24-07-2014 ఈనాడు పేపర్ లొ శ్రీ సంద్దేప్ పాండే గారు ” బరితెగించిన ఇస్రేల్ ” పేరిట రాసిన వ్యాసం పూర్తిగా ఏకపక్షం గా పక్షపాతం తో కూడుకున్నది. అవాస్తవాలను రాసినట్లుగా ఉన్నది .
1) ఇస్రేల్ తో సంబంధాలు 1991-95 మధ్య కాంగ్రెస్ ప్రబుత్వం శ్రీ P.V గారి నాయకత్వం లో మొదలు పెడితే వీరు శ్రీ వాజపాయీ పేరు రాసారు .
2) ప్రతిభావంతులైన అరబ్బులలో హెచ్చుమంది పాలస్తీనా వారు .. కాని వీరు ఎక్కడ ఏ యూనివర్సిటీ లలో చదువుకున్నారో రాయలేదు. ఎందుకంటే ఇస్రేల్ లో అందరు యూనివర్సిటీ లలో చదువుకునే అవకాశం ఉన్నది కాబటి, ఎక్కువ P.H.D లు ఉండటం వింత ఏమి కాదు .
3) అరాఫత్ మరణం తరువాత ఉద్యమం 2 గా కాదు 3 గా చీలింది అవి HAMAS , ALFATAH, మరియు HEZBOLLA. వీరిలో ఒకరు శాంతి అంటే, మరొకరు అల్లర్లు అలజడులు తో నిరంతరం జిహాది చర్యలతో ఉన్నవారు
4) 1947 లో ఇస్రేల్ ఏర్పడినది . OLD TESTAMENT & HISTORICAL PROOF’S మరియు ఖురాన్ ప్రకారము ఇస్రేల్ భూభాగము యూదులదే. THE LOST 10 – TRIBES మరియు చెల్లాచెదురు ఐన ప్రజలు ప్రపంచ దిమ్మరులుగా తిరుగుతూ , ఒక దార్శనికుని కలగా మొదలైన ఇస్రేల్ స్వరాన్ని సాధించుకున్నారు. కాబట్టి భూమి పుత్రులు , మూల నివాసులు యూదులు మాత్రమే.
5) అమాయకుల ఊచకోత ? 3 టీనేజ్ Jewish యువత ను కిడ్నాప్ చేసి ఘోరం గా చంపినది ఎవరు ? నేటీ స్థితి కి ఆజ్యం పోసింది – బీజం వేసింది ఎవరు ? హమాస్ – హెజ్బొల్ల పేరిట రాకెట్ దాడులు చేస్తున్న ” మంద మూకలు ” ఎవరు ?
6) అమెరికా :- పాపం ఈ రచయత కు అఫ్గన్ లిబియా ఇరాక్ లాంటి చోట్ల “DRONES” లకు బలి అయిపోయిన అమాయకులు , చిన్నారులు కనిపించక పోవడం వింతే . అలాగే ” దురాక్రమణ దారుల పీచమనిచేది ” పేరిట అమెరికా ఫై ఉన్న నమ్మకానికి ” తగు ప్రతిఫలం ” ఏదో ఒక CHARITABLE ఫౌండేషన్ ద్వారా అందచ్చు
7) 1100 మంది మేధావులు లలో 65 మంది యూదులు : ఎప్పుడు తాము నమ్మిన ధర్మం సత్యం వైపే ఉండే వారు ప్రతి చోట ఉంటారు. వీరి సంఖ్య యూదులలో ప్రధమం గా ఉంటుంది , ఉదాహరణకు KARLMARX, COM.LENIN. కాని ఇస్రేల్ పట్ల ” సహానుభూతి ” ఉన్న అరబ్బులు గురించి రాస్తే బాగుండేది.
8) ” అమెరికా మేధావి ” గారికి ఇస్రేల్ ఫై వర్షిస్తున్న రాకెట్ లు , హమాస్ లాంటి ” జిహాది ఆయుధ మూకలు ” కనిపించకపోవడము కళ్ళు మూసుకుని పాలు త్రాగే పిల్లి చందం వలె ఉన్నది . ఈ మేధావులకి ” వాంచిత దృష్టి లోపం ” అనే, అదృష్ట వరం ఉండుట వలన ఇరాక్ / ఆఫ్ఘన్ / వియత్నాం లు కనపడవు.
9) నార్వే డాక్టర్ కధ .. ” మానవ కవచం ” పాండే గారు గనక మనసుతో చూస్తే, వారి కళ్ళకి జిహాది మూకలు తమ చుట్టూ చిన్నారులను ఆడవారిని, కవచం గా వాడుకోవటం కనిపిస్తుంది . అలాగే స్కూల్స్ / ప్రార్ధన స్థలాలు ను ఆయుధ నిలవల భాండాగారాలు గా మార్చిన విచిత్ర వికృత యదార్ధం గోచరిస్తుంది.
10) దురాక్రమణ దారు : 6 రోజుల యుద్ధం ఎవరు ఎవరితో చేసారు ? అలాగే విజేత చేతుల్లో పరాజితుల భూభాగాలు ఉండడము ఇస్రేల్ యొక్క దోషం ఎలా అవుతుంది ? పాండే గారు POK, COK ల గురించి వ్యధ చెందుతే బాగుంటుందేమో కదా !!
11) ఇస్రేల్ ANTI-MUSLIM OR ANTI MINORITY ? ఇది నిజం కాదు ఆహ్మదియ్య , షియా , జోర్డాన్ ట్రైబల్ గ్రౌప్స్ మరియు 80,000 మంది భారతీయ యూదులు సురక్షితంగా ఇస్రేల్ లో ఉన్నారు .
12) ఇరాక్- ఆఫ్ఘన్ – పాకిస్తాన్ లలో మైనారిటీ షియా , ఆహ్మదియ్య ,బహాయి, సిఖ్, హిందూ, బుద్ధిష్ట్ , క్రిస్టియన్ ల పై జరుగుతున్నా అమానవీయ దాడులను మొదట ఖండించాలి . ఇది పాండే వంటి మేధావులకి ప్రధాన విషయం అవ్వాలి ..
13) LIVE AND LET LIVE … ఇస్రేల్ అనేది ఒక యధార్థం. కావున దాని ఉనికిని అంగీకరిస్తూ జీవించుట అనే దానికి అరబ్బులు, పాలస్తీనా ప్రజలు సిద్ధపడాలి . దీనికై మేధావులు భాధ్యత తీసుకోవాలి
14) పాలస్తీనా పేరిట నేడు భారత్ లో ఒక వర్గ ప్రజలు ర్యాలీ , ధర్నా , అల్లర్లు చేయటము & LAW AND ORDER TROUBLE కలిగించుట వలన, మెజారిటీ వర్గం లో ఒక అపనమ్మకం కలిగే అవకాశం ఉన్నది .
ఇస్రేల్ మరియు పాలస్తీనా ఇరువురు శాంతి యుతంగా సోదరులు వలే కలిసి ఉండాలని భారతీయుల ఆకాంక్ష.
-హనుమాన్ ప్రసాద్ శర్మ
గుంటూరు