నేడు గుర్తింపుపొందాడు. ఒడిశాతో కుదుర్చుకున్న ఒప్పందానికి తీసుకున్న లంచం కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న లంచం ఎక్కువని ఎఫ్‌బీఐ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. అవినీతిలో జగన్ రెడ్డికి మించిన రారాజు లేడు. జగన్ రెడ్డికి 200 మిలియన్ డాలర్ల లంచం జగన్ రెడ్డికి ముట్టిన తర్వాత ఫైలు చాలా వేగంగా పరిగెత్తిందని ఎఫ్‌బిఐ గుర్తించింది. విద్యుత్ కొనుగోలులో చంద్రబాబు కుదుర్చుకున్న పీపీఏలు తప్పని జులై 2019లో అజయ్ కళ్ళెం రెడ్డి, శ్రీకాంత్‌తో సహా మరో ఐఏఎస్ అధికారులు ప్రెస్ మీట్టి చంద్రబాబు తప్పు చేశారని అన్నారు.
ఇప్పుడు ఎఫ్‌బీఐ పొందుపర్చిన ఛార్జ్ షీట్‌లో జగన్ రెడ్డి అవినీతి గురించి చదువుకొని… మీరు ప్రేమించిన జగన్ రెడ్డి దొంగ, దోపిడీదారుడు అని ఒప్పుకొని చంద్రబాబును క్షమాపణ కోరాలి. ఇక్కడ సీబీబీ, ఈడీ కేసులు 14, 18 సంవత్సరాలు నడిపించినట్లు ఈ కేసును కూడా నడిపించవచ్చని అనుకోవద్దు జగన్ రెడ్డి. జ్యూరీ ట్రైల్ బై డిమాండ్ ప్రకారం ఒక సంవత్సరంలో ఈ కేసులో జడ్జిమెంట్ వస్తుంది. అది కూడా ఇక్కడిలా జడ్జీలు కాదు జడ్జిమెంట్ ఇచ్చేది, ప్రజల్లో నుంచి కొంతమందిని ఎంచుకొని వారిచే జడ్జిమెంట్ ఇప్పిస్తారు. ఒక సంవత్సరంలో జగన్ రెడ్డి బాగోతం మొత్తం బయటపెడనుంది. జగన్ రెడ్డి కానీ, విజయ్ సాయిరెడ్డి కానీ ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందో వారెవ్వరూ తప్పించుకోలేరు. ఇక్కడిలా జైలుకు భారతిరెడ్డి క్యారేజీ తీసుకురాలేదు. కాబట్టి బ్రెడ్ ముక్కలు తినడం నేర్చుకోండి.
నాడు చంద్రబాబు ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.4.43కు కొన్నారని దొంగా అని అవినీతి పత్రిక సాక్షి అంటోంది. రూ.4.43కు కొన్న మేమే దొంగలమైతే నాడు తెలంగాణ ఎన్టీపీఎస్ రూ.4.66 కు కొనింది. అంటే కేసీఆర్ దొంగా..? మన రాష్ట్రమే కాదు ఆ రోజు భారతదేశంలో ఉన్న మార్కెట్ రేటు అది. రూ.4.43 నుంచి రూ.4.67 వరకు వ్యత్సాసముంది. అందుకే ఆ రేటుకు మిగిలిన రాష్ట్రాలకంటే మనమే తక్కువ రేటుకు కొన్నాం. అనంతపూర్ సోలార్ పార్క్‌కు చేసిన పీపీఏలో అన్ని రాష్ట్రాలు కుదుర్చుకున్న రేటు కంటే తక్కువ రేటుకు చంద్రబాబు కుదుర్చుకున్నారు. ఇందులో ఏదో తప్పు జరిగిందని అవినీతి పత్రికల కథనాలు రాసింది. నిజంగా తప్పు జరిగుంటేయ మీరు ప్రభుత్వంలో ఉండి కూడా ఎందుకు విచారణ జరిపించలేదు అజయ్ కళ్ళెం రెడ్డి? ఎందుకు సీబీఐ, ఎఫ్‌బిఐలు మా మీదకు రాలేదు.
ఇందులో ఎక్కడ తప్పు జరిగిందో అజెయ్ కళ్ళెం రెడ్డి, శ్రీకాంత్‌లు సమాధానం చెప్పాలి. మా హయాంలో ప్రతీ ఒప్పందాలు, జీవోలు వెబ్‌సైట్‌లో ఉండేవి. చంద్రబాబు ఎవర్ని కలిసినా, ఎవరు చంద్రబాబు ని కలిసినా, ఎందుకు కలిశారో, ఏంటో అంతా ఓపెన్ బుక్. సీఎస్ నుంచి ఆఫీస్ బాయ్‌ల వరకు అందరూ మీటింగ్ వద్దే ఉండేవారు. జగన్ రెడ్డిలా దొంగ జీవోలు, దొంగ మీటింగ్‌లు చంద్రబాబు జరపలేదు. కానీ జగన్ రెడ్డి ఐదేళ్ళలో ఎవర్ని కలిసినా జగన్ రెడ్డి, అతని భార్య భారతీ రెడ్డి తప్పించి ఎవరూ ఉండేవాళ్ళు కాదు. దీని వెనుకున్న అంతర్యమేమిటో ఎవరికి తెలియదు. వీటిన్నింటినీ ఎఫ్‌బీఐ పసిగట్టింది. జగన్ రెడ్డి చేసిన అవకతవకలను ఎఫ్‌బీఐ పసిగట్టింది. కొద్ది రోజుల్లోనే అన్ని ఆధారాలతో కోర్టులో సమర్పించనుంది.
2021లో 6.4 గిగా వాట్‌ల సోలార్ పవర్‌కు ఏపి గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ టెండర్‌కు పిలిచింది. ఆదాని, షిర్డిసాయి, టారెంట్ వంటి నాలుగు కంపెనీలు టెండర్లకు వచ్చాయి. మేం కూడా టెండర్ ప్రక్రియలో పాల్గొంటామని టాటా కంపెనీ వచ్చింది. టాటా కంపెనీ ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వదని, వారు లంచాలు ఇచ్చారంటే ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరని జగన్ రెడ్డి ప్రభుత్వం టెండర్ కంపెనీలో టాటా కంపెనీ పాల్గొనేందుకు ససేమిరా అంది. కొన్ని అభ్యంతరాలను తెలుపగా ఈ టెండర్‌ను జగన్ రెడ్డి రద్దు చేసింది. టాటా కంపెనీ పెట్టిన అభ్యంతరాలు సరైనవే అని కింద స్థాయి కోర్టు తీర్పును కూడా ఇచ్చింది.
నేడు ఈ కేసు హైకోర్టులో ఉంది. మన రాష్ట్రానికి రావాల్సిన 6,400 మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును జగన్ రెడ్డి నాశనం చేశాడు. 2014లో 5 పీపీఏలపై చంద్రబాబు సైన్ చేశారు. కర్నూలు, అనంతపూరంలో ప్లాంట్లు మొదలయ్యాయి. చంద్రబాబు విజనరీని మెచ్చి మేం వస్తామంటూ ఎన్నో సాఫ్ట్ బ్యాంకు సంస్థలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. జగన్ రెడ్డి సీఎం అయ్యాక కక్షగట్టి నాడు చంద్రబాబు కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేస్తామనడంతో ఆ సంస్థలన్నీ పై హైకోర్టుకు వెళ్ళాయి. ఆ సంస్థలన్నీ తమ కార్యకలాపాలను నిలిపేసి వెనక్కి వెళ్ళిపోయాయి.
ప్రపంచంలోనే నెం.1 దిగ్గజ జపాన్ సంస్థ ఎస్బీ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ కంపెనీ సైతం జగన్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి పంపించింది. 2023 నవంబరు మూడోతేదీన మరలా తిరిగి వచ్చేయండని ఆ కంపెనీలన్నింటికీ జగన్ రెడ్డి లేఖలు రాశారు. ఆ రోజే గనుక జగన్ రెడ్డి ఆ సంస్థలను వేధించకుండా ఆపి ఉంటే 6 వేల నుండి 10 వేలు మెగా వాట్లు మన రాష్ట్రంలో ఉండేవి. నేడు మన రాష్ట్రానికి మనిహారంగా నిలిచేయి. ఒక మెగా వాట్‌కి రూ.14 లక్షల జీఎస్టీ వచ్చేది. అందులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది. జగన్ రెడ్డి వల్ల రూ.1,260 కోట్లు నష్టం వాటిల్లింది. ప్రతీ మెగా వాట్‌కి రూ.20 లక్షలు గ్రాంట్‌ను రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేది. దాంతో రూ.1,800 కోట్లు నష్టం వాటిల్లింది. లంచమే ముఖ్యమనుకున్న జగన్ రెడ్డి వల్ల మొత్తంగా రూ.3,060 కోట్లు నష్టం వచ్చింది.