Suryaa.co.in

Political News

దేవుడి స్క్రిప్ట్ అంటే ఇది కాదా?!

సిఆర్డీయే చట్టాన్ని రద్దు చేద్దామని వైకాపా ప్రయత్నించింది. ఆ చట్టం రూల్స్‌తోనే నిర్మాణం దశలోని వైకాపా పార్టీ ఆఫీసు కూల్చబడింది.
పొన్నవోలు సుధాకర్‌ను పంపించారు హైకోర్టుకు. నిర్మాణంలో వున్న మా వైకాపా పార్టీ ఆఫీసును కూల్చకండి అంటూ.. ప్రమాణస్వీకారం రోజు, నిన్న.
స్టే ఇవ్వలేదు. చట్టప్రకారం చర్యలు తీసుకోమని కోర్టు సెలవిచ్చింది.

కానీ పొన్నవోలు తాజాగా ప్రెస్మీట్ పెట్టి రాజకీయంగా దీనిని జనాల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత వైకాపా తరపున లాయర్‌గా నాకు వుంది అంటూ.. విమర్శలు మొదలెట్టాడు. కోర్టులో వాదించడం కన్నా.. జనం ముందు గొప్పగా వాగించడం కోసం, గతంలో ఆయన ప్రభుత్వ ఎజిగా వున్నప్పుడే.. వైకాపా వాడుకోవడం తెలిసిందే.

ప్రభుత్వ సొమ్ములతో గెలిచిన కేసులు వేళ్లమీద లెక్కబెట్టవచ్చు. ఈయన వాదించి ఓడిన కేసులకు అంతేలేదు. ఓడినా కానీ.. తిమ్మిని బమ్మిని చేస్తూ.. వైకాపాకు ఓట్లను తేవడానికి, ఢిల్లీలో కూడా ప్రెస్మీట్లను పెట్టాడు, ఎజి హోదాలో మేస్తూ. రాజీనామా చెయ్యకుండా ప్రభుత్వ ఎజిగా వుంటూ.. ఎన్నికలు అయ్యాక లండన్ వెళ్లి, వైకాపా మత్తులో ఈయన ఏడవడం, ప్రక్కనున్న వారు నవ్వడాన్ని కూడా జనం చూశారు.

సీఆర్డీఏ చట్టంలో సెక్షన్ 114 ప్రకారం, నోటీసులు ఇచ్చినా అక్రమ నిర్మాణం కొనసాగించిన వారిని 3 ఏళ్లు జైల్లో పెట్టాలి. కానీ సెక్షన్ 115 మాత్రమే అమలుచేస్తూ, రెండు గంటల్లో కూల్చేశారు సిఆర్డీయే అధికారులు.

సీఆర్డీఏ పరిధిలో ఏ సంస్థ అయినా, ఎవరైనా, ఎంత తోపు అయినా, అక్రమ నిర్మాణం చేస్తే ఇలాగే అది వ్యవహరిస్తుంది అని గట్టి హెచ్చరిక పంపింది. దాని నగర ప్రణాళిక ప్రకారం, దాని అధికారాన్ని అది వాడుతుంది. అది వైకాపా అని డిస్కౌంట్ ఇస్తే.. రేపు రోడ్లో పోయే రౌడీలు కూడా తోకలు జాడిస్తూ.. రోడ్లల్లోకి కడతారు తమ కొంపలను.

ఇక విషయానికి వస్తే.. మళ్లీ ఇటీవలే పార్టీ మారిన డొక్కా మాణిక్య వర ప్రసాద్ చేత తాడేపల్లిలో గత 2023 జనవరిలో బోటు స్థలమే మా పార్టీ ఆఫీసుకు కావాలని దరఖాస్తు పంపారు. అది సంబంధిత కలెక్టరుకు వెళితే.. ఆయన సిఆర్డీయే సీడ్ యాక్సిస్ రోడ్డుకు మార్కు చేశారు. ఐదు ఎకరాలకు పైగా కాబట్టి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకోమని చెప్పారు. ఇరిగేషన్ ఛీఫ్ ఇంజినీరు నారాయణ రెడ్డి గారు, ఆ స్థలం ఇవ్వడం కుదరదు అని కారణాలు పేర్కొంటూ రిజెక్ట్ చేశారు.

ఇరిగేషన్ అనుమతులు గానీ, కనీసం నిర్మాణం కోసం సిఆర్డీయే అనుమతులు గానీ తీసుకోకుండానే.. లెక్కచేయకుండా ఇష్టం వచ్చినట్లు రాంకీ సంస్థ చేత నిర్మాణం మొదలెట్టారు. ఎన్నికల కౌంటింగుకు ముందే పలుమార్లు నోటీసులు పంపినా బేఖాతరు చేసింది వైకాపా & ఆ నిర్మాణ సంస్థ. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం పట్టించుకోకుండా రిషికొండ మీద జగన్ దంపతులకు సూట్లతో ప్యాలెస్ కట్టినట్లు.. ఎక్కడ పడితే అక్కడ అనుమతులు లేకుండా అధికార అహంకారం చూపింది, వైకాపా.

చట్ట ప్రకారం సిఆర్డీయే కూలదోసింది. కోర్టులకు వెళ్లి వాదించాల్సిన పొన్నవోలుతో.. బులుగు మీడియాలలో వాగిస్తోంది వైకాపా.

టిడిపి పార్టీ లీజుకు తీసుకొన్న స్థలాలకు వీటికి లింకులు పెడుతోంది. జీఓ తెచ్చి, అసెంబ్లీలో పాస్ చేసి కేటాయించుకొన్న స్థలం. అందులో నిర్మాణాలకు సైతం అనుమతులు తీసుకొని చేపట్టింది, చట్టబద్దంగా. మాకు బిపిలు వస్తే మేము ఇలాగే చేస్తాం అంటూ నాటి ప్రతిపక్ష పార్టీ టిడిపి కార్యాలయంలోకి రౌడీలను పంపి, రాడ్లతో రక్తం కళ్ల జూసి, అక్కడ ఆఫీసు మీద, పార్కింగులోని వాహనాల మీద చేసిన విధ్వంసాన్ని యావత్తు రాష్ట్రం చూసింది.

దాని మీద కేసులు ఇచ్చినా.. తీసుకోలేదు. తరువాత తీసుకొన్నా.. ఒక్క అరెస్టు చెయ్యలేదు. ఈ వైకాపా చట్టాలను గౌరవించినట్లు.. చాలా న్యాయంగా వెళుతున్నట్లు పచ్చి అబద్దాలు వల్లిస్తూ.. ఇప్పుడు చట్టబద్దంగా వెళితే ఏడవడం చూస్తుంటే యావగింపు కలుగుతోంది.

జుగుప్సాకర రాజకీయలను వైకాపా మానుకోవడం లేదు. సిఆర్డీయే చట్టం ప్రకారం అమరావతి రైతులు భూములు ఇస్తే, భూములు అలాగే వుంచుకొని, వారికి ఏమి ఇస్తారో తెలియజేయకుండా.. అధికారం వుంది కదా అని ఏకంగా సిఆర్డీయే చట్టాన్ని రద్దు చేసింది అసెంబ్లీలో మద బలంతో వైకాపా. హైకోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు మెట్టుదెబ్బలు తిని, మళ్లీ సిఆర్డీయే రద్దు చట్టాన్ని, అదే అసెంబ్లీ సాక్షిగా వెనక్కి తీసుకొంది. ఇవ్వాళ ఉదయం అదే సిఆర్డీయే చట్టంలో సెక్షన్ల ప్రకారం వైకాపా పునాదులు నేల మట్టం అవ్వడం దేవుడి స్క్రిప్ట్.

బాడుగ ఎందుకు దండగ అని పార్టీ ఆఫీసు మూసేసి, జగన్ లంకంత కొంపను వాడుకొంటున్నారు. పార్టీ ఆఫీసు కోసం సీడ్ ఆక్సిస్ రోడ్డుకు అడ్డుగా వుండే స్థలమే కావాలా దీనికి. భవిష్యత్తు అవసరాల కోసం అనుమతులు ఇవ్వని ఆ భూమి కాకపోతే గతంలో కేటాయించుకొన్న కొరిటపాడులోనే పార్టీ ఆఫీసు కట్టుకొంటే, జనం ఇచ్చిన ఆ 11 సీట్లకు సరిపోదా?
ఇదే దేవుడి స్క్రిప్ట్ అంటే ఇది

– ఏ.బాబు

LEAVE A RESPONSE