Suryaa.co.in

Andhra Pradesh

వార్డు సభ్యుడిగా గెలవలేని సజ్జల 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుని తప్పుపట్టడం సిగ్గుచేటు

• కేసుల భయంతో ఢిల్లీపెద్దల కాళ్లు పట్టుకుంటున్న జగన్ రెడ్డి, ప్రజలు టీడీపీని అదరిస్తున్నారన్న అక్కసుతోనే తప్పుడు కేసులతో చంద్రబాబుని జైలుకు పంపాడు
• సీబీఐ, ఈడీ సహా 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డే కేసులనుంచి తప్పించుకోవడానికి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, నాలుగేళ్లుగా కోర్టులకు హాజుకాకుండా తప్పించుకుంటున్నాడు
• బాబాయ్ హత్యకేసు, కోడికత్తి కేసులో తన పాత్ర, ప్రమేయం ఉన్నా బుకాయిస్తూ నిస్సిగ్గుగా ఢిల్లీ పెద్దల కాళ్లుపట్టుకొని అధికారంలో కొనసాగుతున్నాడు
• జగన్ రెడ్డి మెప్పకోసం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం తప్ప సజ్జలకు తెలిసింది శూన్యం
• చంద్రబాబుని జైలుకు పంపారని ఆనందంతో సంబరాలు చేసుకోవడం రోజా నీతిమాలిన తనానికి నిదర్శనం
• టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత

కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విజనరీ నాయకుడు చంద్రబాబుని ప్రిజనరీ, సైకో ముఖ్యమంత్రి జైలు పాలు చేశాడని, చేయని తప్పుకి టీడీపీ అధినేతను జైలుకు పంపారన్న భావన ప్రజల్లో బలంగా పాతుకుపోయిందని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఆచంట సునీత స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే…

“ చంద్రబాబుని మానసికంగా క్షోభ పెట్టాలన్న జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచన తప్ప, వాస్తవంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ఆవగింజంత కూడా అవినీతి లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పోలీస్ వ్యవస్థను వైసీపీకి ఊడిగంచేసే విభాగంగా మార్చి, సీఐడీ, సీబీసీఐడీ విభాగాలను తన జేబుసంస్థలుగా మార్చుకున్న జగన్ రెడ్డి గిట్టని వారిపై తప్పుడు కేసులు, కక్షసాధింపులే పరమావధిగా ముందుకువెళ్తున్నాడు.

నాలుగేళ్ల పాలనలో ఇసుక, మద్యం మాఫియాల మాటున వేలకోట్లు దిగమింగి, ప్రకృతి వనరులు, ప్రజల…ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా కాజేశాడు. పేదలకు ఇచ్చే సెంటు పట్టా భూముల్లో కూడా జగన్ వేలకోట్లు దిగమింగాడు. దోపిడీ, అవినీతి రెండుకళ్లుగా విధ్వంసపు పాలనతో రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేసిన జగన్ రెడ్డి, మచ్చలేని నాయకుడైన చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టే స్థాయికి దిగజారాడు. సీబీఐ, ఈడీ సహా, ఇతరత్రా 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డిని మించిన మేనేజ్ మెంటర్ ఎవరూ లేరు.

బాబాయ్ హత్యకేసు, కోడికత్తి కేసుల్లో తనపాత్ర, ప్రమేయం కప్పిపుచ్చ డానికి ఢిల్లీపెద్దల కాళ్లు పట్టుకొంటున్న జగన్ రెడ్డి బాగోతం ప్రజలకు తెలియదన్నట్టు సజ్జల నీతివాక్యాలు చెబుతున్నాడు. చట్టం తన పని తాను చేస్తుందని వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని సజ్జల చెప్పడం హాస్యాస్పదం. చట్టాలు, న్యాయం, రాజ్యాంగం గురించి వైసీపీనేతలే మాట్లాడాలి. ఒక ఆంగ్ల ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న వైసీపీ నేత శిల్పా రవిచంద్రా రెడ్డి స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి ఇది అని చెప్ప లేక నీళ్లు నమిలాడు.

కన్వేల్కర్ వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ మొత్తం వ్యాల్యూ ఎంత… దానిలో జరిగిన అవినీతి ఎంత? ఆవగింజంత అవినీతి లేని ప్రాజెక్టులో కేవలం చంద్రబాబుని ఇరికించాలన్న కుట్ర తప్ప మరేమీ లేదు. డిజైన్ టెక్ సంస్థ ఎండీ వికాన్ కన్వేల్కర్ ఏంచెప్పారో వైసీపీనేతలకు, ప్రభుత్వానికి అర్థంకావడంలేదా? ఏపీలో మేం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలు చే సి, ఎంతో మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించామని, ఆ ప్రాజెక్ట్ వల్ల తమకు ఇంకా నష్టమే వచ్చిందని కన్వేల్కర్ చెప్పలేదా?

ఆంధ్రప్రదేశ్‍లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని, మా కృషికి ప్రయత్నా నికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంచి అభినందన లభిస్తుందని ఆశిస్తే ఇలాంటి ప్రచారం చేయడం ఏమిటని కన్వేల్కర్ ప్రశ్నిస్తోంది నిజంకాదా? ఎవరైనా ఈ స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలకు వెళ్లి పరిశీలిస్తే వాటి నిర్మాణానికి అయిన ఖర్చు.. శిక్షణకు అవుతున్న నిర్వహణ వ్యయానికి సంబంధించిన వాస్తవాలు తెలుస్తాయన్న కన్వేల్కర్ మాటలపై వైసీపీనేతలు ఏం చెబుతారు?

మేం చేసిన పనిలో ఏమైనా లోపం ఉన్నా.. సదుపాయాల్లో ఏదైనా తప్పిదాలున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా దృష్టికి తీసుకురావాల్సిందని, అది చేయకుండా నేరుగా కేసులు దాకా వెళ్లడం, చంద్రబాబు నాయుడిలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపడం తప్పన్న కన్వేల్కర్ కు జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?

ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నప్పుడు కానీ.. తర్వాత కానీ.. తానెప్పుడూ అప్పుటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవలేదని, మొత్తం ప్రాజెక్టుకైనా ఖర్చును ఎప్పుడు ఏ వెండార్‍ కి ఎంత చెల్లించామన్న వివరాలు ఇన్‍వాయిస్‍లతో స్పష్టంగా అందజేస్తున్నామని, స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు తాము రూ.356 కోట్లు ఖర్చుపెట్టామని, ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాజెక్టు వల్ల తమకు రూ.17.8 కోట్ల నష్టం వాటిల్లిందన్న కన్వేల్కర్ వ్యాఖ్యలపై జగన్ రెడ్డి అండ్ కో ఇప్పుడు ఏం కట్టుకథ లు అల్లుతారు? స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వల్ల లబ్ధిపొందిన యువత, చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలపై ఆగ్రహంతో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే తాము ఎలా శిక్షణ పొందుతామని, కేవలం కుట్రతోనే చంద్రబాబుని జైలుకు పంపారంటున్న యువ తకు ఏం సమాధానం చెబుతారు?

రోజా వ్యాఖ్యలు ఆమె నీతిమాలిన తనానికి నిదర్శనం
నేరచరిత్ర కలిగిన వారిని టీటీడీ సభ్యులుగా నియమించిన జగన్ రెడ్డి, నీతి..న్యాయం అనే మాటలు చెప్పడం విడ్డూరంగా ఉంది. కోర్టులోని కేసు ఫైళ్లు చోరీచేసిన వారు చట్టా నికి అందరూ సమానమేనంటూ నీతి పన్నాలు వల్లించడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. చంద్రబాబుని జైలుపాలు చేశారన్న ఆనందంతో సంబరాలు చేసుకోవడం రోజా నీతిమాలినతనానికి నిదర్శనం. తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన తెలుగుదేశాన్ని, చంద్రబాబుని తూలనాడుతున్న రోజాను నగరి ప్రజలు శాశ్వతంగా వదిలించుకోవ డానికి సిద్ధమయ్యారు.

జగన్ రెడ్డి కుట్రల్న ఎదిరించి వచ్చేఎన్నికల్లో టీడీపీని గెలిపించి, చంద్రబాబుని ముఖ్య మంత్రిని చేయాలన్న ధృడసంకల్పంతో ప్రజలు ఉన్నారు
కేవలం ప్రజల్లో చంద్రబాబు, లోకేశ్ లకు లభిస్తున్న ఆదరణ చూసే ఓర్వలేక, తనకు, తనప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో వచ్చిన సర్వే లను చూసి తట్టుకోలేకే దుర్మార్గపు ఆలోచనతో జగన్ రెడ్డి ఇంతటి దారుణానికి తెగిం చాడు. చంద్రబాబుని అరెస్ట్ చేయడం మొదలు … ఆయన్ని జైలుకు పంపేవరకు వ్వవహరించిన తీరు మొత్తం జగన్ రెడ్డి కక్షసాధింపులో భాగమే అన్నట్టుగా సాగింది.
రాష్ట్రంలో జరుగుతు న్న దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబే లక్ష్యంగా జగన్ నడుపుతున్న కుట్ర రాజకీయాలను, దుర్మార్గాలను ఎదిరించి, 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలన్న ధృఢసంకల్పంతో ప్రజలు ఉన్నారు.” అని సునీత తెలిపారు.

LEAVE A RESPONSE