తిరిగిరాని రాణి..!

Spread the love

రాజసం రాలిపోయింది..
సౌకుమార్యం సొమ్మసిల్లింది..
అందం అలసిపోయింది…
తొంభై ఆరేళ్ల జీవితం
ఆగిపోయింది..!

ఎలిజిబెత్ రాణి
నువ్వు నేనూ
మనమెవ్వరం
పుట్టకమునుపు
భూమికి దిగివచ్చిన మెరుపు..
ఓ మైమరపు..
దొరల సీమలో
ముగ్ధమోహన దొరసాని
ముదిమి సైతం తనను చేరనలవి కాని
భూలోకపు దేవత
బకింగ్ హాం భవంతిలో
వెలసిన అందమైన నెలత
తారగా మెరిసి..
ధృవతారగా వెలసి..
తిరిగి తారాలోక విహారానికి
బయలుదేరిన రాణి
నవలోకపు పూబోణి!

అఖండ సంపద
అంతులేని రాజభోగాలు
పట్టు పరుపులు
చీనిచీనాంబరాలు
ఒకనాటి అశ్వరధాలు
ఆధునిక వాహనాలు
ఇవేవీ వెంటరాని
చివరి ప్రయాణం
మహా మహా చక్రవర్తులకైనా
మహారాణులకైనా
తప్పని మృత్యువు
ముగిసిన మహావైభోగ
క్రతువు!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

Leave a Reply