– బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల రిక్త హస్తాలు
– ఆమె మోదీ అపాయింట్మెంట్ కోరితే ప్రొటోకాల్ మేరకు కలిసే ప్రయత్నం చేస్తాం
– మాజీ డీస్పీ నళిని పరామర్శించిన బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్రావు
భువనగిరి: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాజీ డీఎస్పీ నళిని ని ఆమె స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా నళిని ఆరోగ్య పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి , మాజీ ఎంపీ, బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బూర నర్సయ్య గౌడ్ , సీనియర్ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ , ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు.:నళిని తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీస్ ఫోర్స్లో ఉన్నప్పటికీ జై తెలంగాణ నినాదంతో ఉద్యమానికి మద్దతు ఇచ్చి రాజీనామా చేశారు. నళిని రాజీనామా తర్వాత డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది, కానీ ఇప్పటివరకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయలేదు.
గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నళిని ని ఇబ్బందులకు గురిచేసింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ, బెనిఫిట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. నళిని 16 పేజీలలో రిపోర్ట్ సబ్మిట్ చేసి పరిస్థితులను వివరించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇతర కారణాలు చెబుతూ బెనిఫిట్స్ విడుదల చేయడం లేదు. ఫలితంగా నళిని మానసిక వేదనకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించింది.
ఇటువంటి పరిస్థితుల్లో నళినికి మద్దతుగా నిలుస్తూ… బిజెపి బృందం ఆమెను పరామర్శించడం జరిగింది. నళిని రిటైర్మెంట్ వేతనం, ఇతర అధికారిక ప్రయోజనాలను సమాజ సేవ కోసం వినియోగిస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రిటైర్మెంట్ ప్రయోజనాలను విడుదల చేసి, ఆమెను మానసిక వేదన నుండి బయటకు తీసుకోవాలి. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరితే, ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం కలిసేలా ప్రయత్నిస్తాం.