Suryaa.co.in

Andhra Pradesh

జగన్ తీర్థయాత్రలకు పోతే మంచిది

-టి డి ఆర్ బాండ్ల విషయంలో కూడా నిష్పక్షపాత విచారణ
-ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు
-టిటిడిలో ఐదేళ్ళలో జరిగిన అన్నిటిపైనా జ్యుడీషియల్ ఎంక్వైరీ
-ఐదేళ్ళలో అభిషేక దర్శనం, వస్త్ర దర్శనం ఎవరికిచ్చారో చెప్పగలరా?
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి

విజయవాడ: అంధకార ప్రదేశ్ గా ఉన్న ఏపీని అభివృద్ధి ప్రదేశ్ గా మార్చేందుకు కూటమికి పట్టం కట్టారు. స్టిక్కర్ సీఎం గా మిగిలిపోయారు జగన్. గోడల‌ మీదకి వెళ్ళారే తప్ప గుండెల్లోకి వెళ్ళలేదు. పంచభూతాలను ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేసి ఏపీని కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా చేసాడు జగన్‌‌‌.

కలియుగ దైవం వద్ద మొదలైన ప్రక్షాళన ఎఫెక్ట్ తాడేపల్లికి తగిలింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ధనం పైనే వీళ్ళ కళ్ళుపడ్డాయి. టిటిడి పనులలో కమీషన్లు తీసుకున్నాడు కరుణాకర్ రెడ్డి. టిటిడి ని రాజకీయ పునరావాసం గా మార్చేసారు. గాజు బాటిళ్ళలో నీరు దొరుకుతుంది తిరుమలలో. అందులో కూడా వాటా ఉందట.

తిరుమల ఒక ఆధ్యాత్మిక రాజధాని. వారి ఐదేళ్ళలో అభిషేక దర్శనం, వస్త్ర దర్శనం ఎవరికిచ్చారో చెప్పగలరా? టిటిడిలో ఐదేళ్ళలో జరిగిన అన్నిటి పైనా జ్యుడీషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మా కూటమి పైన ఉంది.

జగన్ జీవితాంతం కళ్ళు మూసుకునే ఉండాలి. కేంద్రానికి నీతో అవసరం ఏముందయ్యా‌? మీ పరిమితి పరిధి లో మీరు మాట్లాడండి. ఏపీ ప్రజలు వైసీపీ కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లాగా.. ఏపీ లో కూడా కొందరికి కదిలిపోతుంది. టి డి ఆర్ బాండ్ల విషయంలో కూడా నిష్పక్షపాత విచారణ జరుపుతాం.

2020 ఆగష్టులో టిటిడి నిధులు 5000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తే తిప్పికొట్టాం. వడ్డీ కాసుల వాడికి మొత్తం కట్టాల్సినది కట్టకపోవడంతో శ్రీవారి ఆగ్రహంతో వెనక్కి పోయింది వైసీపీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుకు మేం సిద్ధమయ్యాం. జగన్ ఓదార్పు యాత్రలకు కాదు.. తీర్థయాత్రలకు పోతే మంచిది..

LEAVE A RESPONSE