Suryaa.co.in

Telangana

దేవాలయాలపై ఇస్లామిక్ ఉగ్రవాద దాడులు అరికట్టాలి

– వి హెచ్ పి తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల పై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని వి హెచ్ పి తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి పగుడాకుల బాలస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందు దేవాలయాల పై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం వి హెచ్ పి, భజరంగ్ దళ్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఈ మేరకు ఓల్డ్ సిటీ లోని ప్రఖ్యాత లాల్ దర్వాజా సింహ వాహిని మహంకాళి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లాల్ దర్వాజా మందిర్ నుంచి లాల్ దర్వాజా చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దారి వెంబడి జై శ్రీ రామ్, ఇస్లామిక్ తీవ్రవాదం నశించాలనే నినాదాలతో హోరెత్తించారు. లాల్ దర్వాజా చౌరస్థకు చేరుకుని ధర్నా నిర్వహించారు. దేవాలయాలను పరిరక్షించాలని నినాదాలు చేశారు.

చౌరస్తాలో దాదాపు అరా గంట పాటు ఆందోళన చేశారు. మందిరాలపై దాడులకు దిగుతున్న దుండగులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పగుడాకుల బాలస్వామి మాట్లాడుతూ.. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కనీసం స్పందించకపోవడం హిందూ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించడమేనని విమర్శించారు.

ఓటు బ్యాంకు రాజకీయాలకు కక్కుర్తి పడి హిందూ దేవాలయాలు ధ్వంసం అవుతున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ కూడా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్న కూడా పట్టించుకోకపోవడం చేతకానితనం అన్నారు.

సికింద్రాబాద్ ముత్యాలమ్మ మందిరానికి ఆనుకొని ఉన్న మసీదు టెర్రరిస్టులకు అడ్డంగా మారిందన్నారు. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చి భాగ్యనగర్ లో అనేకమంది ఉగ్రవాదులు తిష్ట వేస్తున్న కూడా ఇక్కడి నిఘవ్యవస్థ పట్టించుకోకపోవడం అత్యంత దారుణం అన్నారు. మానసిక ఉల్లాసానికి సంబంధించిన శిక్షణ పేరుతో ఉగ్రవాదపు శిక్షణ కొనసాగిస్తున్న కూడా ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత హేయమన్నారు.

ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న మునావర్ జామ అనే టెర్రరిస్టును పట్టుకోవడంలో పోలీస్ యంత్రాంగం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. మునవర్ చామ శిక్షణ కేంద్రంలో ఇప్పటివరకు శిక్షణ పొందిన వందల మంది విద్యార్థుల జాడలేదని.. వారంతా ఉగ్రవాద శిక్షణ పొంది శాంతి భద్రతలను విఘాతం కలిగించే పనిలో నిమగ్నమై ఉన్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయలే లక్ష్యంగా హిందుత్వం పై దాడి జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఘాటుగా స్పందించారు.

రాష్ట్రంలోని మసీదులలో తనిఖీలు నిర్వహించాలని, ఉగ్రవాదుల జాడ తెలుసుకొని కఠినంగా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేత బాలస్వామి డిమాండ్ చేశారు. పాత నగరం ఓల్డ్ సిటీలో ఇప్పటికే దాదాపు పలు దేవాలయాలు మాయమయ్యాయని, మిగిలిన దేవాలయాలను టార్గెట్ చేసుకొని రోజుకు రోజు యదేచ్చగా దాడాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దేవాలయాలకు రక్షణ కల్పించాలని, ఈ విషయంలో దేవాదాయ శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దేవాదాయ ఆస్తులు, దేవుడి హుండీ పైనే కన్ను వేసిన దేవాదాయ శాఖ.. దేవుడి భద్రత, పవిత్రత విషయంలో చేతులెత్తేయడం దుర్మార్గమైన వ్యవహరమని ఖండించారు. దేవుడి ఆస్తులను కాజేసి దేవుడిని గాలికి వదిలేసే దేవాదాయ శాఖ తీరు అత్యంత హేయమని ఆక్షేపించారు. ఈ రాష్ట్రంలో ఇస్లామిక్ టెర్రరిస్టు భావజాలం గల వ్యక్తులను పసిగట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఆర్య నగర్ (ఓల్డ్ సిటీ)లో నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 300 మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు రేగు అనిల్, విశాల్,భాను, పవన్ ,అభిలాష్ కుమార్ , హరి, రాహుల్, రాజు, అశ్విన్, సునీల్, దీపు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE