– ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా, అగ్రవర్ణ అహంకారం పూర్తిగా పోయినట్లు లేదు
బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్
హైదరాబాద్: అన్ని వర్గాలు-కులాలను సమదృష్టితో చూసి, సమ న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ, రేవంత్‌రెడ్డిలోని అగ్రకుల అహంకార ధోరణి పోలేదని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు.
‘రాహుల్‌గాంధీ చెప్పారు కాబట్టే కులగణన చేస్తున్నా’నడం రేవంత్‌లోని అగ్రకుల అహంకారానికి నిదర్శరమని, దీన్నిబట్టి ఆయన రాజ్యాంగబద్ధమైన సీఎం సీటులో కూర్చునేందుకు అనర్హుడని దాసోజు ఎక్స్ వే దికగా చేసిన ట్వీట్లో విరుచుకుపడ్డారు.
దాసోజు తన ట్వీట్ ఇంకా ఏమన్నారంటే..
“ఆత్మశుద్ధిలేని యాచార మదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా? విశ్వదాభిరామ వినురవేమ” అన్నట్లు అగ్రకుల అహంకారం ఉన్న రేవంత్ రెడ్డికి కులగణన పై స్వతహాగా చిత్తశుద్ధి లేదనేది చెప్పకనే చెప్పిండు.
కేవలం రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు కాబట్టి నేను కుల గణన చేస్తున్నాను అనడం, ఆయన అగ్రకుల ఆధిపత్య అహంకారానికి నిదర్శనం. బిసిల అభ్యున్నతి పట్ల తనకు బాధ్యత లేనట్లు మాట్లాడటం నమ్మకద్రోహం సామాజిక నేరం, రాజ్యాంగ ఉల్లంఘన.
రేవంత్ రెడ్డికి రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా, అగ్రవర్ణ అహంకారం పూర్తిగా పోయినట్లు లేదు. ఇంతటి వివక్షపూరిత కుల ఆధిపత్య మనస్తత్వం ఉన్న రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అనర్హుడు.
మరీ ముఖ్యంగా కుల గణన నిర్వహించడానికి ఏమాత్రం నైతికత లేదు, అర్హత అసలే లేదు. ఇంత ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న పెద్దమనిషి కులగణన చేయడు, అణగదొక్కబడ్డ బీసీలకు న్యాయం చేయడు.
పారా హుషార్!!!