Suryaa.co.in

Telangana

గురుకుల పాఠశాలకు కనీస వసతులు లేని బిల్డింగ్ లో ఏర్పాటు చేయడం సిగ్గుచేటు

– ప్రతి కుటుంబానికి వాళ్ళు ఇళ్లల్లో వెళ్లే వరకు కాంగ్రెస్ పార్టీ నుండి బియ్యం పంపిణీ
– సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి

నల్గొండ: నాగార్జునసాగర్ ఎడమ కాలువ సుమారుగా 60 సంవత్సరాలు కావడంతో కాలువల భద్రతలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. పెద్దవూర మినీ గురుకుల పాఠశాలకు కనీస వసతులు లేని బిల్డింగ్ లో ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. మినీ గురుకుల పాఠశాల విద్యార్థులు సురక్షితంగా కాపాడిన అధికారులకు, పోలీసు ఉన్నత అధికారులకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు.

ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదు. నిడమనూరు అభివృద్ధి చేయలేదని, మీడియా ముందు గొప్పలు చెప్పుకునే వాళ్ళు నిడమనూరు కి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలి. కాలువ గండిపడి నష్టపోయిన రైతులకు, తక్షణమే పంట నష్ట సహాయంగా 15000 నుండి 20,000 ఆర్థిక సాయం చేయాలి. .నిడమనూరు నర్సింగగూడెం గ్రామంలో ఇళ్లల్లో నీరు చేరిన బాధితులను ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలి. ఇళ్లల్లో నీరు చేరుకున్న ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి వాళ్ళు ఇళ్లల్లో వెళ్లే వరకు కాంగ్రెస్ పార్టీ నుండి బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE