-వినుకొండ పట్టణంలో వైసీపీని వీడి టిడిపిలో భారీగా చేరిక
-జగన్ రెడ్డి అరాచక పాలనను వ్యతిరేకిస్తున్న ప్రజలు
-పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు
రాబోయే ఎన్నికల్లో భారీ ఓటమితో వైసిపి పార్టీ ప్రజాక్షేత్రం నుండి తుడిచిపెట్టుకు పోయేలా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.
వినుకొండ పట్టణంలోని రెడ్డి నగర్ కు చెందిన వైసిపి నాయకుడు చికెన్ బాబు ఆధ్వర్యంలో 52 కుటుంబాలు పట్టణ పార్టీ అధ్యక్షులు ఆయుబ్ ఖాన్, పఠాన్ సుభాని అధ్యక్షతన వైసీపీని వీడి జీవి ఆంజనేయులు సమక్షంలో టిడిపిలో చేరారు. చికెన్ బాబు తో పాటు పార్టీలో చేరిన ముళ్ళమూరు మస్తాన్, ముస్తఫా, బాజీ, అమీరుద్దీన్, జియావుద్దీన్, జక్రి మౌలాలి, రామారావు, యోహాన్ ,దరియా, సుబ్బారావు, వెంకట్రావులతో పాటు చికెన్ బాబు బంధుమిత్రులు, అభిమానులు పార్టీలో చేరగా జీవి ఆంజనేయులు పచ్చ కండువాలు కప్పి పార్టీలకు సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలనను వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. అవినీతి అక్రమాలతో నిండిపోయిన అసమర్ధ, అహంకార ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాలనతో విసిగిపోయిన వైసిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా టిడిపిలో చేరుతున్నారని తెలిపారు. టిడిపి హయాంలో చేసిన నియోజకవర్గ అభివృద్ధిని గుర్తు తెచ్చుకున్న ప్రజలు టిడిపికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని వివరించారు.
కార్యక్రమంలో సౌదాగర్ జానీ భాష, పివీ సురేష్ బాబు,గంధం కోటేశ్వరరావు కౌన్సిలర్,పత్తి పూర్ణచంద్రరావు ,వంకాయలపాటి పేరయ్య లాయర్ సిద్దయ్య మీసాల శీను కాలంగి రాజు టుమాటి కాశి గోవిందరాజులు గోల్డ్ కరిముల్లా, పువ్వాడ కృష్ణ, సుభాని,కల్లూరి కరిముల్లా, దూల నాగార్జున ,వార్డు పేషెంట్ దావీదు అశోక్ పులి నాగరాజు సుభాని అశోకు తదితరులు పాల్గొన్నారు.