Suryaa.co.in

Andhra Pradesh

ఇసుక, భూములు కాజేశాడు..ఇదేనా పాలన?

-పదేళ్లు ఎమ్మెల్యే..తిరువూరుకు ఏమైనా చేశాడా?
-నియోజకవర్గానికి ఐదేళ్లు జగన్‌ ఏం చేశాడు…
-తిరువూరు సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి

ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా తిరువూరు బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. తిరువూరు ఎమ్మెల్యే పదేళ్లుగా పాలించాడు. ఏమైనా నియోజకవర్గానికి పనికి వచ్చాడా? జగన్‌ ఐదేళ్ల క్రితం ఇక్కడకు వచ్చాడట. నాగార్జున సాగర్‌ నుంచి నీళ్లు తెస్తా..300 చెరువులను బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ చేస్తా అన్నాడట. ఒక్క చెరువు అయినా నింపాడా? ఫ్లోరైడ్‌ బాధితులు ఇక్కడ ఎక్కువ. కిడ్నీ బాధితులు ఎక్కువ. మంచినీటి కోసం ఒక ప్రత్యేక రిజర్వాయర్‌ కడతామని చెప్పి కట్టారా? అని ప్రశ్నించారు.

మ్యాంగో ప్రాసెసింగ్‌ యూనిట్లు కడతాం అన్నారు..కోల్డ్‌ స్టోరేజ్‌ కడతామన్నారు. ఐటీఐ కాలేజీలు, పాలిటెక్నిక్‌ కాలేజీ అన్నారు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. యథేచ్ఛగా నియోజకవర్గంలో భూములను దోచేశారు. మొత్తం ఇసుకను కాజేశారు. ఇదేనా పాలన? మళ్లీ మోసపోతామా? అని ప్రశ్నించారు. ఒక్క సీటు లేని బీజేపీకి బాబు, జగన్‌, పవన్‌ ముగ్గురూ బానిసలు. ఎవరికి ఓటేసినా దండగే. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పారు.

LEAVE A RESPONSE