Suryaa.co.in

Telangana

అల్లూరి సీతారామరాజును గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుడి విధి: కేటీఆర్‌

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుడి విధి అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. వీరుడు మన దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని చెప్పారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. అల్లూరి జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. ట్యాంక్ బండ్ పై అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకకు కేటీఆర్ తో పాటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

LEAVE A RESPONSE