-రోశయ్య మృతికి శాసన సభలో సంతాపం తెలపకపోవడం ఆర్యవైశ్యులను అవమానించడమే
– టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేశ్
రాష్ట్రానికి సుధీర్ఘకాలం ఆర్ధిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కీ.శే.కొణిజేటి రోశయ్య పట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చిన్న చూపు నేటి సభలో వ్యవహరించిన తీరుతో మరోసారి బట్టబయలైంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి చనిపోతే.. జగన్ రెడ్డి కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదు. ఈ రోజు అసెంబ్లీలో కనీసం సంతాపం తెలపడానికి కూడా జగన్ రెడ్డికి మనసు రాలేదంటే.. ఆర్యవైశ్యుల పట్ల ఎంత చిన్న చూపో అర్ధమైంది.
వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరొందిన రోశయ్య మరణం పట్ల కూడా ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఆర్యవైశ్యులను అవమానించేలా ఉంది. తెలుగు ప్రజల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా.?
గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు.. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మరణిస్తే చట్ట సభల్లో సంతాప తీర్మానం ప్రవేశపెట్టి.. అదే సభలో హైదరాబాద్ లోని యూసఫ్ గూడ ఇండోర్ స్టేడియం, బొటానికల్ గార్డెన్, కర్నూలు జిల్లా తుంగభద్ర నదీ తీరంలో స్మారక స్తూపం ఏర్పాటు చేసి గౌరవించాం.
కానీ నేడు.. మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ లాంటి అత్యున్నత స్థాయిలో పని చేసిన వ్యక్తికి అసెంబ్లీలో సంతాపం తెలిపేందుకు కూడా మనసురాకపోవడం దుర్మార్గం. ఆర్యవైశ్యులను అవమానించిన వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రాష్ట్రంలోని ఆర్యవైశ్యులంతా సిద్ధంగా ఉన్నారు.