ఉగాది
ప్రభవాది
క్రమంలో క్రోధి.
క్రోధం కానిది
అనుకూలతకు వారధి.
ఆరు ఋతువులకు నాంది
ఆరు రుచులను ఇచ్చేది.
చైత్ర మాసం తో పునాది
తెలుగు వారికి ఇది అనాది.
కొమ్మల పత్రాలు ఆవారించేది
కోయిల గాత్రాన్ని సవరించేది.
అవని పచ్చదనంతో ప్రకృతి
అమనికి ఆయెను ఆకృతి.
పచ్చడి ప్రసాదం గా తినిపించేది
పంచాంగ విశేషాలను వినిపించేది.
ఉగాది ….. ఉగాది
అందరికీ ఇవ్వాలి ఉపాధి.